చెరువు గట్టు.. పక్కనే పచ్చని పొలాలు.. మంచు తెరల చాటు నుంచి సూర్యుడు తొంగి చూసే ఆ ఉషోదయ వేళ మనసు పరవశించకుండా ఉంటుందా..! మరి ఒకే సారి మూడు ఉషోదయాలు కనువిందు చేస్తే...! అదీ నీలి బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తే ఆహా! ఆ అనుభూతే వేరు కదా.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..! ఇది నిజంగా నిజమండీ బాబూ... ఈ కమనీయ దృశ్యం రష్యాలోని చెల్యాబిన్స్క్ నగర ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేసింది.
ఇటీవల అక్కడి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మైనస్ 25 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో వాతావరణంలో ఏర్పడిన కంటికి కనిపించని మంచు స్ఫటికాల వల్ల ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. దీన్నే భౌతిక శాస్త్ర పరిభాషలో ‘సన్‌డాగ్’ లేదా ‘ఫాంటమ్ సన్’ అని పిలుస్తారు. షట్కోణాకృతిలో ఉండే ఈ మంచు స్ఫటికాలు పట్టకాల లాగా పనిచేయడం వల్ల సూర్యకిరణాలు వక్రీకరణం చెంది ముగ్గురు సూర్యుళ్లు ఉదయించినట్లు కనిపించింది. అయితే ఇది రష్యన్లకు సర్వ సాధారణమేనంట..
‘త్రి’షోదయ వేళ
Published Mon, Feb 23 2015 3:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM
Advertisement
Advertisement