జైపూర్: లౌకికవాదానికి కొత్త నిర్వచనాలు చెబుతూ తన మతతత్వ సిద్ధాంతాన్ని దాచిపెడుతున్న బీజేపీని దూరంగా పెట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఆయన గురువారం రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జైపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశాన్ని, సమాజాన్ని ఉమ్మడిగా ఉంచుతూ, దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుందన్నారు. ‘బీజేపీలోని కొంతమంది నాయకులు తమ ప్రత్యర్థులపై నీచమైన భాషను ప్రయోగిస్తారు. అయితే మేము మాత్రం చాలా హుందాగా మాట్లాడుతాం’ అని మన్మోహన్ పేర్కొన్నారు.