యువతిపై గ్యాంగ్‌రేప్?
- పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
హైదరాబాద్: నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై ఏడుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న యువతి (22) హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న బాబాయి, పిన్ని ఇంట్లో ఉంటుంది. కాగా ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌కు వెళ్లి వస్తున్న యువతిని గాంధీకుటీర్కు చెందిన మాజిద్ బలవంతంగా ఓ పార్కులోకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీంరెడ్డి గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాము రేప్ చేయలేదని నిందితులు పేర్కొంటున్నారు. వైద్య పరీక్షల నివేదిక వస్తేగాని వాస్తవాలు వెలుగు చూడవని పోలీసులు చెబుతున్నారు.