- 29 నుంచి రంగారెడ్డిలో యాత్ర
- ఓటుకు కోట్లు కేసును పక్కదారిపట్టిస్తున్న బాబు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
కాజీపేట రూరల్ : ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 2 వరకు రంగారెడ్డి జిల్లాలో షర్మిల చేపట్టే పరామర్శయూత్రను విజయవంతం చేయూలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా నాయకుల సమావేశంలో పాదయూత్ర పోస్టర్ ఆవిష్కరించారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకే ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారని విమర్శించారు.
విచారణకు బాబు సహకరించాలని సూచిం చారు. రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం మాట్లాడుతూ, టీవీ చానెళ్లకు ఏపీ సర్కారు నోటీసులివ్వడాన్ని ఖండించారు. మిషన్ కాక తీయ పనుల్లో కుమ్మక్కైన అధికారులు, కాం ట్రాక్టర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశా రు. రైతులకు గిట్టుబాట ధర కల్పించాలని రాష్ట్రసంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్ కోరారు. పింఛన్లను ఆయా డివిజన్లలో పంపిణీ చేయాలని గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్ కోరారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, యుజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్ రాజ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దోపతి సుదర్శన్‌రెడ్డి జిల్లానాయకులు అప్పం కిషన్, ఎండీ. షంషీర్‌బేగ్, కాందాడి అచ్చిరెడ్డి, దుప్పటి ప్రకాస్, గౌని సాంబయ్య గౌడ్, ఎస్‌ఏ. ఖాదర్ హస్మీ, మంచె అశోక్, బొడ్డు శ్రావణ్ కుమార్, భీంరెడ్డి రవితేజరెడ్డి, పిడిశెట్టి సంపత్, రాకేష్, చిర్ర అనిల్, అరెపల్లి రాజు, హరీశ్, ప్రశాంత్, కిరణ్, మురళి పాల్గొన్నారు.
షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
Published Fri, Jun 26 2015 4:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement
Advertisement