సొంత సోదరిపైనే... అఘాయిత్యం! | mumbai minors rape own minor sister, arrested | Sakshi
Sakshi News home page

సొంత సోదరిపైనే... అఘాయిత్యం!

Published Wed, Mar 2 2016 3:06 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

సొంత సోదరిపైనే... అఘాయిత్యం! - Sakshi

సొంత సోదరిపైనే... అఘాయిత్యం!

సభ్యసమాజం తలదించుకునే దారుణం ముంబై మహానగరంలో జరిగింది. మీరా రోడ్డుకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె సోదరులు ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు, క్లాస్ టీచర్ కలిసి రెండు రోజుల క్రితం కష్మీరా పోలీసులను ఆశ్రయించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 17, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలను అరెస్టు చేశారు. ఇద్దరినీ భివాండీలోని బాలల రిమాండు హోంకు పంపారు. బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోడానికి ఆమెను వైద్యపరీక్షలకు పంపారు.

గత సంవత్సరం దీపావళి సెలవుల సమయంలో తన అన్న వేధింపులు మొదలుపెట్టాడని, ఈ ఏడాది ప్రారంభంలో తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత కొన్నాళ్లకు తమ్ముడు కూడా అదే పని మొదలుపెట్టాడు. ఇద్దరూ తనను బెదిరించడంతో కూలీలుగా పనిచేసే తన తల్లిదండ్రులకు ఆమె ఏమీ చెప్పుకోలేకపోయింది. ఎట్టకేలకు తన క్లాసు టీచర్‌కు ఆ విషయం చెప్పడంతో విషయం బయటకొచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement