'నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడతారో ఆయనకే తెలిదు' | Congress party fires on Gujarat Chief Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

'నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడతారో ఆయనకే తెలిదు'

Published Wed, Oct 30 2013 11:06 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress party fires on Gujarat Chief Minister Narendra Modi

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ బుధవారం నిప్పులు చెరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ర్యాలీల్లో మోడీ తమ పార్టీపై చేసే ఆరోపణలు పసలేనివని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ ఆరోపించారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ర్యాలీలలో మోడీ అసలు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

 

ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిన అంశాన్ని మోడీ ముందుగా తయారు చేసుకోరని, నోటికి వచ్చినట్లు అప్పటికప్పుడు ప్రసంగిస్తూ పలు వివాదాలకు తెర తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని యువరాజు అని పేర్కొనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని మోడీ తరచుగా యువరాజు అని పేర్కొనడంపై కాంగ్రెస్ గతవారం ఘాటుగా స్పందించిన విషయాన్ని అఫ్జల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement