కేఎల్‌ఆర్ చిరస్మరణీయుడు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పాల్వంచ : కేఎల్‌ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి చిరస్మరణీయుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేఎల్‌ఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కేఎల్‌ఆర్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలోని కేఎల్‌ఆర్ ఘాట్ వద్ద విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేఎల్‌ఆర్ విద్యాభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.
అనంతరం విద్యార్థులను పలకరిస్తూ.. ఘాట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కేఎల్‌ఆర్ విద్యాసంస్థలు ఎలా అభివృద్ధి చెందాయో.. తాను నాటిన మొక్కలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి, కేఎల్‌ఆర్ సోదరులు కాటిరెడ్డి శంకర్‌రెడ్డి, కాటిరెడ్డి గోవిందరెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జునరెడ్డి, రోశిరె డ్డి, ప్రసాద్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, కాశీనాథ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
డీఏవీ పాఠశాలలో..
అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డీఏవీ పాఠశాలకు చేరుకోగా.. సీఈ బాదావత్ లక్ష్మయ్య, ఎస్‌ఈలు ఎల్లయ్య, రమేష్, ఏడీఈ నరేష్, ప్రిన్సిపాల్ వీర య్య, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థారుుకి ఎదగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల శివారెడ్డి, ఏసుపాదం, మండల అధ్యక్ష, కార్యదర్శులు బాలినేని నాగేశ్వరరావు, పిట్టల రామారావు, కొల్లు వెంకటరెడ్డి, డాక్టర్ యుగంధర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, రేవంత్, సునీల్‌రెడ్డి, కలగట్ల నాగిరెడ్డి, ఇందు వరప్రసాద్, పాతూరి లక్ష్మారెడ్డి, జామ్లా పాల్గొన్నారు.