ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కొత్తూరు: ఓటు అనే రెండక్షరాలకు మన తలరాతను మార్చే శక్తి ఉంది. దానిని సద్వినియోగం చేసుకుంటే సమాజంలోని కుళ్లు కడిగిపారేయొచ్చు. అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉంది. అయితే, ఓటుకు ఉన్న శక్తిని తెలుసుకోకపోవడంతో దాని వినియోగించేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కును వినియోగించే అవకాశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–326 కల్పించింది. దేశ, రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించేందుకు ఓటు ఎంతో ఉపయోగపడుతుంది. రాజ్యాగం కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇంతటి శక్తి ఉన్న ఓటును వినియోగించుకోవడంలో జనం నిరాసక్తత కనబరుస్తున్నారు. ఓటు హక్కు వినియోగం, అవశ్యకత, దాని విలువను తెలియజేసేందుకు అధికారులు ఓటరు దినోత్సవంతోపాటు పలు అవగాహన కార్యక్రమాలు వినియోగించినా ఫలితం కనిపించడం లేదు.
వెల్లడిస్తున్న నివేదికలు
గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. 13 నియోజకవర్గాల్లో మొత్తం 13 లక్షల 34 వేల 164 మంది ఓటు వేయలేదు. అందులో అధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3 లక్షల 8 వేల 337మంది, ఎల్‌బీనగర్‌లో 2,78 లక్షల మంది ఓటుహక్కును వినియోగించకోలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment