ట్విట్టర్‌లో ఫాలోవర్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తున్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల ఏడు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినందున ప్రజలంతా కచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి ఆమె ట్విట్టర్ ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా రు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించటంపై కూడా స్పందించారు. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకో వటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కృషి చేయాలని కోరారు.
తాజా పళ్లను తీసుకోవటంతోపాటు విరివిగా మంచినీళ్లు తాగాలని, పసుపు, తులసి, వేప, అల్లం, వెల్లుల్లి లాంటి వా టిని తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి లక్షణా లు లేకున్నా కొంతమందిలో కరోనా పాజిటివ్‌గా తేలినం దున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ కోరారు. ఏమాత్రం అనుమానం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకో వాలని సూచించారు. అమ్మ క్కపేట గ్రామంలో తాము పొలాల్లో కూడా భౌతిక దూరా న్ని పాటిస్తున్నామని రాజేశ్ అనే వ్యక్తి ఫొటోలు పోస్టు చేయగా గవర్నర్ అభినందించారు. ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శశిధర్ అనే వ్యక్తి ట్వీట్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్ స్పందించారు.
సర్పంచికి అభినందన...
ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా గ్రామ సర్పంచి మీనాక్షి కరోనా నియం త్రణకు ఉపయోగపడే చర్యలు తీసుకుంటుండటాన్ని గవర్నర్ అభినందించారు. ఆమె కుమారుడు ఆమె చర్యలను సూచిస్తూ పోస్టు చేసిన ట్వీట్‌లకు అభినందనలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. రామాపురం అనే గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు, తమది వెనకబడ్డ గ్రామమని, తమకు శానిటైజర్లు, మాస్కులు, అత్యవర మందులు సమకూర్చాలని కోరగా, ఆమేరకు తగిన సహాయం చేయాల్సిందిగా సమీపంలోని రెడ్‌క్రాస్ వాలంటీర్లకు సూచించనున్నట్టు గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రజల కోసం కష్టపడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను అభినందించాల్సిందిగా చంద్రశేఖర్‌రెడ్డి కోరగా, ఆమె పనితీరును తాను సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో కూడా చూశానని, ఆమెకు తన అభినందనలు అంటూ గవర్నర్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment