సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను తెలుగులోనూ ఇవ్వాలని భావిస్తోంది. ఇంగ్లిష్‌లో ఉన్న నోటిఫికేషన్ అర్థంకాక గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గా లు తెలిపాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థికి ఇబ్బం దులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అందుకే నోటిఫికేషన్‌లోని అన్ని అంశాలను తెలుగులోకి తర్జుమా చేయించామని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందు బాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment