బంగారం కోసం మూడో రోజూ...
ఉన్నవ్: బంగారం గనులపై శోభన్ సర్కార్ అనే సాధువుకు వచ్చిన కల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని రావు రాంబక్ష్ సింగ్ కోటలో మొదలు పెట్టిన తవ్వకాలు మూడో రోజూ కొనసాగాయి. బంగారం తవ్వకాలను చూడ్డానికి చుట్టుపక్కల నుంచి ఆదివారం కూడా ప్రజ లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాగా, సబ్‌డివిజి నల్ మేజిస్ట్రేట్ విజయ్ శంకర్ దూబే, సర్కిల్ ఆఫీసర్ చరణ్‌జీత్ సింగ్ సమక్షంలో ఆర్కియాలజికల్ సర్వే సిబ్బంది తవ్వకాలు నిర్వహించారు.
వేట జరుగుతున్న ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశామని, రాత్రి పూట కూడా పని చేసే కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్‌పీ సోనియా సింగ్ వెల్లడించారు. 19వశతాబ్దంలో రాజ్యం చేసిన రామ్ బక్ష్ సింగ్ తన కోటలో టన్నులకొద్దీ బంగారం దాచిన విషయం తనకు కలలో కనబడి చెప్పాడని సాధువు శోభన్ సర్కార్ చెప్పిన విషయం తెలిసిందే.