ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న బాల నేరస్థుల సంరక్షణ కేంద్రంలో ముగ్గురు బాల నేరస్థులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ముగ్గురిపైనా అత్యాచారం, హత్య ఆరోపణలున్నాయి. వారిలో ఒకరు లక్నోకు చెందినవారు కాగా, మరో ఇద్దరు మాత్రం సమీపంలోని ఉన్నావో జిల్లాకు చెందినవారు. వీళ్లంతా 15-16 ఏళ్ల మధ్య వయసువారే. గత కొన్ని నెలలుగా వీళ్లు బాల నేరస్థుల సంరక్షణ కేంద్రంలో ఉన్నారు.
అసలు వాళ్లకు విషం ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. అలాగే వాళ్లు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోడానికి కారణమేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురు బాల నేరస్థులు చాలా నేరాలకు సంబంధించి దోషులుగా తేలారని జువెలైన్ జస్టిస్ బోర్డు ఇంతకుముందు తెలిపింది.
లక్నోలో విషం తాగిన బాల నేరస్థులు
Published Sat, Oct 5 2013 2:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement