పింఛన్ల కోసం కాంగ్రెస్ ముట్ట‘ఢీ’
అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు నిలువరించడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇరువర్గాల తోపులాటతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. దీంతో నాయకులు బస్వరాజు సారయ్య, గండ్ర, ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని, విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. - వరంగల్ అర్బన్
వరంగల్ అర్బన్ : అర్హులందరికీ పింఛన్లు మం జూరు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు బల్దియా కార్యాలయంలోకి వెళ్లేందుకు య త్నించగా.. పోలీసులు గేట్లు వేసి నిలువరించారు. దీంతో కొందరు నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించగా.. మరికొందరు గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. చివరకు కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులకు పోలీసులు అనుమతి ఇచ్చినా కమిషనర్ బయటకు రావాలని నేతలు కోరా రు. దీనికి నిరాకరించిన కమిషనర్ నాయకులనే తన చాంబర్‌లోకి రావాలని సూచించారు. దీనికి ససేమిరా అన్న కాంగ్రెస్ నాయకులు బ ల్దియా ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించిన పోలీసులు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమాణారెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నాయిని రా జేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్ తదితరుల ను మట్టెవాడ పోలీసుస్టేషన్‌కు తరలించి.. ఆ పై సొంత పూచీకత్తుతో విడుదల చేశారు.
సీఎం మెడలు వంచి పింఛన్లు ఇప్పిస్తాం : మాజీ మంత్రి సారయ్య
అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. బల్దియా వద్ద ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మెడలు వంచైనా పింఛన్లు ఇప్పిస్తామన్నారు. అనంత రం మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని విమర్శించారు. పింఛన్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలోని లోపాలను సవరించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాస్‌తో పాటు నాయకులు పుల్లా భాస్కర్, పోలా నటరాజ్, మహమూద్, తత్తరి లక్ష్మణ్, రోకుల భాస్కర్, దామెర సర్వేష్, రమణారెడ్డి, కిషన్, మేకల బాబూరావు, దూపం సంపత్, బాసాని శ్రీనివాస్, నాయకులు గౌసుద్దీన్, గోరంటల రాజు, రమణారెడ్డి, గోరంటల రాజు తదితరులు పాల్గొన్నారు.