ప్రధానికి లేఖ రాయండి
పసుపు మద్దతు ధరపై అసోం సీఎంను కోరిన ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధరపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని అసోం సీఎం శర్బానంద సోనోవాల్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఎమ్మెల్యే లు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, విద్యాసాగర్ రావుతో కలసి శనివారం అసోం వెళ్లిన కవిత.. గువహటిలో సీఎం సోనోవాల్‌తో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పసుపు రైతుల దయనీయ పరిస్థితిని సీఎంకు వివరిం చారు.
ఇతర పంటలు పండించే రైతులకన్నా పసుపు రైతులు ఎక్కువ శ్రమిస్తారని, 10 నెలల తరవాతే పంట చేతికొస్తుందని, కష్టపడి పండిం చిన పసుపుకు ధర అంతంత మాత్రంగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాఫీ, రబ్బర్ బోర్డుల మాదిరిగా పసుపు బోర్డునూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(జీఐ) ట్యాగ్‌ను వివిధ ప్రాంతాల్లోని పసుపు రకాలకు అనుసంధానించే ప్రక్రియ వేగవంతం అవుతుందని, భారతీయ పసుపు రకాలకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుందని చెప్పారు.
25 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధర అందిస్తోందని, కానీ పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు తక్కు వ ధరకు కొని, 3–4 రెట్లకు విక్రయిస్తూ లాభా లు గడిస్తున్నారన్నారు. పప్పు దినుసులను కొనుగోలు చేస్తున్న నాఫెడ్.. పసుపును రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని కవిత వివరించారు. ఈ విష యమై సానుకూలంగా స్పందించిన సోనోవాల్, పసుపు రైతులను ఆదుకోవడానికి ప్రయత్ని స్తున్న కవితను అభినందించారు. ప్రధానికి లేఖ రాస్తా నని హామీ ఇచ్చారు.