అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం | Schemes Developed By TRS Govt | Sakshi
Sakshi News home page

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం

Published Tue, Nov 6 2018 1:16 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

Schemes Developed By TRS Govt - Sakshi

సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : నాలుగేళ్లకు ముందు రాష్ట్రం అంధకారంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసాధ్యమైన విద్యుత్‌ వెలుగులను సుసాధ్యం చేశామని విద్యుత్‌ శా ఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూ ర్యాపేటలోని బాలాజీ గార్డెన్స్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) ఆధ్వర్యంలో మంత్రికి అభినందన సభ ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంత ర కరెంట్‌తో రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోవడం లేదన్నారు. 2014కు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాం లో కరెంట్‌ కోసం రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని, ఇప్పుడు ఈ ఆందోళనలు లేవని, కరెంట్‌ సాధనలో సీఎం కేసీఆర్‌ కల సాకారమైందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం లో అర్థరాత్రి నాలుగు గంటలు ఇచ్చే కరెంట్‌ ధర కూడా పెం చారన్నారు. ఏడాదిలోపే కరెంట్‌ కష్టాలను అధిగమించి రైతులు, పారిశ్రామికవేత్తలతో తెలంగాణ ప్రభుత్వం శభాష్‌ అనిపిం చుకుందన్నారు. గతంలో ఒక్క సబ్‌స్టేషన్‌ సాధించుకునేందుకు గ్రామాల ప్రజలు కమిటీలుగా ఏర్పడి సెక్రటేరియట్ల చుట్టూ ఐ దేళ్లు తిరిగినా ఫలితం ఉండేదికాదన్నారు. కానీ తెలంగాణ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యికి పైగా సబ్‌ స్టేష న్లు నిర్మించామని, నాలుగేళ్లలో సబ్‌ స్టేషన్లు, కొత్త లైన్ల కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

నిరంతర విద్యు త్‌ వెనక సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ కఠోర శ్రమ ఉందన్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణకు ఏం కావాలో 2010 నుంచే కేసీఆర్‌ ఆలోచించారని, ఈ ప్రణాళికతో కేసీఆర్‌ రాష్ట్రానికి పెద్దదిక్కుగా మారి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో నిలి పాడని కొనియాడారు. 1985 నుంచే కేసీఆర్‌ విద్యుత్‌ సమస్యలపై ఔపోసన పట్టారని, అందుకే కరెంట్‌ రంగంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో కూ డా నిరంతర విద్యుత్‌ అందించడం లేదని, ఇది రాష్ట్రంలో ఏర్పడడంతో ప్రజలకు దక్కిన తొలి విజయం అన్నారు. ఏ దేశం అ భివృద్ధి చెందినా విద్యుత్‌ వినియోగం ఎక్కువ ఉన్నట్లేనని, దేశంలోనే రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఇదే నిదర్శనమన్నారు. 
సూర్యాపేట కిరణం జగదీశ్‌రెడ్డి..
విద్యుత్‌ శాఖను అగ్రపథాన నిలిపిన మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట కిరణం అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దినదినాభివృద్ధి చెందుతుందంటే అది ప్రభుత్వ చలవేనన్నారు. గతంలో పరిశ్రమలు పెట్టాలంటే వచ్చిపోయే కరెంట్‌ చూసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భయపడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యాపారులు, వైద్యలు మాట్లాడుతూ సూ ర్యాపేటలో గతంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉండేదని, జగదీశ్‌రెడ్డి మంత్రి కావడంతో వెలుగుల పేటగా మారిందన్నారు. ఒకప్పుడు కరెంట్‌ మధ్యలోనే పోవడంతో ఆపరేషన్లు కూడా నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని గురు ్తచేశారు. అనంతరం మంత్రిని టీఐఎఫ్‌ ఆధ్వర్యంలో గజ మాలతో సన్మానించారు. అలాగే తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కాళేశ్వరంపై రాసిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సభలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, డాక్టర్లు వై.సుధాకర్‌రెడ్డి, పెద్దిరెడ్గి గణేష్, గోపాల్‌రావ్, సాంబిరెడ్డి, గండూరి శంకర్, స్వామిగౌడ్, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, డాక్టర్‌ రాంమూర్తియాదవ్, రోశిరెడ్డి, లక్కపాక పాండు, జానికిరాయమ్య, విశ్వేశ్వర్‌రావు, చలమంద, రవీందర్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement