చిట్యాల : సీపీఐ మావోరుుస్టు, సీపీఐం(ఎంఎల్) పీపుల్స్‌వార్ పేరిట మండలంలోని వివిధ గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తోంది. కేవలం నెల వ్యవధిలోనే రెండు గ్రామాల్లో పోస్టర్లు వేసిన అజ్ఞాత వ్యక్తులు పలువురిని హెచ్చరించడం చర్చనీయూంశమైంది. గత నెల 4న వెలిశాలలో పలు పార్టీల నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేర వాల్‌పోస్టర్లు వెలిశాయి. దీనిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పలువురు మాజీలను ఠాణాకు పిలిచి ఆరా తీశారు. కొందరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఈసంఘటనను మర్చిపోకముందే గురువారం రాత్రి చల్లగరిగె గ్రంథాలయం భవన గోడకు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్, దామోదర్ పేరిట పలువురిని హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్లు వెలిశారుు. నెల వ్యవధిలోనే అజ్ఞాత నక్సల్స్ పేరిట రెండు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలియడం, పలువురిని హెచ్చరించడంతో టార్గెట్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నారుు.
ఇన్‌ఫార్మర్లు పద్ధతులు మార్చుకోవాలి..!
చల్లగరిగలోని ఓ పార్టీ మండల అధ్యక్షుడు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారని, ముఠాలు తయారు చేసి ప్రజలను బెదిరిస్తున్నాడని వాల్‌పోస్టర్‌లో రాశారు. మరో వ్యక్తి పలు కుటుంబాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని పేర్కొన్నారు. తాను ప్రజాప్రతినిధినంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని తెలిపారు. మరో ఇద్దరు పంచారుుతీలు చేస్తూ బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేనిపక్షంలో శిక్ష తప్పదని వాల్‌పోస్టర్లలో హెచ్చరించారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వాల్‌పోస్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
‘వార్’ పోస్టర్ల కలకలం
Published Sat, Sep 5 2015 4:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement