'ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరు' | Hyderabad Traffic Police implements e- challan | Sakshi
Sakshi News home page

'ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరు'

Published Thu, Jan 8 2015 3:58 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM

'ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరు' - Sakshi

'ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరు'

హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు జంట కమిషనరేట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ-చలానా ద్వారా జరిమానా రుసుం చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.

వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారా చెల్లింపులు జరపొచ్చని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా విధానాన్ని త్వరలోనే 9 జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement