సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యవరణ అనుమతులు వచ్చాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోర్టులో సమర్పించిన అఫడవిట్ కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అందేకాకుండా అంతరరాష్ట్ర ఒప్పందాలు పూర్తయ్యాయని..ఇతర అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చినట్టు కేసీఆర్ తెలిపారు.
అదేవిధంగా సమావేశంలో మంత్రి హరీష్ రావుపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజలు హరీష్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి తమకు నీళ్లు అందిస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను ఇస్తామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని నెలన్నరలోపు పూర్తిచేసి, ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని వెల్లడించారు. సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్‌రావు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు, జెన్‌కో, ట్రాన్స్‌కో, అటవీశాఖ అధికారులతో పాటు వర్సింగ్ ఏజెన్సీలు హాజరయ్యారు. ప్రాజెక్టుల పరిశీలన భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రెండు రోజుల పాటు కేసీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment