యాదగిరికొండ :ప్రైవేట్ కార్పొరేట్‌కు దీటుగా ప్ర భుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ కే టాయించారని ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గుట్ట మం డలం సైదాపురం గ్రామంలో జాతీయ పైలేరియా (బోధకాలు వ్యాధి) నివారణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డీఈసీ మాత్రల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో బోధకాలు వ్యాధి నివారణకు అన్ని చర్యలుతీసుకుంటామని చెప్పారు. దీంట్లోభాగంగానే నల్లగొండ మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డీఈసీ మాత్రల పంపిణీని చేపట్టామని, ఇందుకు సైదాపురం నుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మొత్తం 1.55కోట్ల మందికి పైలేరియాతోపాటు గవద బిళ్లలు, వరిబీజం తదితర వ్యాధుల నివారణకు గాను మందులు పంపిణీకి ప్రభుత్వం నిశ్చయించిందన్నారు. యాదగిరిగుట్టలోని ప్రభుత్వం ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చడానికి కృషిచేస్తానన్నారు. అలాగే భువనగిరి ఏరియా ఆసుపత్రిలో వసతుల కల్పనకు రూ.కోటి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పీహెచ్‌సీలలో 24 గంటల వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కె.వెంకటయ్య, సాంబశివరావు, డాక్టర్ల బృందం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
‘ప్రైవేట్’కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు
Published Mon, Dec 15 2014 3:01 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement