శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గాయి | Samsung Galaxy A7 (2017), Galaxy A5 (2017) Price Cut in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గాయి

Published Fri, Aug 18 2017 5:24 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గాయి - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గాయి

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌, తన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించింది. గెలాక్సీ ఏ7(2017), గెలాక్సీ ఏ5(2017) ధరలను భారత్‌లో శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ పేర్కొంది. ఏ-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను శాంసంగ్‌ శుక్రవారం సవరించింది. ఈ సవరణలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్‌ ధర 26,900 రూపాయల నుంచి 22,900 రూపాయలకు తగ్గింది. ఇకనుంచి శాంసంగ్‌ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్‌ను 25,900 రూపాయలకే విక్రయించనున్నట్టు తెలిపింది. దీని అసలు ధర 30,900 రూపాయలు. రాబోతున్న పండుగ సీజన్‌ను టార్గెట్‌గా తీసుకుని ఈ మేరకు ధరలు తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. 
 
ఈ రెండు ఫోన్లు మార్చి నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.28,990గా, గెలాక్సీ ఏ7(2017) ధర రూ.33,490గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ప్రధాన ఆకర్షణ తమ గెలాక్సీ ఎస్‌7- స్టయిల్‌ డిజైన్‌, తక్కువ వెలుతురు ఆప్టిమైజేషన్‌లో కెమెరా, కెమెరా యూఎక్స్‌, అదేవిధంగా దుమ్ము, నీళ్లను తట్టుకునే సామర్థ్యంతో ఏపీ68 రేటింగ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కేవలం స్క్రీన్‌ సైజ్‌, బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే విభిన్నంగా ఉంటాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపు సమానం. 
 
గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్‌ 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 3000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉండగా... గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్‌ 5.7 అగుళాల ఫుల్‌ హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 3600 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, శాంసంగ్‌ పే సపోర్టు, 1.9 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ఎస్‌ఓసీ, 16ఎంపీ రియర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement