42 మంది మృతి | 42 people died | Sakshi
Sakshi News home page

42 మంది మృతి

Published Sat, Oct 24 2015 1:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

42 మంది మృతి - Sakshi

42 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
 
 బోర్డాక్స్ (ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది మృతిచెందారు. శుక్రవారం బోర్డాక్స్‌కు ఉత్తరాన పసిసెగ్విన్ గ్రామ సమీపంలో ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఎక్కువమంది మంటల్లో చిక్కుకునే ప్రాణాలు కోల్పోయారని ఆ వర్గాలు వెల్లడించాయి. గత మూడు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద దుర్ఘటన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రెండు వాహనాల డ్రైవర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని రవాణాశాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయిందని టీవీ వార్తలు వెల్లడించాయి. ప్రమాదస్థలికి పెద్ద ఎత్తున అధికారులు చేరుకున్నారు. ఈ సంఘటనపై ఏథెన్స్ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువమంది వృద్ధులేనని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement