బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో | Two scooter-borne men misbehave with a girl in Kammanahalli area in Bengaluru | Sakshi
Sakshi News home page

బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో

Published Wed, Jan 4 2017 10:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో - Sakshi

బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో

బెంగళూరు: భారత ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేకువజామున చోటుచేసుకున్న ఓ కీచకపర్వం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. నగరంలోని కమ్మనహళ్లి ప్రాంతంలో జనవరి 1 తెల్లవారి 2:40 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో..

ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతిని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించడం, అందులో ఒకడు నేరుగా అమ్మాయి దగ్గరకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయి ప్రతిఘటన తదితర దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఫుటేజీల ఆధారంగా యువతిపై లైంగికదాడి చేసిన యువకులపై గత రాత్రి కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు సిటీ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ మీడియాకు చెప్పారు.

(వెంటాడి.. దుస్తులను చించి వేధించారు) నగరంలో పార్టీ హబ్‌గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం రాత్రి న్యూ ఇయర్‌ సంబరాల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై ఆకతాయిలు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘ఇలాంటి కిచకపర్వాలు కామనే’ అంటూ కర్ణాటక హోంమంత్రి, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ ఇద్దరు నేతలకు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు కూడా జారీచేసింది.  (బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement