ఎన్టీఆర్ వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం ఎన్.టి.రామారావు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయ గుర్తింపునిచ్చిన ఎన్టీఆర్ పట్ల విశ్వాసాన్ని చాటుకోవాలన్నారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను పొగుడుతున్న సీఎం కేసీఆర్, ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన విగ్రహాల శుద్ధికి స్థానిక సంస్థలకు ఆదేశాలను ఇవ్వాలని సీఎంను కోరారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించినా, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.