'సహజీవన భాగస్వామి అత్యాచారం చేశాడు' | Woman alleges rape, abuse by live-in partner | Sakshi
Sakshi News home page

'సహజీవన భాగస్వామి అత్యాచారం చేశాడు'

Published Fri, Aug 29 2014 6:15 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Woman alleges rape, abuse by live-in partner

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువకుడిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. అనిల్ (22) అనే యువకుడు కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్నాడని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుండటంతో ఎస్జీఎం నగర్ ప్రాంతంలోని ఓ అద్దె ఫ్లాటులో కలిసి ఉండేవారు.

అనిల్ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని, తర్వాత తనను దూషించి ఇల్లు ఖాళీ చేయాల్సిందగా చెప్పాడని తెలిపింది. తర్వాత తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడంది. దాంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement