Adudam Andhra
-
ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని విమర్శించారు మాజీమంత్రి ఆర్కో రోజా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు.కాగా, మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం.టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు-నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా?. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షతోనే నిర్మాణాలు చేపట్టాం.ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదమే అవుతుంది. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని అనలేదా? అంటూ ప్రశ్నించారు. -
మట్టిలో మాణిక్యాలకు జగన్ వల్లే వెలుగు
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక ఎందరో క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర మంతా భారీఎత్తున నిర్వహించారు. ఎందరో క్రీడాకారులు ముందుకెళ్లడానికి ఇది దారిచూపింది. అలా వెలుగులోకి వచి్చన వారిలో ఆనంద్‌పాల్ అలియాస్ పవన్ ఒకరు. విజయనగరం జిల్లా జామి మండలంలోని మారుమూల గ్రామం అలమండకు చెందిన ఈ కుర్రాడు ధోనీ సారధ్యంలోని ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని వచ్చిన అనంతరం పవన్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. – సత్యార్థ్ సెమీ ఫైనల్స్‌లో ఓడినా.. అన్ని చోట్లా మా టీమ్ గెలుపొందింది. చివరకు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లు వీక్షించడానికి వచి్చన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ నన్ను దత్తత తీసుకుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక అద్భుతం అనుకుంటే.. ఏకంగా సీఎస్కే టీమ్ ట్రైనింగ్‌కు ఎంపికవడం.. శిక్షణ అనంతరం నాకెంతో ఇష్టమైన క్రికెటర్ ధోని ఆధ్వర్యంలోని టీమ్‌లో సభ్యుడిగా ఆడే అవకాశం నాకు దక్కవచ్చని తెలిసి పొంగిపోయాను. ఈ అవకాశం సది్వనియోగం చేసుకుని క్రికెటర్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేనులో ఆట నుంచి ‘చెన్నై’ దాకా... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. పొలాలమ్మట, గల్లీల్లో ఆడుతూ ఉండేవాడిని. ‘చదువుకుని ఉద్యోగం చేసుకోక క్రికెట్ అంటూ తిరుగుతున్నావ్ ఏంట్రా’.. అంటూ అమ్మ కోప్పడుతూ ఉండేది. ఫ్రెండ్స్ మాత్రం క్రికెట్ బాగా ఆడతానని పొగుడుతుండేవారు. అడపాదడపా గ్రామాల్లో జరిగే మ్యాచ్‌లలో ఆడి స్వల్ప పారితోషకాలు అందుకోవడం తప్ప ఆటకు ఎలా సానబెట్టుకోవాలో నాకు తెలియలేదు. అదే సమయంలో దేవుడిచి్చన వరంలా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మా గ్రామ సచివాలయం ద్వారా ఆ కార్యక్రమానికి ఎంపికయ్యాను. థాంక్స్ టూ జగన్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాను. థాంక్స్ టూ జగన్ సార్.. ఆయనెప్పుడూ పేదల పక్షానే ఉంటూ.. ఎన్నో మంచి పథకాలు అమలుచేస్తున్నారు. క్రీడల విషయంలోనూ పేదలకు మేలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారు. గల్లీల్లో ఆడుకునే నాలాంటి వాడు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. మరోసారి ఆయనే సీఎం కావాలని.. ఆడుదాం ఆంధ్రాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. -
పప్పులో కాలేసిన రామోజీ.. ఆడుదాం ఆంధ్రా
-
వైఎస్ జగన్ పులిబిడ్డ
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలినినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు. అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆర్థికంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. – సాక్షి, అమరావతి ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం... పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అపూర్వమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు. నవరత్నాలు.. మెరుపులు అమ్మ ఒడి పథకం వచ్చిన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభిమానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. -
గల్లీ క్రికెట్ నుంచి దేశీయ క్రికెట్ దిశగా...కేఏ పాల్ ఆడుదాం ఆంధ్ర ఆణిముత్యం
-
IPL- CSK: ఆడుదాం–ఆంధ్రా నుంచి ఐపీఎల్‌కు..
Adudam Andhra- సాక్షి, విజయనగరం(జామి): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్‌కు ఐపీఎల్లో ఆడే అవకాశం చేరువైంది. పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే (చెన్త్నె సూపర్ కింగ్స్) అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్లో ఆడేవాడు. తల్లిదండ్రుల మరణంతో క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపాడు. పవన్‌లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు విచ్చేసిన సీఎస్కే టాలెంట్ హంట్‌లో భాగంగా పవన్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్ చేసింది. ఆడుదాం–ఆంధ్రాతో నాకు ఈ గుర్తింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు. – కె.పవన్, క్రికెట్ క్రీడాకారుడు, అలమండ గ్రామం చదవండి: Adudam Andhra: విజేతల జాబితా ఇదే.. -
ఆడుదాం ఆంధ్రాలో ప్రతిభకు పట్టం
నిజాంపట్నం: ఆడుదాం ఆంధ్రా క్రీడలతో ఆణిముత్యాలను వెలికి తీసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో వాలీబాల్ విభాగంలో నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని సాధించిన సందర్భంగా గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా క్రీడలను పెట్టిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడా కారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ 47 రోజులపాటు నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరిగాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి అండగా నిలిచిందని చెప్పారు. నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయి వాలీబాల్‌లో ప్రథమ బహుమతిని సాధించడం మనందరికీ గర్వకారణమని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల, జెడ్పీటీసీ మాజీ ప్రసాదం వాసుదేవ, బోటు ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు విజయం సాధించిన వాలీబాల్ జట్టుకు సత్కారం -
స్ఫూర్తి నింపిన ‘ఆడుదాం ఆంధ్ర’
ఏలూరు రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణపై క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటీలు క్రీడాలోకానికి నూతన ఉత్తేజాన్ని అందించాయని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఈ పోటీల్లో ఏలూరు జిల్లా బ్యాడ్మింటెన్, క్రికెట్ జట్లు రాష్ట్ర చాంపియన్లుగా అవతరించడంపై క్రీడాకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ పోటీలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాయని చెబుతున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన సచివాలయ స్థాయిలో ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో క్రీడాకారులు అద్భుత ప్రతిభ, పాఠవాలు ప్రదర్శించారని, ప్రతిభ కలిగిన ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని అంటున్నారు. వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు పోటీల నిర్వహణపై సర్వత్రా ప్రశంస చాంపియన్లుగా అవతరించిన ఏలూరు జిల్లా క్రికెట్, బ్యాడ్మింటన్ జట్లు -
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసే ప్రతిష్టాత్మక మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో భాగంగా.. నిర్వహించిన టాలెంట్ హంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు అవకాశం లభించింది. జిల్లాకు చెందిన కె.రామ్మోహన్, ఇ.హేమావతిలతోపాటు పులివెందుల జేఎన్టీయూలో నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 14 మంది టాలెంట్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కడప స్పోర్ట్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు దాదాపు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో పూర్తి చేసుకోగా.. మంగళవారం విశాఖపట్నంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రతిభ కనబరిచిన వివిధ క్రీడాకారులను పరిశీలిస్తూ వచ్చిన శాప్ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, టాలెంట్ హంట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి వివిధ అసోసియేషన్లు, సంస్థలు దత్తత తీసుకోగా.. వీరికి ప్రభుత్వం సహకారం అందించి ఉత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఖోఖో క్రీడాంశంలో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. అయితే వీరిరువురూ విద్యాభ్యాసం, శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలలో చదువుతుండగా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆయా జిల్లాల నుంచి ప్రాతనిథ్యం వహించి సత్తా చాటారు. ఆల్‌రౌండర్‌గా హేమావతి.. చింతకొమ్మదిన్నె మండలం కొత్తపల్లెకు చెందిన సాధారణ రైతు శివశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె అయిన ఇల్లూరు హేమావతి పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కనిగిరిలో ఫిజికల్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. రన్నర్‌గా, ఛేజింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈమె జట్టు విజయంలో కీలకభూమిక పోషించి బెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. రామ్మోహన్.. ఛేజింగ్‌లో ఫస్ట్ చింతకొమ్మదిన్నె మండలం ఆర్.టి.పల్లె గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మ దంపతులు కుమారుడైన కట్లా రామ్మోహన్ పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇనకొల్లులోని డీసీఆర్ఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని, జె.పంగలూరు గ్రామంలోని ఎస్ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈయన ఛేజింగ్, రన్నింగ్‌లలో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో పలు సీనియర్ నేషనల్స్తోపాటు, ఖోఖో ప్రోలీగ్ పోటీల్లో చైన్నె క్విక్‌గన్, గుజరాత్ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జె.పంగలూరు సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించి బాపట్ల జట్టును స్టేట్ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించి ఖోఖో పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కె.గాయత్రి.. బ్యాటింగ్‌లో మేటి పులివెందుల పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ట్రిపుల్ఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి మహిళల క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరిచి టాలెంట్ హంట్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష న్ ప్రతినిధుల చూపును ఆకర్షించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సచివాలయం జట్టు నుంచి పాల్గొ న్న కడప మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గాయత్రి బ్యాటింగ్‌లో చక్కటి ప్రతిభ కనబరచడంతో టాలెంట్ హంట్‌కు ఎంపికై ంది. కాగా ఈమె స్వస్థలం పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్గా తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఈశ్వరరావు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు, క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ● బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కడప కాగితాలపేట సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్–ఖాజా జోడి రెండో రన్నరప్‌గా నిలిచాయి. ● బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో కడప శంకరాపురం–4 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన కె.వెన్నెల–శ్రీలత జోడి రన్నరప్‌గా నిలిచారు. ● వాలీబాల్ పురుషుల విభాగంలో అన్నమయ్య జిల్లా కూచివారిపల్లె–1 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి. -
ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసే ప్రతిష్టాత్మక మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో భాగంగా.. నిర్వహించిన టాలెంట్ హంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు అవకాశం లభించింది. జిల్లాకు చెందిన కె.రామ్మోహన్, ఇ.హేమావతిలతోపాటు పులివెందుల జేఎన్టీయూలో నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 14 మంది టాలెంట్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కడప స్పోర్ట్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు దాదాపు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో పూర్తి చేసుకోగా.. మంగళవారం విశాఖపట్నంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రతిభ కనబరిచిన వివిధ క్రీడాకారులను పరిశీలిస్తూ వచ్చిన శాప్ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, టాలెంట్ హంట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి వివిధ అసోసియేషన్లు, సంస్థలు దత్తత తీసుకోగా.. వీరికి ప్రభుత్వం సహకారం అందించి ఉత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఖోఖో క్రీడాంశంలో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. అయితే వీరిరువురూ విద్యాభ్యాసం, శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలలో చదువుతుండగా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆయా జిల్లాల నుంచి ప్రాతనిథ్యం వహించి సత్తా చాటారు. ఆల్‌రౌండర్‌గా హేమావతి.. చింతకొమ్మదిన్నె మండలం కొత్తపల్లెకు చెందిన సాధారణ రైతు శివశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె అయిన ఇల్లూరు హేమావతి పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కనిగిరిలో ఫిజికల్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. రన్నర్‌గా, ఛేజింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈమె జట్టు విజయంలో కీలకభూమిక పోషించి బెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. రామ్మోహన్.. ఛేజింగ్‌లో ఫస్ట్ చింతకొమ్మదిన్నె మండలం ఆర్.టి.పల్లె గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మ దంపతులు కుమారుడైన కట్లా రామ్మోహన్ పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇనకొల్లులోని డీసీఆర్ఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని, జె.పంగలూరు గ్రామంలోని ఎస్ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈయన ఛేజింగ్, రన్నింగ్‌లలో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో పలు సీనియర్ నేషనల్స్తోపాటు, ఖోఖో ప్రోలీగ్ పోటీల్లో చైన్నె క్విక్‌గన్, గుజరాత్ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జె.పంగలూరు సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించి బాపట్ల జట్టును స్టేట్ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించి ఖోఖో పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కె.గాయత్రి.. బ్యాటింగ్‌లో మేటి పులివెందుల పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ట్రిపుల్ఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి మహిళల క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరిచి టాలెంట్ హంట్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష న్ ప్రతినిధుల చూపును ఆకర్షించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సచివాలయం జట్టు నుంచి పాల్గొ న్న కడప మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గాయత్రి బ్యాటింగ్‌లో చక్కటి ప్రతిభ కనబరచడంతో టాలెంట్ హంట్‌కు ఎంపికై ంది. కాగా ఈమె స్వస్థలం పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్గా తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఈశ్వరరావు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు, క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ● బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కడప కాగితాలపేట సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్–ఖాజా జోడి రెండో రన్నరప్‌గా నిలిచాయి. ● బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో కడప శంకరాపురం–4 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన కె.వెన్నెల–శ్రీలత జోడి రన్నరప్‌గా నిలిచారు. ● వాలీబాల్ పురుషుల విభాగంలో అన్నమయ్య జిల్లా కూచివారిపల్లె–1 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి. టాలెంట్ హంట్‌లో జిల్లా క్రీడాకారులకు దక్కిన అవకాశం పోటీల్లో సత్తా చాటిన మనోళ్లు -
‘ఆడుదాం ఆంధ్ర’లో ఏలూరు జిల్లా హవా
● క్రికెట్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమస్థానం ● ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా వంశీ ఏలూరు రూరల్: విశాఖపట్టణంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏలూరు జిల్లా జట్లు సత్తా చాటాయి. క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు. మంగళవారం సాయంత్రం విశాఖలోని జీవీఎంసీ ఇండోర్‌స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ఏలూరు జిల్లా పురుషుల జట్టు ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుతో తలపడింది. జిల్లా క్రీడాకారులు ఆదిరెడ్డి గుణశేఖర్, ఆరేరపు వంశీకృష్ణరాజు ప్రత్యర్థి జట్టును 17–20, 21–16, 17–21 స్కోర్ల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేశారు. క్రికెట్ పోటీల్లో సైతం ఏలూరు జిల్లా జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా పురుషుల జట్టు విశాఖపట్టణం జట్టుతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఏలూరు జట్టు 15.4 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విజేత జట్లు షీల్డ్, కప్‌లతో పాటు రెండు జట్లు రూ.6 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వంశీకృష్ణరాజు ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపిక కాగా, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంశీకృష్ణరాజును దత్తత తీసుకుని ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. -
Adudam Andhra: వేడుక అదుర్స్
సాక్షి, విశాఖపట్నం/విశాఖ స్పోర్ట్స్ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా పోటీలు మంగళళవారం విశాఖ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగిశాయి. మట్టిలో మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖలో ఐదురోజుల పాటు ఉత్సాహంగా గడిపారు. ఆడుదాం ఆంధ్రా థీమ్ సాంగ్‌కు నృత్యం చేస్తున్న క్రీడాకారులు గత ఏడాది డిసెంబర్ 26న విజయవాడలో సీఎం జగన్మోహన్రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ క్రీడల్లో యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలు ఘనంగా ముగిశాయి. యువతలో స్ఫూర్తినింపిన క్రీడలు విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచాయి. చదువే కాదు క్రీడలు సైతం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయన్న భరోసాను యువతకు కల్పించాయి. వైఎస్సార్ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యం వ్యాయామాల పట్ల ప్రజలకు అవగాహన పెరగాలన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని చెప్పారు. ఇక్కడి విజేతలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా సంస్థలు ఎంపిక చేసిన విషయం ముఖ్యమంత్రి ప్రకటించడంతో యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది. కిటకిటలాడిన స్టేడియం ఆడుదాం ఆంధ్రా ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌కు వేలాది మంది యువత హాజరై మ్యాచ్ తిలకించారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు వచ్చినట్లుగా విశాఖ నగర యువతతో పాటు సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. స్టేడియంలో ఉత్సాహంగా అభిమానులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పటి నుంచి యువత కేరింతలు, ఈలలతో స్టేడియం మార్మోగింది. ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. హోరెత్తిన మైదానం ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలతో వైఎస్సార్ స్టేడియం హోరెత్తింది. ఒక పక్క చిన్నారుల నృత్యాలు.. మరో వైపు లేజర్ షో, ఫ్లాష్లైట్లతో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలుత స్టేడియంలో దుబాయ్ జట్టు ఫ్లాష్ డ్యాన్స్ చక్ దే ఇండియా అంటూ అలరించగా కూచిపూడి నృత్యకారిణులు ఓం నమఃశివాయ అంటూ చేసిన ప్రదర్శన అలరించింది. క్రీడాకారులు జయహో అంటూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. నృత్యం చేస్తున్న కళాకారులు మూడు కళారూపాలతో ‘ఆడుదాం ఆంధ్రా’ థీమ్ సాంగ్‌కు చేసిన నృత్యం అబ్బురపరిచింది. ఒక్కసారిగా స్టేడియంలో లైట్స్ఆఫ్ అయ్యాయి. అంతే డ్రోన్స్ ప్రత్యక్షమయ్యాయి. అనంతరం వియ్ ఆర్ రాకింగ్ అంటూ ఫ్లాష్ ఫోతో స్టేడియం మిరమిట్లు గొలిపే కాంతులీనింది. స్టేడియం మొత్తం లైట్లతో లయబద్ధంగా నాట్యమాడింది. రెండు నిమిషాలపాటు బాణసంచాతో స్టేడియం దద్దరిల్లింది. స్టేడియంలో క్రికెట్ ఫైనల్ పోరు పటిష్ట బందోబస్తు క్రీడోత్సవాలకు భారీగా క్రీడాకారులు, జనం తరలివచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్థానిక సీఐ వై.రామకృష్ణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కారు షెడ్ కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి సిబ్బందికి విధులు అప్పగించారు. పీఎంపాలెం–కొమ్మాది–వుడారోడ్డు –చంద్రంపాలెంకు వెళ్లే వాహనాలను క్రమబద్ధీకరించారు. వేడుకల్లో పాల్గొన్న వారు వీరే.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజనీ, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కె.భాగ్యలక్ష్మి, కంబాల జోగులు, నెడ్‌క్యాప్ చైర్మన్, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు,గాజువాక ఇన్చార్జి ఉరుకూటి చందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం జగన్
-
Adudam Andhra: విజేతల జాబితా ఇదే..
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, వుమెన్‌లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడి, వుమెన్‌లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, వుమెన్‌లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్‌ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్‌గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. కబడ్డీలో బాపట్ల ఆధిక్యం.. కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్‌కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు. -
అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం
మన ఊరిలో.. మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు. అలాంటి వారిని గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా..’ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పెంచేందుకు ‘ఆడుదాం ఆంధ్రా..’ ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు ఉత్సవాలు మంగళవారం విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యం, వ్యాయామంపై అవగాహన పెంచేలా.. మన ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంత అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలి. ఆడుదాం ఆంధ్రా ద్వారా ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాల్ని గుర్తించి వారి ప్రతిభకు సాన పెట్టి శిక్షణ ఇవ్వడం మరో లక్ష్యం. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన యువత రాణించేలా ప్రోత్సహించవచ్చు. ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా... ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ తదితర ఐదు క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఫైనల్స్ ముగించుకొని మన విశాఖలో, మన ఉత్తరాంధ్రలో, మన కోడి రామ్మూర్తి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలను నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు పోటీలో పాలుపంచుకున్న పిల్లలందరికీ అందిస్తున్నాం. తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ది బెస్ట్.. క్రికెట్లో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెమ్మలను టాలెంటెడ్ ప్లేయర్స్‌గా గుర్తించాం. కబడ్డీలో ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్‌లో ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ప్రతిభను చాటుకున్నారు. ఖోఖోలో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభను గుర్తించాం. బ్యాడ్మింటన్‌లో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభ నిరూపించుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తున్నాం. ఎంపికైన తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ద బెస్ట్. 14 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ దత్తత... ఈ బృహత్తర కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పాల్గొని ప్రతిభ చాటుకున్న 14 మందిని దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి పవన్ (విజయనగరం), చెల్లెమ్మ కేవీఎం విష్ణువరి్ధని (ఎన్టీఆర్ జిల్లా)ని చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇస్తుంది. క్రికెట్ నుంచే శివ (అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా), చెల్లెమ్మ గాయత్రి (కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకొచ్చింది. సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల)ని ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్(తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్‌కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆ సంస్థలు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకొచ్చాయి. ఇక ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’...! ఈరోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుంది. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత, ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకెళతాం. వీటివల్ల ఆటలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఆకట్టుకున్న లేజర్ షో ముగింపు ఉత్సవాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్రదర్శించారు. ఈ పాటకు దాదాపు 5 నిమిషాల పాటు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించిన లేజర్ షో ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ ఇన్చార్జీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. కమాన్.. క్రికెట్ టీమ్! క్రికెట్లో విజేతగా నిలిచిన ఏలూరు జట్టుకు చెందిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌ని వేదికపైకి రావాలని తొలుత నిర్వాహకులు ఆహ్వానించగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని క్రికెట్ టీమ్ మొత్తం వేదికపైకి రావాలంటూ స్వయంగా చేతులు చాచి ఆహ్వానించడంతో జట్టు సభ్యులంతా ఉత్సాహంగా స్టేడియంలో పరుగులు తీస్తూ వచ్చారు. సీఎంతో కరచాలనం కోసం పోటీపడ్డారు. సెక్యూరిటీని వారించి సీఎం వారితో ఎక్కువ సేపు గడిపారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీని సీఎం జగన్ అందజేశారు. మహిళా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఐదు విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల జాబితాను స్వయంగా ప్రకటించి బహుమతులు అందించారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. జగనన్నని కలిశామన్న ఆనందం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. అరగంట పాటు మ్యాచ్ వీక్షణ క్రికెట్ మైదానానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ క్రీడాకారులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఏలూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్స్ని అరగంట పాటు ఆసక్తిగా వీక్షించారు. వికెట్ పడినా.. ఫోర్లు, సిక్స్ కొట్టినా.. ఇరు జట్లనూ చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. -
అందుకోసమే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఈ పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా ఎప్పుడూ ఊహించని పద్దతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమన్నారు. విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగించారు. ఈ రెండు ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు. లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే.. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్తాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే.. 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని ఈ రోజు ఫైనల్స్‌తో ముగించుకున్నామని సీఎం జగన్ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు.. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది -
క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించిన సీఎం జగన్..!
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్న క్రీడాకారులు
-
విశాఖలో ఆడుదాం ఆంధ్రా పోటీల ముగింపు కార్యక్రమం
-
రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడలు
-
Adudam Andhra: ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్
-
Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం
గ్రామస్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూనే.. ఆరోగ్య విషయంలో ఆటలు ఎంత కీలకమో వివరిస్తూ.. ఆటలను జీవన శైలిలో భాగంగా మారుస్తూ.. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం... ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం.. అంతటికే పరిమితంగాక.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన బృహత్తర క్రీడా యజ్ఞం.. ‘‘ఆడుదాం ఆంధ్రా’’. ఈ మహా క్రీడా సంబరంలో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్ రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలను టాలెంట్ హంట్‌కు ఆహ్వానించింది. తద్వారా ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే విజయవంతం ఇలా ఆడుదాం ఆంధ్రా ద్వారా.. వ్యాయామ ఆవశ్యకత, ఆరోగ్యపరంగా అది ఎంత కీలకమో గ్రామస్థాయి నుంచి చైతన్యం కల్పిస్తూ. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి, క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగనన్న ప్రభుత్వం.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైందని చెప్పవచ్చు. నిదర్శనం ఇదే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో భాగం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ పోటీలను 80 లక్షల మంది వీక్షించడం ఆడుదాం ఆంధ్రాకు దక్కిన ఆదరణకు తార్కాణం. మేటి ఆటగాళ్లు తాము సైతం అంటూ రాష్ట్రం నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ కోన శ్రీకర్ భరత్, టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని, బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు వంటి మేటి ప్లేయర్లు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంలో భాగం కావడం విశేషం. ఇక మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా! 50 రోజుల పండుగ.. విశాఖలో ముగింపు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పండుగ తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ఆయన వీక్షిస్తారు. ఆ తర్వాత క్రీడాకారులు, క్రీడల ఆవశ్యకతను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇలా ఈ క్రీడా సంబరంలోని తొలి ఎడిషన్ పూర్తికానుంది. చదవండి: ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే -
మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు: సీఎం జగన్
CM YS Jagan Vishaka Visit Updates 6:52PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది 6:50PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా లైట్ షో ప్రదర్శన తిలకిస్తున్న సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో కళాకారుల నృత్య ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు 6:30PM, Feb 13, 2024 ఆరు వికెట్ల తేడాతో విశాఖపై ఏలూరు క్రికెట్ జట్టుపై విజయం ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖ క్రికెట్ జట్టుపై ఏలూరు జట్టు విజయం సాధించింది 6:15PM, Feb 13, 2024 వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించారు. సీఎం జగన్ చప్పట్లు కొడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు 6:00PM, Feb 13, 2024 సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు చివరి ఐదు ఓవర్ల మ్యాచ్‌ను సీఎం జగన్ వీక్షిస్తున్నారు విశాఖ-ఏలూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు 5:23PM, Feb 13, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ 4:55 PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖ చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ 4:18PM, Feb 13, 2024 విశాఖకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 2:50PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 50 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగిన క్రీడలు విజేతలకు బహుమతులు అందజేయనున్న సీఎం జగన్ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది.