ఇక రియల్టీ ట్రస్ట్ ఐపీవోలు!
ఇక రియల్టీ ట్రస్ట్ ఐపీవోలు!
Published Fri, Oct 11 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లో నమోదు చేసుకోవడం ద్వారా నిధులు సేకరించడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(ఆర్‌ఈఐటీఎస్)కి అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది. రియల్ ఎస్టేట్ సంస్థలు నిధులు సేకరించడానికి ఆర్‌ఈఐటీఎస్‌పైనే ప్రధానంగా ఆథారపడుతుంటాయి. ఇప్పుడు వీటిని స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం ద్వారా కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆకర్షించాలని సెబీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్‌ఈఐటీఎస్‌లు పబ్లిక్ ఇష్యూల ద్వారానే కాకుండా ఫాలో ఆన్ ఇష్యూలు ద్వారా కూడా నిధులను సేకరించవచ్చు.
దేశీయ ట్రస్టు చట్టం-1982 ప్రకారం ఏర్పడిన ఆర్‌ఈఐటీలకు నిధులు సేకరించడానికి అనుమతించింది. కాని ఈ ట్రస్టులు నిధులు సేకరించడానికి ఎటువంటి స్కీంలు ప్రవేశపెట్టరాదని సెబీ స్పష్టం చేసింది. సెబీ వద్ద ముందుగా ఆర్‌ఈఐటీఎస్‌లు నమోదు చేసుకుంటే నిబంధనలు అన్నీ సరిపోతే అప్పుడు నిధులు సేకరించడానికి అనుమతి మంజూరవుతుంది. ఆర్‌ఈఐటీఎస్‌లు ఐపీవోకి రావాలంటే వాటి కనీస ఆస్తి విలువ రూ1,000 కోట్లుగా ఉండాలని, కనీస ఇష్యూ పరిమాణం రూ.250 కోట్లుగా ఉండటమే కాకుండా 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరిగా ఉండాలి.
అలాగే కనీస సబ్‌స్క్రిప్షన్ పరిమాణం రూ.2 లక్షలుగా, యూనిట్ సైజు లక్ష రూపాయలుగా ఉండాలని నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాలను సెబీ అక్టోబర్ 31 వరకు స్వీకరిస్తుంది. ఆ తర్వాత తుది మార్గదర్శకాలను జారీ చేస్తుంది.పరిశ్రమ హర్షంసెబీ జారీ చేసిన మార్గదర్శకాలపై రియల్ ఎస్టేట్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఐపీవోల ద్వారా నిధులు సేకరించి అవకాశం కలగడంతో పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
Advertisement
Advertisement