ఆ ‘కుర్చీ’కి... ఖర్చెక్కువే..!
అది ‘స్థానిక’ సంస్థలో అత్యంత హోదా కలిగిన పదవే. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగేది కూడా. అలాంటి దానిపై రాజకీయ నేతలు ఆసక్తి చూపకుండా ఉంటారా. ఉండలేరు..ఇప్పుడు మాత్రం అనాసక్తి చూపుతున్నట్లు అన్ని పక్షాలకు చెందిన నేతలు గుంభనం పాటిస్తున్నారు.
ఎందుకంటే..‘తీన్‌మార్’ ఎన్నికల నేపథ్యంలో ..ఏ ఖర్చు ఎవరినెత్తిన పడి ఎంతకు పెరుగుతుందో తెలీక సతమతమవుతున్నారు. పార్టీల పెద్దలైతే ఎన్నికల్లో ‘అన్ని విధాలుగా’ గట్టెక్కించే వారుంటే జడ్పీచైర్మన్ గిరీని వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో దుర్భిని వేసి వెతుకుతున్నారు. ఇరు పక్షాలకూ ఆమోదమైతే అప్పుడు మాత్రమే పేర్లు ఖరారై ఆ కుర్చీకి ఎంతో పోటీ ఉంటుందన్నది అర్థం అవుతుంది. అంతవరకూ..ఈ సస్పెన్స్ కొనసాగుతుందన్న మాట.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నామినేషన్ల ప ర్వం మొదలైనా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశాలపై అన్ని పార్టీల్లోనూ అ స్పష్టత కనిపిస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై దృష్టి సారించాయి. 12 ఎస్సీ రిజర్వుడు జడ్పీటీసీ స్థానాలతో పాటు, 22 జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం వుంది.
ఈ పద వి దక్కాలంటే జడ్పీటీసీగా గెలవడం కీలకం కావడంతో ఔత్సాహికులు అనువైన స్థానం కోసం అ న్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.నేతల దృష్టి అ టు మున్సిపల్, ఇటు సాధారణ ఎన్నికలపై ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎం పీపీ రిజర్వేషన్ కేటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరగడం లేదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో ముగియనుంది.
మున్సిపల్ కౌన్సిలర్లుగా టికెట్లు ఆశించిన భంగపడిన అసంతృప్తులను బుజ్జగించడంలో అన్ని పార్టీలు, నేతలు బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి వార్డుల్లో పార్టీ తరపున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు, జడ్పీ చైర్మన్ తదితర అంశాలపై కసరత్తు మొదలు పెడతామని నేతలు చెప్తున్నారు.
వలసలతో కొత్త తలనొప్పి
నామినేషన్ల వేళ పార్టీలో చేరుతున్న ద్వితీయ శ్రేణి నేతలతో అన్ని పార్టీల్లోనూ కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. బీసీ, జనరల్ స్థానాల్లో పార్టీలో ఉన్న పాత, కొత్త నేతల నడుమ టికెట్ల కోసం పోటీ నెలకొంది. అందరూ కలుపుకుని పనిచేయాలని పార్టీ పెద్దలు చెప్తున్నా కింది స్థాయి నేతలు వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో చేరికలతో బలపడాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌లో ఈ రకమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను నియోజకవర్గ ఇంచార్జిలకు పార్టీ అధిష్టానాలు అప్పగిస్తున్నాయి. జిల్లా పరిషత్ చై ర్మన్ ఎన్నికలో జడ్పీటీసీ సభ్యులు కీలకం కావడంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయి నేతల పర్యవేక్షణలో అ భ్యర్థుల ఎంపిక చేసేలా కసరత్తు జరగనుంది. మండల స్థాయిలో బలమైన నాయకత్వం వున్నా పార్టీలకు సంబంధిత రిజర్వుడు కేటగిరీ అభ్యర్థు లు దొరక్క పోవడంతో కొత్త తలనొప్పి ఎదురవుతోంది. కేడర్‌లో క్రియాశీలంగా వున్న వారిని అ భ్యర్థులు నిలిపేందుకు పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తమకు ఆర్దికంగా చేయూతనిస్తే తప్ప పోటీ చేయలేమంటూ సదరు ఔత్సాహికులు చెప్తున్నారు.
ఇన్నిరకాలైన ఎన్నికలకు ఒకే సారి నిధులు సమకూర్చడం తమ వల్ల కాదంటూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు చెప్తున్నారు. ఆర్దికంగా బలంగా ఉండి జడ్పీటీసీ అభ్యర్థులకు కొంత మేర ఆర్దిక సాయం చేయగలిగే స్థాయిలో ఉన్న వారికి జడ్పీ చైర్మన్ పదవి క ట్టబెడతామంటూ కొన్ని పార్టీలు వల వేస్తున్నా యి. మొత్తం మీద నామినేషన్ల పర్వం మొదలైనా ఏ పార్టీలోనూ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న నేతలు బయట పడటం లేదు.