1/13
2/13
భారీ అంచనాలతో విడుదలైన జైలర్ బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దీంతో సరైన సినిమా రజనీకాంత్‌కు పడితే కలెక్షన్స్ సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతుంది.
3/13
తాను మొదట్లో బస్సు కండెక్టర్‌గా బెంగళూరులో జర్నీ ప్రారంభిచారు. అక్కడ జయనగర్ మున్సిపల్ ప్రభుత్వ రవాణా సంస్థను ఈ మధ్యే రజనీ సందర్శించారు.
4/13
అనంతరం తాజాగ రజనీకాంత్ తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయన తల్లిదండ్రుల స్మారకం వద్ద నివాళులర్పించారు.
5/13
సుదీర్ఘ విరామం తర్వాత సూపర్‌స్టార్‌కు భారీ విజయం దక్కింది. జైలర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. మరోవైపు లైకా సంస్థ నిర్మిస్తున్న రజనీ చిత్రం 170 పూజా కార్యక్రమాలు కూడా సైలెంట్‌గా సాగాయి.
6/13
బెంగళూరులోని జయనగర్ మెట్రోపాలిటన్ ప్రభుత్వ రవాణా సంస్థను సందర్శించిన రజనీకాంత్.. తొలినాళ్లలో తాను పనిచేసిన వర్క్‌షాప్‌ను మరోసారి సందర్శించారు. అక్కడ తన పాత మిత్రులను కూడా కలిశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
7/13
ఆ తర్వాత రజనీ అక్కడి నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. కర్ణాటకలోని కృష్ణగిరి జిల్లా నచ్చికుప్పం పరిధిలోని వేప్పనపల్లికి వెళ్లారు.
8/13
అక్కడ ఆయన అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌తో కలిసి పర్యటించారు. ఆ తర్వాత తన తల్లి దండ్రుల స్మారక చిహ్నం వద్ద పూజలు చేశారు.
9/13
చాలా కాలం తర్వాత రజనీ తన తల్లి దండ్రుల స్మారకాన్ని సందర్శించినట్లు సమాచారం. ఆయన రాకతో రజనీకాంత్‌ను చూసేందుకు వచ్చిన బంధువులతో ఫోటోలు దిగారు.
10/13
కొన్ని నెలల క్రితమే రజనీకాంత్ తన తల్లి దండ్రులకు గుడి కట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందుకు సరిపడ ఏర్పాట్లు కూడా తన అన్నయ్య చూసుకుంటున్నాడు.
11/13
అక్కడి నిర్మాణ పనులను తన అన్నయ్యతో పాటుగా రజనీ సన్నిహితులు కూడా పర్యవేక్షిస్తున్నారు.
12/13
ఈ సందర్భంలో తన స్వగ్రామానికి రజనీకాంత్ అకస్మాత్తుగా వెళ్లి.. వారందరని ఆశ్చర్య పరిచారు. తన తల్లి దండ్రుల స్మారకం వద్ద చాలా సేపు కూర్చుని నివాళులర్పించారు. ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో రజనీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
13/13
జైలర్‌కు భారీగా లాభాలు రావడంతో నిర్మాత కళానిధి మారన్ రూ. 100 కోట్ల చెక్‌ను రజనీకాంత్‌కు అందచేశారు. ఈ సినిమాకు గాను ఆయన ఇప్పటికే రూ. 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీంతో మొత్తం జైలర్ రెమ్యునరేషన్ రూ.210 కోట్లకు చేరింది.