దారుణంగా తిట్టారు: శృతి హాసన్‌ | Shruti Haasan Recalls Troll Trouble | Sakshi
Sakshi News home page

దారుణంగా తిట్టారు: శృతి హాసన్‌

Published Wed, Jun 14 2017 1:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

దారుణంగా తిట్టారు: శృతి హాసన్‌

దారుణంగా తిట్టారు: శృతి హాసన్‌

సినిమా స్టార్లకు వివాదాలు కొత్తకాదు. అందునా హీరోయిన్లంటే రోజుకో కాంట్రవర్సీ, గంటకో గాసిప్‌! ఇటీవల బెర్లిన్‌(జర్మనీ)లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా కాళ్లు కనపడేలా డ్రెస్‌ వేసుకుందని నటి ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడ్డారు. మ్యాగజైన్‌ హాట్‌ఫొటోలు దిగిన దీపికా పడుకొన్‌పైనా, బీచ్‌లో బికినీలో కనిపించిన దంగల్‌ ఫేం ఫాతిమా సనాపైనా భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీళ్లందరికంటే ముందే తాను సోషల్‌ మీడియా బాధితురాలినయ్యానని గుర్తుచేస్తోంది నటి శృతి హాసన్‌.

తండ్రి కమల్‌ హాసన్‌తో కలిసి నటిస్తోన్న ‘శభాష్‌ నాయుడు’  సినిమా కోసం తాను జుట్టు కత్తిరించుకోవడంపై గతేడాది సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చజరిగిందని శృతి చెప్పుకొచ్చారు. ‘నిజానికి నేనేపెప్పుడు పొడువాటి జుట్టులో కనిపించలేదు. చిన్నప్పటి నుంచి షార్ట్‌ హెయిరే! అయినాసరే నా హెయిర్‌కట్‌ను గురించి విమర్శలొచ్చాయి. కొందరైతే అతి దారుణంగా తిట్టారు’ అని వాపోయింది శృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement