కరీంనగర్:
తమ గ్రామం పేరును శిలాఫలకంపై పెట్టలేదంటూ గ్రామస్తులు మంత్రిని, ఎంపీని ఘెరావ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. చొప్పదండి మండలం రేవెల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మినీట్యాంక్ బండ్ పనులను ప్రారంభించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, ఈ సందర్భంగా వేసిన శిలాఫలకంలో తమ గ్రామం పేరు లేదంటూ దేశాయిపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులను ఘెరావ్ చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత శాంతించి వారికి దారిచ్చారు.
తమ గ్రామం పేరు లేదని మంత్రి, ఎంపీ అడ్డగింత..
Published Sat, Jan 28 2017 6:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
Advertisement