నిజామాబాద్: ప్రధాని మోదీపై ఎంపీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిహార్ ఫలితాలతోనైనా మోదీ మారాలని, ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని అన్నారు.
ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలకు ప్యాకేజీలను ప్రకటిస్తూ పొలిటికల్ ఫెడరిలిజమ్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు సాయం, హైకోర్టు విభజన చేయకుండా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.