- దేవాదాయ సర్వశ్రేయోనిధి నుంచి మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఏడు కొండలవాడితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం సిద్ధించినందున ఆ మొక్కులను తీర్చాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆ మొక్కులేమిటో కూడా వివరించారు. ఇప్పుడు వాటిని తీర్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధి నుంచి రూ. 5.59 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొక్కుల్లో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.