బిల్లు కట్టమంటే.. చితక్కొట్టిన పూజామిశ్రా | Model Pooja Mishra Beats Up Hotel Staff For Asking To Pay Bills | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టమంటే.. చితక్కొట్టిన పూజామిశ్రా

Published Mon, Sep 14 2015 5:50 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

బిల్లు కట్టమంటే.. చితక్కొట్టిన పూజామిశ్రా - Sakshi

బిల్లు కట్టమంటే.. చితక్కొట్టిన పూజామిశ్రా

మీరు ఏదైనా దుకాణానికి వెళ్లి, అక్కడ ఏమైనా కొంటే ఏం చేస్తారు... దానికి బిల్లు కడతారు. అదే హోటల్కు వెళ్లి రెండు మూడు రోజులు అక్కడ బస చేస్తే, అద్దె చెల్లిస్తారు. కానీ, ప్రముఖ మోడల్, బిగ్బాస్ 5లో పాల్గొన్న పూజామిశ్రా మాత్రం అలా చేయదు. ఇంతకుముందు ఓ పారిశ్రామికవేత్త మీద, సోనాక్షి సిన్హా, ఇషా కొప్పికర్ లాంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మీద కూడా కేసులు దాఖలు చేసిన ఘనచరిత్ర ఈ అమ్మడికి ఉంది. ఇప్పుడు తాజాగా ఓ హోటల్ సిబ్బంది మీద ఆమె తన ప్రతాపం చూపించింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ద్వారకలో పూజా మిశ్రా ఓ హోటల్కు వెళ్లింది. అక్కడ తానున్న గదిలో కొన్ని వస్తువులను పగలగొట్టింది. వాటికి గాను డబ్బు చెల్లించాలని హోటల్ యాజమాన్యం అడిగితే, లేదు పొమ్మంది. హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోతానంటూ బయల్దేరగా, సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో ఒక్కసారిగా ఆమె పూనకం వచ్చినట్లు సిబ్బందిమీద పడి కొట్టేసింది. తనను ఫొటోలు తీస్తారా అంటూ వాళ్ల ఫోన్లు పగలగొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement