గంగానది ప్రక్షాళనకు జర్మనీ సాయం
బెర్లిన్: గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగా నదిలో కొంత భాగాన్ని ప్రక్షాళించేందుకు జర్మనీ ఒప్పుకుంది. యూరప్ లోని రైని నదిని క్లీన్ చేసేందుకు ఉపయోగించిన టెక్నాలజీతో గంగానదిని ప్రక్షాళన చేయనుంది. ప్రవాస భారతీయుల విజ్ఞప్తి మేరకు 'క్లీన్ గంగా' మిషన్ లో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ అంగీకరించిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో సుష్మ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చారని చెప్పారు. ఇరు దేశాలు ద్వైపాకిక్ష సంబంధాలను సమీక్షించాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన 'స్వచ్ఛ విద్యాలయ'లోనూ సాయం అందించేందుకు జర్మనీ ఒప్పుకుందని చెప్పారు.