సిడ్నీ: మొదడు అభివృద్ధికి సంబంధించిన కీలక సమాచారాన్ని మొదటిసారిగా శాస్త్రవేత్తలు చేధించారు. యూఎస్‌పీ9ఎక్స్‌గా పిలిచే జన్యువుకు బుద్ధిమాంద్యానికి మధ్య ఉన్న సంబంధం పూర్తిస్థాయిలో అధ్యాయనం చేశారు. మొదడు పనితీరు, వారసత్వంగా వచ్చే తెలివితేటలు తదితర వివరాలను కూడా తెలుసుకున్నారు.
జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉన్న రోగుల గురించి పరిశోధించే క్రమంలో మొదడు అభివృద్ధి, తెలివితేటలకు సంబంధించిన ఈ కీలకమైన జన్యువును కనుగొన్నట్లు శాస్త్త్రవేత్తలు తెలిపారు. మొదడుకు సంబంధించిన నిగూఢ రహస్యాలను కనుగొనడానికి యూఎస్‌పీ9ఎక్స్ జన్యువు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ ప్రొఫెసర్ లాచ్లాన్ జోలీ తెలిపారు. ముఖ్యంగా బుద్ధిమాంద్యం, మూర్ఛ, ఆటిజం వంటి రుగ్మతలకు సంబంధించిన పూర్తి వివరాలను దీని ద్వారా మరింత సులభంగా తెలుసుకోవచ్చన్నారు.
‘తెలివి’ జన్యువు తెలిసింది...!
Published Mon, Apr 7 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
Advertisement