'త్వ‌ర‌లో జాల‌రి మృత‌దేహ‌న్ని భార‌త్‌కు పంపిస్తాం' | Pakistan NGO to talk to authorities on transfer of fisherman's body | Sakshi
Sakshi News home page

'త్వ‌ర‌లో జాల‌రి మృత‌దేహ‌న్ని భార‌త్‌కు పంపిస్తాం'

Published Thu, Jan 23 2014 3:14 PM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

Pakistan NGO to talk to authorities on transfer of fisherman's body

వాడోధరా: పాకిస్తాన్‌లోని క‌రాచీ జైళ్లో గ‌త‌నెల‌లో మ‌ర‌ణించిన భార‌తీయ మ‌త్య్స‌కారుడి మృత‌దేహ‌న్ని భార‌త్‌కు పంపేందుకు చ‌ర్య‌లను ముమ్మ‌రం చేసిన‌ట్టుగా పాకిస్తాన్ జాల‌ర్ల ఫౌరం(పీఎఫ్ఎఫ్‌) చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ అలీ షాహ్ ఫోన్‌లో పిటీఐకి వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై పాక్ అధికారుల‌తో చ‌ర్చించి త్వ‌ర‌లో గుజ‌రాతీ మ‌త్య్స‌కారుడు భీఖా ల‌ఖా షీయెల్ (35) మృత‌దేహ‌న్ని భార‌త్ పంపేందుకు కృషిచేస్తామ‌ని చెప్పారు. అయితే మ‌త్య్స‌కారుని మృత‌దేహ‌న్ని గుజ‌రాత్‌కు పంప‌డంలో ఎందుకింత జాప్యం జ‌రిగిందో తెలుసుకోవడానికి తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

భీఖా ల‌ఖా షీయెల్ అనే మ‌త్య్స‌కారుడు గుజ‌రాత్‌లోని జ‌న‌గ‌ఢ్ జిల్లా, గ‌రాల్ గ్రామానికి చెందిన‌వాడు. పాకిస్తాన్‌లోని క‌రాచీ జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న‌ షీయెల్ గత నెల 12న మృతిచెందిన‌ట్టు అక్క‌డి పాకిస్తాన్‌ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఆ మ‌త్స్య‌కారుడి మృతికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. మృతిచెందిన షీయెల్ మృత‌దేహ‌న్నిఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డి మార్చురీలో భ‌ద్ర‌ప‌రిచారు. ఇక‌పై మృత‌దేహ‌న్ని భార‌త్ పంపే విష‌యంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌ద‌ని మ‌హ్మ‌ద్ అలీ తెలిపారు. గుజరాత్ మ‌త్య్స‌కారుల క‌మీష‌న‌ర్ పీఎల్ ద‌ర్బ‌ర్ మాట్లాడుతూ.. షీయెల్ ను గుర్తించేందుకు వీలుగా సంబంధించిన గుర్తింపు ప‌త్రాల‌ను ఢిల్లీలోని విదేశీ వ్య‌వ‌హ‌రాల శాఖ అధికారుల‌కు పంపిన‌ట్టు చెప్పారు. కాగా, గ‌త సంవత్స‌రం అక్టోబ‌ర్ 25న పాక్ జ‌ల‌శ‌యాల్లోకి ప్ర‌వేశించార‌నే నేపంతో షీయెల్‌తో పాటు కొంద‌రు జాల‌ర్ల‌ను పాక్ నావికా ద‌ళం అరెస్ట్ చేశారు.  షీయెల్‌కు ఒక కూతురు (15), కొడుకు (3) ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement