ప్రియాంక..నీవు జియో సిమ్ అప్లై చేశావా?
ప్రియాంక..నీవు జియో సిమ్ అప్లై చేశావా?
Published Tue, Sep 6 2016 8:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM
న్యూఢిల్లీ : బంఫర్ ఆఫర్లతో స్మార్ట్ఫోన్ యూజర్ల ముందుకు వచ్చిన రిలయన్స్ జియో సిమ్కోసం బారులు తీరుతున్న జనాన్ని ఓ వైపు చూస్తుండగానే.. మరోవైపు ఓ టాప్ బాలీవుడ్ భామ జియో సిమ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రియాంక చోప్రా జియో సిమ్ కోసం అప్లై చేసిన మాదిరిగా అచ్చం ఆమె ఫోటోతోనే ఓ దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దరఖాస్తు ఫామ్లో అన్ని వివరాలు ఈ అందాల తారవే ఉండగా.. సంతకం మాత్రం భిన్నంగా ఉందట.
సిమ్ అప్లై చేసిన ప్రతి దరఖాస్తుదారుని వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ ఓ నటీమణికి సంబంధించిన వివరాలే ఇంటర్నెట్లో బ్రేకింగ్లా అందుబాటులోకి రావడంతో దానిలో నిజమెంతో ఉందో తెలియక విశ్వసనీయతపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. "ప్రియాంకా.. నీవు జియో సిమ్ కోసం అప్లై చేశావా" అంటూ ట్వీట్ చేస్తున్నారట. మొదట ఆ ఫోటోతో కూడిన అప్లికేషన్ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో చక్కర్లు కొట్టిందట. టారిఫ్లపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ జియో ప్లాన్ను వివరించిన ముకేశ్ అంబానీని ప్రియాంక చోప్రా కొనియాడిన సంగతి తెలిసిందే.
డిజిటల్ ఇండియాలో జియో విజన్ కచ్చితంగా నెరవేరాలని ఆశిస్తున్నట్టు నీతాకు, ముకేశ్కు, జియో టీమ్కు ప్రియాంక అభినందనలు తెలిపారు. ప్రియాంకతో పాటు రిలయన్స్ జియో లాంచింగ్పై అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్తో ప్రియాంక నిజంగా జియో సిమ్కు అప్లై చేసిందా లేదా అది తప్పుడు అప్లికేషన్ ఫామా అనేది చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement