సూపర్‌ హిట్‌ సినిమా ప్లాన్‌ ఫ్లాప్.. | 61 Heroin capsules in Afghan smuggler stomach found at IGI Delhi | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ సినిమా ప్లాన్‌ ఫ్లాప్..

Published Fri, Apr 28 2017 8:41 PM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

సూపర్‌ హిట్‌ సినిమా ప్లాన్‌ ఫ్లాప్.. - Sakshi

సూపర్‌ హిట్‌ సినిమా ప్లాన్‌ ఫ్లాప్..

- ‘వీడొక్కడే’ తరహాలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌
- కడుపులో 8 కోట్ల విలువైన 61 హెరాయిన్‌ క్యాప్సూల్స్‌
- అవికాస్తా పగలడంతో యువకుడి దుర్మరణం
- ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో కలకలం


న్యూఢిల్లీ:
తెలుగు, తమిళంలో సూపర్‌ హిట్టైన సూర్యా సినిమా ‘వీడొక్కడే’ గుర్తుందా? డ్రగ్స్‌, డైమడ్స్‌ అక్రమ రవాణా దందాపై రూపొందించిన ఆ సినిమాలో.. కస్టమ్స్‌కు దొరకకుండా మనుషుల కడుపుల్లో కొకెయిన్‌ ప్యాకెట్లు సరఫరా చేస్తుంటారు. ఆలా పొట్టలోనే డ్రగ్స్‌ ప్యాకెట్లు పగిలిపోవడంతో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌(చిట్టీ) చనిపోతుంది.

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ యువకుడు విమానాశ్రయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్కాన్‌ చేయగా, అతని పొట్టలో సుమారు రూ.8 కోట్ల విలువైన 61 హెరాయిన్‌ ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే ఆపరేషన్‌ చేసి వాటిని బయటికి తీసినప్పటికీ, ఆ యువకుడి ప్రాణాలు దక్కలేదు. చనిపోయిన యువకుడిని అఫ్ఘాన్‌ జాతీయుడైన హమీద్‌ మొహమ్మద్‌(19)గా గుర్తించామని నార్కోటిక్స్‌ అధికారులు చెప్పారు.

సఫ్‌దార్‌ గంజ్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ నిర్వహించి 61 క్యాప్సుల్స్‌ వెలికి తీశామని, ఒక్కోటీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడవైన ప్లాస్టిక్‌ సంచుల్లో హెరాయిన్‌ నిండుగా నింపారని, కడుపులోని క్యాప్సుల్స్‌లో ఒకటిరెండు పగిలిపోవడంతో హమీద్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడని వైద్యులు తెలిపారు. హమీద్‌ ప్రాణాలు నిలిపేందుకు చివరిదాకా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. మృతుడి శరీరంపై ఆపరేషన్‌ చేసిన ఆనవాళ్లేవీ లేనికారణంగా.. డ్రగ్స్‌ సంచుల్ని అతడు నోటి ద్వారానే తీసుకున్నట్లు భావిస్తున్నామని వైద్యులు చెప్పారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement