అమెరికాలో టాప్-10 కాలేజీలివే
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్నది ప్రతి ఒక్క విద్యార్థి కల. అయితే.. అక్కడ అగ్రస్థానంలో ఉన్న కాలేజీలు ఏవో.. వాటిలో ప్రవేశానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడం ఇక్కడి విద్యార్థులకు కాస్త కష్టమే అవుతుంది. అందుకే.. ఫోర్బ్స్ సంస్థ ప్రతియేటా అక్కడ అగ్రస్థానంలో ఉండే 100 కాలేజీల వివరాలను ప్రచురిస్తుంటుంది. అలాగే ఈసారి కూడా 2014 సంవత్సరానికి గాను అక్కడి కాలేజీలకు ర్యాంకులు ఇచ్చింది. వాటిలో అన్నింటికంటే అగ్రస్థానంలో విలియమ్స్ కాలేజి ఉంది. మసాచుసెట్స్లో ఉన్న ఈ కాలేజీలో చదవాలంటే 61,850 డాలర్లు ఖర్చవుతుంది. ఇక్కడ మొత్తం 2,124 మంది విద్యార్థులున్నారు. మొత్తం వంద కాలేజిలకు సంబంధించిన సమాచారం అంతటినీ ఫోర్బ్స్ వెబ్సైట్లో చూడచ్చు.
టాప్ టెన్ కాలేజీలు ఇవీ..
- విలియమ్స్ కాలేజి
- స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ
- స్వార్త్మోర్ కాలేజీ
- ప్రిన్స్టన్ యూనివర్సిటీ
- మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- యేల్ యూనివర్సిటీ
- హార్వర్డ్డ్ యూనివర్సిటీ
- పమోనా కాలేజి
- యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ
- ఆమెర్స్ట్ కాలేజి