భువనేశ్వర్: ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. సంబర్ పూర్ జిల్లా తీతాపల్లి వద్ద హీరాకుడ్ రిజర్వాయర్లో పడవ మునిగి పది మంది మరణించారు. మరో 30 మంది గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికితీశారు. మహానదిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లైన్స్ క్లబ్కు చెందిన వారు మూడు పడవల్లో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారందరూ ఒడిశాకు చెందిన వారేనని తెలుస్తోంది.
గల్లంతైన వారి కోసం రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. 30 మందిని సహాయక సిబ్బంది రక్షించినట్టు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్న చిన్నపిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారు బతికే అవకాశాలు తక్కువని స్థానికులు అంటున్నారు.
పడవ మునిగి 10 మంది మృతి, 30 మంది గల్లంతు
Published Sun, Feb 9 2014 10:10 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement