రేపు ఎల్లుండి ఎటీఎంలు బంద్!
రేపు ఎల్లుండి ఎటీఎంలు బంద్!
Published Tue, Nov 8 2016 8:45 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
న్యూఢిల్లీ: రూ. 500, రూ. వెయ్యి నోట్లు రద్దు చేయాలని భారత ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి ఎటీఎంలు పనిచేయబోవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. అంతేకాకుండా బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణ విషయంలోనూ పలు ఆంక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు నుంచి రోజుకు రూ. 10 వేల వరకు మాత్రమే ఉపసంహరించుకోవచ్చునని ప్రధాని మోదీ వెల్లడించారు. వారానికి నగదు ఉపసంహరణ పరిమితి రూ. 20వేలు అని తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి షరతు లేదని వెల్లడించారు. డీడీల ద్వారా బదిలీలపైనా ఎలాంటి పరిమితి ఉండబోదన్నారు.
నవంబర్ 11వరకు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ రూ. 500, రూ. వెయ్యి నోట్లు చెల్లుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యి నోట్లు చెల్లుతాయని, నోట్ల చెలామణి విషయంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రైళ్లు, బస్సులు, విమానాల కౌంటర్లలోనూ వీటి చెలామణి కొనసాగుతుందని చెప్పారు.
Advertisement