చిరు జల్లులే..
►5.8మి.మీ వర్షపాతం నమోదు
►అయిజలో అత్యధికం
పాలమూరు : జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం పలు మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. పగలంతా ఉక్కపోతగా ఉన్నప్పటికీ సాయంత్రం వేళ చోటుచేసుకున్న వాతావరణ మార్పు కారణంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ విభాగం వారు సూచించిన మేరకు జిల్లా వ్యా ప్తంగా 5.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయిజ మండలంలో 43.4 మిల్లీ మీటర్ల వర్షపాతంతో అత్యధికంగా నమోదు కాగా.. తరువాతి స్థానంలో మహబూబ్‌నగర్ పరిధిలో 36.8 మి.మీ వర్షం పడింది.
మల్దకల్ 34.6 మి.మీ, వనపర్తి 29.2 మి.మీ, పాన్‌గల్ 23.8, ఆత్మకూర్ 22.0, బిజి నేపల్లి 20.0, నవాబుపేట 16.0 మి. మీ, దేవరకద్ర 15.0, అడ్డాకుల, గట్టు 14.0, పెద్దమందడి 11.8, గద్వాల 11.0, కొయిలకొండ 10.2, మద్దూరు, మానవపాడు 10.0 మి.మీ వర్షపాతం కురి సింది. జడ్చర్ల, నారాయణపేట, నర్వ, చిన్నచింతకుంట, కొత్తకోట, వడ్డేపల్లి, ధరూర్, కోడేరు మండలాల్లో 10మిల్లీ మీటర్ల లోపు వర్షపాతం నమోదయింది. మిగిలిన మండలాల్లో నామమాత్రపు జల్లులు తప్ప పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు.