amma odi
-
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
సుస్థిర ప్రగతే లక్ష్యం ఆపొద్దు ఈ పయనం
‘సమాజ పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తూ రాష్ట్రాభివృద్దికి బాటలు వేసింది. పేద, మధ్య తరగతి వారికి మంచి జరగాలంటే పాలకుడికి అనుభవం ఉంటే సరిపోదు. మంచి మనస్సు, వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం, సామాజికం, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అనేక అవకాశాలను కల్పించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టింది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పేద మహిళా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం ‘వైఎస్సార్ చేయూత పథకం’ అమలు చేసింది. ఈ రెండు పథకాలు లక్షలాది కుటుంబాల వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం సొమ్మును నాలుగు ధపాలుగా వారికి అందిస్తామ’ని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరిగి ఎన్నికల జరిగే సమయానికల్లా ఆక్షరాల అమలు చేసి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి నూరు శాతం బ్యాంకులకు తమ అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ దశలో దేశంలో ఇతర రాష్ట్రాల పొదుపు సంఘాలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ♦ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నాన్ డీబీటీ ద్వారా రూ. 2,72,811 కోట్లు సాయం అందించింది. ♦ ఇంతకు ముందు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం అంత భారీగా స్థాయిలో పేద మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ♦ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చే సుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించింది. ♦ ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా అంతర్జాతీయ సంస్థలు, పేద మహిళల మధ్య సమన్వయం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్త (సెర్ప్) కార్యాలయంలో ప్రత్యేక విభాగం కొనసాగిస్తున్నారు. అతివలను అందలం ఎక్కించాలనే.. ♦ 57 నెలల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన సహాయం, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కువడానికి అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలోని 18,37,568 మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ♦ అంతకు ముందు లేనివి, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాలకు అందించిన తోడ్పాటుతో 54 శాతం మంది రూ. 5 వేలకు పైనే అంటే ఏడాదికి రూ. 60 వేలకు పైబడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ♦ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 14,01,519 మంది పొదుపు సంఘాల మహిళలు ఏటా రూ. లక్ష చొప్పున ఆదాయం పొందుతూ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నారు. ♦ మరో 31,04,314 మంది ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ. 5 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ. లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు ♦ 2021–2023 ఆర్థిక సంవత్సరంలో 1,126 మంది పొదుపు సంఘాల మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ఏర్పాటు చేసుకుని భావి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ♦ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ,ఎస్టీ మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తే ప్రత్యేకంగా ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో నైపుణ్యాలపై శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తోంది. స్వయం కృషి ‘వనిత’ర సాధ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 250 స్వయం సహాయ సంఘాల మహిళలంతా కలిసి కార్పొరేట్‌కు దీటుగా చేయూత మహిళా మార్ట్ పేరిట షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ కేవలం రూ.210 పెట్టుబడితో దీనిలో భాగస్తులయ్యారు. కేవలం పది నెలల్లోనే ఈ మార్ట్ మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. గత సంక్రాంతి సీజన్లో రూ.రెండులక్షల వరకు అమ్మకాలు జరిపి అందరినీ అబ్బురపరిచింది. డాంబికాల ‘డప్పు’తో సరి ♦ 2014 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ♦ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే డ్వాక్రా అప్పులు మహిళలు బ్యాంకులకు కట్టొద్దని గొప్పగా డప్పు కొట్టారు. ♦ ఆయన చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మందికి పైగా తమ అప్పులు కట్టలేదు. ♦ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దీనివల్ల ఏకంగా 18.36 శాతం పొదుపు సంఘాలు (అంటే దాదాపు 14 లక్షల మందికి సంబందించిన సంఘాలు) ఎన్పీఏ (బ్యాంకుల వద్ద రుణ ఎగవేతదారు)లుగా ముద్రవేయించుకున్నాయి. నూరుశాతం మహిళా సాధికారత మహిళా సాధికారత అనే మాట గతంలో వినడం తప్ప సాధించింది లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారత నూటికి నూరుశాతం అమలవుతోంది. మహిళలు సంక్షేమ పరంగా, రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ ప దవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. – తానేటి వనిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజకీయంగా ఇంకా చైతన్యం రావాలి మహిళలు రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావాలి. గృహిణిగా పరిమితం కాక సమాజంలో అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉండాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సంక్షేమంతోపాటు రాజకీయంగా మహిళలకు పురుషులతోపాటు సమభాగం కల్పిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళకు కేటాయించడం అభినందనీయం. –ఘంటా పద్మశ్రీ, చైర్పర్సన్, పశ్చిమగోదావరి జెడ్పీ ధైర్యంగా ముందడుగు వేయాలి మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలి. మహిళలు మానసికంగా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం బలంగా ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపదలో ఉన్నవారికి, అన్యాయం జరిగిన మహిళలకు మహిళా కమిషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. – బూసి వినీత, మహిళా కమిషన్ సభ్యురాలు -
అమ్మ ఒడి గురించి సీఎం జగన్ అద్భుతమైన వివరణ
-
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్. అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు. రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు. పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు ♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601 ♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు ♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు ♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251 ♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852 -రమణమూర్తి మంథా -
విద్యా దీవెనతో మారిన బతుకుచక్రం..!
-
‘సామాజిక’ సంచలనం
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల దాకా సింహభాగం పదవులిచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయా వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. చేతల్లో సామాజిక న్యాయం.. ► ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 8న తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. ► 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంపై సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ► టీడీపీ అధికారం ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50%) రాజ్యసభకు పంపి సీఎం జగన్ చిత్తశుద్ధి చాటుకున్నారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో 18 మంది (57 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థలలోనూ.. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు దాఖలు చేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లకు అడ్డుపడ్డా పార్టీపరంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చారు. ► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 (46%) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గా లకు 9 జడ్పీ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. ► రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే కేటాయించారు. ► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. చట్టం చేసి నామినేటెడ్ పదవులు ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తూ సీఎం జగన్ చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆయా వర్గాలకు రిజర్వు చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు(39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ► ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు(39శాతం) బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 (58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు చెందిన వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులు ఉండగా అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమంలో సింహభాగం.. ► మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.1.77 లక్షల కోట్లను ప్రభుత్వం అందించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.1.31 లక్షల కోట్ల మేర (74 శాతం) లబ్ధి చేకూరింది. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి అన్ని వర్గాలకు మొత్తం రూ.3.19 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రూ.2.50 లక్షల కోట్ల (79 శాతం) మేర మేలు జరిగింది. -
ట్యాబ్‌లపై తప్పుడు రాతలు.. ప్రజల దృష్టి మళ్లించేందుకే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్ది వారు అంతర్జాతీయ అవకాశాలను కూడా అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తుంటే.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక వర్గానికి చెందిన పచ్చ మీడియా ఇష్టారాజ్యంగా తప్పుడు వార్తలు వండి వారుస్తోంది. రాష్ట్రంలో 5.18 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను బుధవారం సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లుచేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంగళవారం ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న పచ్చపత్రిక ‘ల్యాప్ పోయి ట్యాబ్ వచ్చే’.. అంటూ అసత్యాలతో ఓ కట్టుకథను అల్లింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని విద్యాశాఖ మంగళవారం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలేమిటో సవివరంగా ప్రకటించింది. ఆ వివరాలు.. తప్పుడు వార్తలోని మొదటి ఆరోపణ రాష్ట్రంలోని 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేడు కేవలం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు మాత్రమే అందిస్తోంది. వాస్తవం ఇదీ: ఇది నిజం కాదు. గతంలో అమ్మఒడికి బదులు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్ అమ్మఒడికి అదనం. ఈ ట్యాబ్, ఈ–కంటెంటు ఖరీదు రూ.31,899. దీనివల్ల ప్రతి విద్యార్థికీ అమ్మఒడికి అదనంగా అంతకుమించిన లబ్ధి కలుగుతోంది. విద్యార్థికి 8, 9 తరగతుల కంటెంట్‌ను సెక్యూర్డ్ డిజిటల్ (ఎస్డీ) కార్డు ద్వారా ప్రస్తుతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది పదో తరగతి కంటెంట్‌ను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల 4,59,564 మంది విద్యార్థులకు అత్యుత్తమ ఈ–కంటెంట్ ఈ ట్యాబ్‌ల ద్వారా అందుతుంది. అంతేకాక.. 4, 5, 6, 7, 9, 10 తరగతులకు సంబంధించిన 32 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా బైజూస్ ఈ–కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీని ఖరీదు బహిరంగ మార్కెట్లో రూ.15వేలు. రెండో ఆరోపణ అమ్మఒడికి రూ.15వేలు ఇస్తుండగా.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు రూ.21వేలు ఖర్చవుతుందని ఆ ప్రాజెక్టును ప్రభుత్వం అటకెక్కించింది. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణా అవాస్తవమే. గత ఏడాది ల్యాప్‌టాప్ చిప్‌ల కొరత ఏర్పడింది. దీనివల్ల ల్యాప్‌టాప్‌ల విక్రేతలు కోట్ చేసిన ధర అంచనా విలువకన్నా 16 శాతం మేర అధికంగా ఉంది. అంతేకాక.. వారు నిర్ణీత సమయం కన్నా 200 రెట్లు ఆలస్యంగా సరఫరా చేస్తామని, ఆ మేరకు తమకు వ్యవధి ఇవ్వాలని అడిగారు. ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీవల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావించింది. పైగా.. ల్యాప్‌టాప్‌ల కోసం 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు 8వ తరగతిలోని వందశాతం మంది విద్యార్థులు అమ్మఒడి కింద ఇచ్చే నిధులతో పాటు ట్యాబ్‌లను కూడా అందుకోనున్నారు. -
సీఎం కేసీఆర్ పథకానికి పైసల్లేవా? ఏంటీ పరిస్థితి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: బాలింతలకు అండగా నిలిచే కేసీఆర్ కిట్ల పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. దీంతో ప్రోత్సాహకపు సొమ్ము, కిట్ల పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన కొందరు తల్లులు.. నగదు ప్రోత్సాహకం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కక పోవడంతో నిరాశకు గురవుతున్నారు. బాలింతగా ఉన్నప్పుడు అందాల్సిన సాయం.. కొందరికి ఏడాదికి పైగా గడిచినా అందడం లేదనే విమర్శలున్నాయి. దాదాపు రూ.400 కోట్లకు పైగా ప్రోత్సాహకపు సొమ్ము బకాయి ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఐదేళ్లలో 13.58 లక్షల ప్రసవాలు.. ముఖ్యమంత్రి పేరిట కేసీఆర్ కిట్ పథకాన్ని 2017లో ప్రారంభించారు. అప్పట్నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. 2017 జూన్ 2 నుంచి ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి మొత్తంగా దాదాపు 28.53 లక్షల ప్రసవాలు జరగ్గా..అందులో 13.58 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయి. మగ బిడ్డ పుడితే తల్లికి రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు రెండు దఫాలుగా ఇస్తున్నారు. అలాగే తల్లికి, బిడ్డకు రెండు జతల దుస్తులు, పిల్లలకు వెచ్చగా ఉండడానికి పరుపు, నూనె, సబ్బు, పౌడర్ వంటి 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను కూడా బాలింతకు ఇస్తున్నారు. అన్ని విధాలా ప్రయోజనకారిగా ఈ కిట్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కిట్లు ఆశించిన మేరకు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రోత్సాహకంగా అందాల్సిన నగదు కూడా కొన్నాళ్లుగా నిధుల కొరత వల్ల అందడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లోని డాక్టర్లను అడిగితే కిట్లు రాలేదని అంటున్నారని చెబుతున్నారు. లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో.. ఇప్పటివరకు మొత్తం 13.58 లక్షల మంది లబ్ధిదారులకు గాను 12.02 లక్షల కిట్లు అందజేశారు. అంటే మరో లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఆయా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున వేసుకున్నా, రూ.1,629 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.1,217 కోట్లు మాత్రమే అందజేశారు. అంటే రూ.412 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తారు. అలా చూస్తే ఇంకా పెద్ద మొత్తమే పెండింగ్‌లో ఉండి ఉంటుందని అర్థ్ధమవుతోంది. వివరాలు నమోదు చేసుకున్నారు కానీ.. ఈ నెల 15 వ తేదీన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నాకు రెండో కాన్పుగా ఆడపిల్ల జన్మించింది. కేసీఆర్ కిట్ మాత్రం అందజేశారు. ప్రభుత్వం అందించే డబ్బులు ఇచ్చేందుకు వివరాలు మాత్రం తీసుకున్నారు. మొదటి కాన్పు సమయంలో డబ్బులు, కేసీఆర్ కిట్టు రెండూ అందాయి. – చలకోటి స్వరూప, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం కిట్ మాత్రం ఇచ్చారు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 15న నాకు మగబిడ్డ పుట్టాడు. కేసీఆర్ కిట్ మాత్రం ఇచ్చారు. డబ్బుల కోసం అడిగితే ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదని చెప్పారు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పుడు తొలుత రూ. 5 వేలు, తర్వాత కొంత ఆలస్యంగా రూ.8 వేలు అందాయి. – దుర్గా భవాని, భద్రాచలం రెండేళ్లయినా డబ్బులు రాలేదు 2020 ఆగస్టు 21వ తేదీన మానుకోట ఏరియా ఆసుపత్రిలో మొదటి కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చా. కేసీఆర్ కిట్టు ఇచ్చారు కానీ, డబ్బులు ఇంకా రాలేదు. – మంజుల, కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్ ఏడాదిగా ఎదురుచూపులు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ములుగు ఏరియా ఆసుపత్రిలో నాకు డెలివరీ అయ్యింది. ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు రాలేదు. – ప్రియాంక, ఏటూరునాగారం, ములుగు జిల్లా -
అమ్మఒడి పథకంపై పిల్ మూసివేత
సాక్షి, అమరావతి: కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, సీజే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారంతో తిరిగి పిల్ దాఖలు చేసుకోవచ్చంది. ‘ఈ–వాచ్’పై తదుపరి విచారణ 25కి వాయిదా పంచాయతీ ఎన్నికల నిర్వ హణకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) సొంతంగా ఈ–వాచ్ పేరుతో యాప్‌ను రూపొందించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ–వాచ్ యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(ఏపీటీఎస్ఎల్) లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిందని, దీన్ని పరిశీలించేందుకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్’, ‘నిఘా’లను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు న్యాయవాది కట్టా సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇవే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలి, బుర్రిపాలెంలకు చెందిన ఎ.నాగేశ్వరరావు, ఎ.అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా పిల్స్ వేశారు. మాపై కేసులు కొట్టేయండి హైకోర్టులో పౌర హక్కుల సంఘం, విరసం నేతల పిటిషన్లు సాక్షి, అమరావతి: తమపై విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి, విరసం సభ్యులతో పాటు మరికొంతమంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, గంటా రామారావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి స్థాయి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. సివిల్ జడ్జిల భర్తీ అర్హతపై దాఖలైన పిటిషన్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి చేసిన వారే జూనియర్ సివిల్ జడ్జి పదవికి అర్హులంటూ ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రేగలగడ్డ వెంకటేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేశ్రాయ్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. మూడేళ్ల న్యాయవాద వృత్తి చేసిన వారే సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులకు అర్హులంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు సూచించిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. -
అమ్మ ఒడి పథకం యధాతథంగా అమలు
సాక్షి, విజయవాడ: అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవో నంబర్ 3 విడుదల చేశామని.. 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామన్నారు. సోమవారం తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.(చదవండి: మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసిన నిమ్మగడ్డ) ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తీరును మంత్రి సురేష్ తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ ఇస్తున్న సూచనలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పాటించరా? అని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారో నిమ్మగడ్డ జవాబు చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. (చదవండి: ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్) -
కొడుకూ కోడలే తరిమేశారయ్యా!
తిరుపతి క్రైం : జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులకు ఏ లోటూ రాకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత. అయితే దీనిని గాలికొదిలేస్తున్న వారి సంఖ్య కొన్నేళ్ల కాలంలో పెరిగిపోతోంది. అసలే కరోనా ప్రజలను భయపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ వృద్ధురాలిని నిర్దయగా వదిలించుకున్నారు. వివరాలు.. 40 రోజులుగా రుయా ఆస్పత్రిలో ఆవరణలో∙ఉంటున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోందని అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆదేశాలతో అలిపిరి సీఐ సుబ్బారెడ్డి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు కాంతమ్మ అని, కొడుకులు, కోడళ్లు తరిమేయడంతో అనాథగా అయ్యానని కన్నీటిపర్యంతమైంది. దీంతో సీఐ ‘అమ్మ ఒడి’ వ్యవస్థాపకులు పద్మనాభనాయుడుతో మాట్లాడారు. వృద్ధురానికి ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె గురించి ‘సాక్షి’ పద్మనాభనాయుడితో ఫోన్లో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె తన పేరు మాత్రమే చెబుతోందని, కొడుకులు ఇద్దరు..కాదు..ఒకడే అని, తనది వల్లివేడు (పాకాల మండలం), రేణిగుంట, పుత్తూరు అని పొంతన లేకుండా చెబు తోందని ఆశ్రమ నిర్వాహకుడు చెప్పారు. కాలి బొటనవేలికి పెద్ద పుండు అయ్యిందని, ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. -
పేదింట్లో వెలగాలి విద్యాదీపాలు
నన్ను చాలా మంది అంటున్నారు. అమ్మ ఒడిలో అన్ని డబ్బులు పెడుతున్నానని, నాడు–నేడుకు ఇంత ఖర్చు పెడుతున్నానని, ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అంటున్నానని, ఇంతింత డబ్బు ఖర్చు పెడుతున్నానని అన్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే... నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడుతున్నా. పేదవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే.. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలి. అప్పుడు వారు మంచి ఉద్యోగం చేసి ఎంతో కొంత పంపితే ఆ కుటుంబాలు బాగుపడి పేదరికం నుంచి బయటపడతాయి. వారి జీవితాలు బీపీఎల్ నుంచి మధ్య తరగతికి ఎదుగుతాయి. అలా చదివించలేకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతారు. పేదరికానికి ఏకైక పరిష్కారం ఉన్నత విద్య. దిస్ ఈజ్ వాట్ ఛేంజ్ ది లైఫ్ ఆఫ్ పీపుల్. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటారు. అందుకే మధ్యాహ్న భోజనంలోనూ సమూల మార్పులు చేశాం. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ రోజుకో వెరైటీతో మెనూ అమలు చేస్తున్నాం. నా పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతుండగా ఓ ఇంటి ముందు ఒక పిల్లవాడి ఫ్లెక్సీ ఉంది. ఆ ఇంటి యజమాని గోపాల్ నన్ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంజనీరింగ్ చదివే కుమారుడు ఫీజులు కట్టేందుకు తండ్రి పడే కష్టాన్ని చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు, ఆ తండ్రి బాధను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదీ గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగం పరిస్థితి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు పథకాలపై వెచ్చిస్తున్న ఖర్చంతా మన పిల్లల భవిష్యత్తు కోసం తాను పెడుతున్న పెట్టుబడిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే వెలకట్టలేని ఆస్తి చదువు మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ ఈ ఏడాది మార్చి 31 వరకు ఫీజులు పూర్తిగా చెల్లిస్తూ ఒకేసారి రూ.4,200 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,880 కోట్లు కూడా చెల్లించామని చెప్పారు. ‘మన పాలన–మీ సూచన’లో భాగంగా బుధవారం మూడోరోజు విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు. విద్యారంగ నిపుణులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. పాదయాత్రలో స్వయంగా చూశా.. మా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యా రంగం ఎలా ఉండేదో గమనిస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపించాయి. ఎన్నికల ముందు సుదీర్ఘంగా సాగిన నా పాదయాత్రలో చాలా మంది చిన్నారులు నాతో కలిసి అడుగులు వేశారు. అక్టోబర్, నవంబర్ వరకు కూడా వారికి పుస్తకాలు అందలేదని తెలిసింది. మధ్యాహ్న భోజన పథకం ఆయాలు చాలా మంది ఏడెనిమిది నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని, రూ.1,000 గౌరవ వేతనాలు కూడా చెల్లించడం లేదని చెప్పినప్పుడు ఆవేదన చెందా. అధ్వాన స్థితిలో స్కూళ్లు నాడు అధ్వాన పరిస్థితిలో స్కూళ్లున్నాయి. బాత్రూమ్లు లేవు. ఒకవేళ ఉన్నా నీళ్లు రావు. పాఠశాలల భవనాలు బాగు చేయాలన్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వానికి లేదు. టీచర్లు ఎంత మంది ఉండాలో స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల వైపు చూడకుండా ఖర్చు ఎక్కువైనా సరే పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోనే చేర్పించాలని తల్లిదండ్రులు భావించే పరిస్థితి ఉండేది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తెలుగు మీడియంలోనే ఉన్నాయి. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సదస్సుకు హాజరైన విద్యార్థులు, తల్లి దండ్రులు, టీచర్లు, విద్యారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు కాంపిటేటివ్‌గా ఉండాలి పిల్లలు చదవాలి అంటే కాంపిటేటివ్‌గా ఉండాలి. ముఖ్యంగా పేద పిల్లలు కాంపిటేటివ్‌గా ఉండాలి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, సెల్ఫోన్లలో మెసేజ్‌లు అన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటున్నాయి. డ్రైవర్లు లేని కార్లు కూడా రానున్నాయి. మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నా కొందరు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న ఈ పెద్దమనుషులు ఎవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లకు పంపడం లేదు. ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఈ కాంపిటేషన్‌లో పేదవాడు బతకాలంటే, తమ కాళ్ల మీద తాము బతికే పరిస్థితి రావాలంటే వారికి మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే. ఇంటర్‌తోనే ఆగిపోతున్నారు.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33 శాతం ఉండగా దేశంలో 27 శాతం మంది ఉన్నారు. ఇంటర్ తర్వాత ఎంత మంది పిల్లలు ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరుతున్నారో ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. బ్రిక్స్ దేశాల జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) చూస్తే రష్యాలో 82 శాతం ఎన్రోల్ అవుతుండగా, బ్రెజిల్లో 51 శాతం, చైనాలో కూడా దాదాపు అదే శాతం ఎన్రోల్ అవుతుండగా, భారత్‌లో మాత్రం కేవలం 25.8 శాతం మంది మాత్రమే ఎన్రోల్ అవుతున్నారు. అంటే 74 శాతం విద్యార్థులు అక్కడితోనే చదువు ఆపేస్తున్నారు. చదవడం ఇష్టం లేక కాదు, కేవలం తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చదువు మానిపిస్తున్నారు. స్కూళ్ల స్వరూపం మారుస్తాం రాష్ట్రంలో 47,656 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలున్నాయి. నాడు–నేడు కార్యక్రమం ద్వారా తొలివిడతగా 15,715 స్కూళ్ల రూపు రేఖలు జూలై నాటికల్లా మారుస్తాం. ప్రతి స్కూల్లో టాయిలెట్లు, మంచినీరు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ (కొత్త బల్లలు), పెయింటింగ్ ఫినిషింగ్, ప్రహరీ, ఇంగ్లిష్ మీడియం ల్యాబ్ లాంటి 9 రకాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లు, కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన వాటి రూపురేఖలు మార్చబోతున్నాం. అమ్మ ఒడి ఇవన్నీ చేస్తూ నిరుపేద కుటుంబాలు పిల్లలను బడికి పంపించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,350 కోట్లు జమ చేశాం. అప్పుడు అమ్మలకు ఒక మాట చెప్పా. వచ్చే ఏడాది కూడా ఈ మొత్తాన్ని తీసుకోవాలంటే పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని చెప్పా. వచ్చే ఏడాది కూడా జనవరి 9న అమ్మ ఒడి డబ్బులిస్తాం. పారశాలలు తెరిచే రోజే విద్యా కానుక పిల్లలు ఇంకా బాగా చదవాలని ఆగస్టు 3న పాఠశాలలు తెరిచే రోజే జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇస్తాం. దీనికి దాదాపు రూ.660 కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం పిల్లలు స్కూల్‌ను ఇష్టపడాలంటే అందించే ఆహారం కూడా బాగుండాలి. మధ్యాహ్న భోజనం ఆయాల జీతాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాం. వారి జీతాలు, సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్ చానల్లో పెట్టించాం. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే మెనూపై గతంలో ఏ సీఎం కూడా ఆలోచించని విధంగా నేను ఆలోచన చేస్తే విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 20 రోజులు కసరత్తు చేసి మెనూ ఖరారు చేశాం. డైటీషియన్లతో కూడా మాట్లాడాం. పులిహోర, వెజిటబుల్ రైస్, బెల్లం పొంగలి, కిచిడీ, చిక్కీలు ఇస్తూ జగనన్న గోరుముద్దను జనవరి 21న ప్రారంభించాం. దీనికోసం అదనంగా ఏటా రూ.425 కోట్లు ఖర్చయినా అమలు చేస్తున్నాం. మండలానికో జూనియర్ కాలేజీ పిల్లలు ఇంటర్ తర్వాత చదువుకునేందుకు మండలానికి కనీసం ఒక జూనియర్ కాలేజీ కూడా లేదని తెలియడంతో ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా మార్చాలని నాడు–నేడులో చేర్చాం. పూర్తి ఫీజుల చెల్లింపు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం కోసం ప్రక్షాళన చేపట్టాం. అందులో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం రూ.1,880 కోట్లు బకాయి పెట్టింది. దీంతో పాటు ఈ ఏడాది మార్చి 31 వరకు ఒకేసారి దాదాపు రూ.4,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. దీనివల్ల 10 లక్షల మంది బీసీలకు రూ.1,800 కోట్లు, 4లక్షల మంది ఎస్సీలకు రూ.800 కోట్లు, 80 వేల మంది ఎస్టీలకు రూ.130 కోట్లు, 1.45 లక్షల మంది మైనారిటీలకు రూ.300 కోట్లకు పైగా లబ్ధి కలిగింది. 3.5 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.1,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. బకాయి పడిన పిల్లలతో కలిపి చూస్తే దాదాపు 19 లక్షల మందికి రూ.4,200 కోట్లు ఫీజుల కోసం చెల్లించాం. ఇక తల్లుల ఖాతాల్లోనే... వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తి కాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తం జమ చేస్తాం. అప్పుడు ఆ తల్లి కాలేజీకి వెళ్లి వసతులు పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశాకే ఫీజులు చెల్లించాలి. అవి సరిగా లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ విద్యా దీవెన కార్యక్రమం ఉంటుంది. నేనే స్వయంగా ఏడాదికి నాలుగు సార్లు తల్లులతో మాట్లాడి డబ్బులు విడుదల చేస్తా. వసతి దీవెన వసతి దీవెన ద్వారా కాలేజీల్లో చదివే పిల్లలకు హాస్టల్, మెస్ చార్జీల కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తాం. ఇది రెండు దఫాల్లో తల్లుల ఖాతాల్లో వేస్తాం. తొలిదఫా రూ.10 వేలు జనవరి, ఫిబ్రవరిలో.. మిగిలిన రూ.10 వేలు సెప్టెంబరులో తల్లుల ఖాతాల్లో వేస్తాం. చదువు కాగానే ఉపాధి చదువు పూర్తయ్యే సరికి ఉపాధి లభించేలా ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం. కోర్సులు యథావిధిగా ఉంటాయి. చివరి సెమిస్టర్, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వైఎస్సార్ కంటి వెలుగు ఈ ఏడాది నాకు చాలా సంతోషం కలిగించిన పని.. ‘వైఎస్సార్‌కంటి వెలుగు’. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం కాగా ఇప్పటికే 1.29 లక్షల మందికి పంపిణీ చేశారు. త్వరలోనే మిగతావి కూడా పంపిణీ చేస్తారు. స్కూళ్లు తెరిచిన తర్వాత 46 వేల మంది పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తుంది.కార్యక్రమంలో మంత్రులు సురేష్, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు ‘కార్పొరేట్’తో పోటీ పడతాం ఆంగ్ల భాషను నేర్చుకోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంది. మాతృభాషను కంటితో పోల్చితే ఇంగ్లిష్ కళ్లజోడు లాంటిది. దీని సహాయంతో మరింత బాగా చూడగలం. ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల మాలాంటి పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో చదివే వారితో పోటీపడగలుగుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంగ్లిష్ మీడియం తెచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మా మేనమామగా మీరు పక్కనుంటే గెలుపు మాదే. – కె.గౌతం, పదో తరగతి, జెడ్పీహెచ్, నిడమానూరు తరతరాలకూ గుర్తుంటారు.. అన్నా.. నాకు ముగ్గురు ఆడపిల్లలు. కన్నది మేమే అయినా వారిని మేనమామలా ఆదుకుంటున్న మీకు ధన్యవాదాలు. అమ్మ ఒడి డబ్బులు రాగానే సుకన్య పథకం కింద ఇద్దరికీ చెరొక ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశాం. తరతరాలకూ మీ పేరు చెప్పుకుంటాం. మా ఆయుష్షు కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్లూ జీవించాలి. – కె.సరిత, విద్యార్థినుల తల్లి -
అమ్మ ఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి
అమ్మ ఒడి అనగానే భద్రత, బాధ్యతల మేలు కలయిక అనిపించకమానదు. చిన్నారులు అమ్మవొడిలో ఉన్నప్పుడు పొందే భద్రత మరెక్కడా దొరకదు. అలాగే అమ్మలు ఆ బిడ్డను అత్యంత భద్రతగా ఉంచే స్థానం అమ్మవొడి ఈ అమ్మఒడి కేవలం అమ్మల వద్దనే తప్ప బిడ్డకు మరెక్కడా ఉండదని, దొరకదని కూడా అందరికీ తెలుసు. ఇలా రాష్ట్రంలోని ప్రతి బిడ్డకూ అమ్మఒడి లాంటి స్థానం కల్పించాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తే ఇక ఆ రాష్ట్రంలోని పిల్లలకు ఇంతకన్నా మరో భాగ్యం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆంధ్రరాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల లాగా పిల్లలను ఓటర్లు కాదు కదా అని పక్కన పెట్టలేదు. పైగా, పిల్లలే భవి ష్యత్తు.. వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే చాలు రానున్న రోజుల్లో వందశాతం అక్షరాస్యతతోపాటు పెరిగి పెద్దదైన బిడ్డకు ఉపాధి గురించి ఎవరి కాళ్లావేళ్లా పడకుండా ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలరనే ఆశాభావంతో ఈ అమ్మవొడి పథకాన్ని తీసుకువచ్చారు. కేవలం తల్లులకు ప్రతి సంవత్సరం పది హేను వేలు ఇచ్చేసి మీరు మీ పిల్లలకు ఖర్చుపెడతారో లేక వృధా చేస్తారో అని వదిలేసే ప్రభుత్వ పథకాల్లో కాకుండా నేరుగా పిల్లలున్న తల్లికే డబ్బు చేరేలా ఏపీలో వైఎస్ ప్రభుత్వం జాగ్రత్త వహిం చింది. ఆ తల్లులు సహితం డబ్బు వృథా చేయకుండా బాధ్యతగా పిల్లలను బడికి పంపించి చది వించేలా రూపొందిన ఈ పథకం కేవలం తల్లులకు డబ్బులు పంచి పెట్టే కార్యక్రమం అనుకుంటే అక్షరాల తప్పే. అమ్మఒడి లబ్ధిదారులు వారి బిడ్డల చదువుకోసం ఇంగ్లిష్ మీడియం కావాలని ప్రైవేటు పాఠశాలల కోసం పక్కదారి పట్టకుండా ప్రభుత్వమే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి దఫా ఒకటి నుంచి ఆరవతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంతో పాఠశాలలు నడపుతోంది. ఆ పాఠశాలలకు వచ్చే బడుగు, బలహీన వర్గాల పిల్లలు సరైన పోషకాహారం లేక బలహీనంగా ఉండకూడదనే నిశ్చయంతో గోరుముద్ద ద్వారా సమతుల పౌష్టికాహారం అంది స్తోంది. అది కూడా కేవలం రోజూ పెట్టిన కూరలే పెట్టకుండా వారానికి సరిపడ భోజన మెనూ తయారు చేసి రుచీ, పౌష్టికాహారం రెండూ ఉండేలా తమ బిడ్డలకు కొసరి, కొసరి అమ్మ ఎలా తిననిస్తుందో అలానే రోజువారీ భోజన పట్టిక తయారు చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే ఆలోచనకు ఇంతకు మించిన దాఖలా మరొకటి ఉండదు. అలాగే అమ్మకు డబ్బులివ్వడం, భోజనం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థినీ, విద్యార్థులందరికీ దుస్తులూ, పుస్తకాలు ఎప్పుడు అందుతాయని ఎదురు చూడకుండా, దుస్తులు, పుస్తకాలతోబాటు పిల్లలు చెప్పులు లేకుండా నడవరాదని ఏపీ ప్రభుత్వం సంకల్పంచింది. పక్కింటి బాబు దొరబాబులా బూట్లు వేసుకుని ప్రైవేటు పాఠశాలకు వెళుతుంటే పేద పిల్లలు బిక్కమొహం వేసుకుని చూడకుండా తామూ వారి లాగానే తయారయి బడికి వెళుతున్నామని గర్వంగా ఫీలయ్యేలా పిల్లలకు బూట్ల జతలు సహితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొందరు రానున్న తరాలు సైతం జగన్ ప్రభుత్వాన్ని మరిచిపోవేమో అని భయపడుతున్నారో లేదా పేదపిల్లలూ పెద్దింటివారి పిల్లలు సమానమంటే మనసు ఒప్పుకోవడం లేదేమో.. అదీ కాక ఇంతకాలం తాము పెంచి పోషిస్తున్న తిరిగి తమను పోషిస్తున్న కార్పొరేటర్ విద్యా సంస్థలకు ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ చెబితే ఆ కార్పొరేట్ బడులకు కాలం చెల్లిపోతుందేమో అన్న వేదన పీడిస్తుందేమో గానీ తెలుగు భాషపై ఎనలేని మమకారం తెచ్చిపెట్టుకుని తెలుగు భాష తెల్లారిపోతుందని నానాయాగీ చేస్తున్నారు. కానీ గురివిందచందమైన వారి విధానం వారు కొమ్ముకాసే కార్పొరేట్ విద్యాసంస్థలు ఏనాడైనా తెలుగు వెలగబెట్టాయో, ఆ పాఠశాలల్లో తెలుగు పంతుళ్లైనా ఉన్నారా? అన్న సంగతి మరిచి ఎలాగైనా పేదింటి బిడ్డలు ఈ అమ్మఒడి నుంచి జారిపడాలని నక్కల్లా కాచుకు కూర్చున్నారు. ఇంగ్లిష్ వద్ద నివారించి, వారించాలనుకుం టున్న పెద్ద మనుషులు దేవుడా రేపటి నుంచి నా ఇంటి ముందు కాపలాదారుడి బిడ్డ, నా బిడ్డా ఒకలా చదివితే, ఆ బడికి ఆ పేరింటి బిడ్డ సహితం సూటూ బూటూ వేసుకుని తమ బిడ్డలా వెళితే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న వారి మానసికస్థితి, వారు పెంచి పోషించిన కార్పొరేట్ విద్యాసంస్థలు నిలువునా కూలిపోనున్నాయనే ఆవేదన కలగలిపి తెలుగు భాషను భుజాన వేసుకుని వీరావేశంతో చర్చలు చేస్తున్నారు. కానీ నిజాయితీగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఆంధ్రదేశం అమ్మఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి అని చెప్పక తప్పదు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా మాట్లాడుదామనే ధ్యాస లేకుండా పోయింది. కానీ, ఎవరేమి చెప్పినా, ఎవరెంత చెప్పినా ఈ అమ్మఒడి భారతదేశంలోనే సరికొత్త వరవడి అని అనక తప్పదు అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ నెలాఖరులోగా అర్హుల జాబితా రూపొందించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ‘చైల్డ్ ఇన్ఫో’లో నమోదైన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సర్వీసెస్‌కు(ఏపీసీఎఫ్ఎస్ఎస్) అందించారు. ఆ సమాచారాన్ని తెల్లరేషన్‌కార్డుల సమాచారంతో అనుసంధానించి, ఆ వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు(హెచ్ఎం) అందుబాటులో ఉంచుతారు. షెడ్యూల్ ఇలా.. - నవంబర్ 24న హెచ్ఎంలకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఈలోగా హెచ్ఎం పిల్లల హాజరు శాతాన్ని సిద్ధం చేయాలి. స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి హాజరును లెక్కించాలి. ఎవరైనా విద్యార్థులు మధ్యలో చేరినట్లయితే వారు చేరిన తేదీ నుండి హాజరు శాతాన్ని లెక్కగట్టాలి. - ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి/సంరక్షకుల ఆధార్ నెంబరు, నివాస గ్రామం, బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్ సేకరించాలి. లాగిన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకోవాలి. లోపాలుంటే సరిదిద్దాలి. ఆ సమాచారాన్ని ఎంఈఓలకు అందజేయాలి. - 100 లోపు విద్యార్థులున్న పాఠశాలలు ఆన్లైన్లో వివరాల నమోదును నవంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి - 100 నుంచి 300 మంది పిల్లలున్న పాఠశాలలు 26వ తేదీలోగా పూర్తి చేయాలి. - 300, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు 27వ తేదీలోగా పూర్తి చేయాలి. - ప్రధానోపాధ్యాయుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎంఈవోలు ప్రింట్ చేసి, గ్రామ సచివాలయ విద్యాసంక్షేమ సహాయకునికి అందించాలి. వారు లేకపోతే సీఆర్పీలకు ఇవ్వాలి. - విద్యాసంక్షేమ సహాయకులు క్షేత్రస్థాయిలో కుటుంబాల వారీగా పరిశీలన చేయాలి. తెల్లరేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు సేకరించాలి. రేషన్‌కార్డులు లేకుంటే ఆరు అంచెల పరిశీలన ద్వారా వారు నిరుపేదలు లేదా అమ్మ ఒడి పథకానికి అర్హులేనన్న అంశాన్ని ధ్రువీకరించుకోవాలి. నవంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ సమాచారాన్ని ఎంఈఓలకు అందించాలి. -
ప్రసవాల సంఖ్య పెంచాలి
సాక్షి, మెదక్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చొరవ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల విషయంలో పాపన్నపేట వైద్య సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మండల కేంద్రమైన పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు 19 ప్రసవాలు పాపన్నపేట ఆరోగ్య కేంద్రంలో జరపడంపై వైద్య సిబ్బంది పనితీరును ప్రశంసించారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు గర్భిణులు ప్రైవేటును ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చోరవ తీసుకోవాలని పేర్కొన్నారు. తమ ఆస్పత్రిలో ప్రçసవాలు బాగా జరుగుతున్నాయని సిబ్బంది కొరతవల్ల కొంత ఇబ్బంది పడుతున్నామని, మరో స్టాప్ నర్సును ఇవ్వాలని పీహెచ్సీ వైద్యుడు హరిప్రసాద్ కోరారు. జిల్లా వైద్యధికారికి సానుకూలంగా స్పందించారు. డెలివరీ రూం, సంపు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. అలాగే అస్పత్రికి వచ్చే రోగులు కూర్చోవడానికి ముందు భాగంలో దాతల సహయంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుధవారం డెలివరీ జరిగిన ఇద్దరు మహిళలకు కేసీఆర్ కిట్స్‌ను అందించారు. వీరి వెంట డాక్టర్ హరిప్రసాద్, సీహెచ్ఓ చందర్, మేరీ, అలీ, పద్మ ఉన్నారు. -
అమ్మఒడి ఒక మార్గదర్శిని
స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా అమ్మఒడి పథకం గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాపరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. ఈ దేశంలో పుట్టిన పిల్లలందరి భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తున్న స్థితిలో పిల్లల సంక్షేమానికి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏటా రూ. 15 వేలతో ఆర్థిక భరోసాని కల్పించే వినూత్నపథకం ఇది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించనున్న రూ. 6,455 కోట్లతో పేద పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో సమూల మార్పు వస్తుంది. తెలుగు సబ్జెక్టును కొనసాగిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తున్న కొత్త విద్యా పథకం దేశానికే మార్గదర్శకం కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటూ కూడా తమ పిల్లలను బడికి పంపుతున్న తల్లులందరి బ్యాంక్ ఖాతాలోకి విద్యా ఖర్చు కింద రూ. 15,000లను బట్వాడా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ పథకం పేరు అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రమాణాల రీత్యా, దారిద్య్ర రేఖకు దిగువన కనీస మాత్రం ఆదాయ వనరులను కలిగి ఉండి, తమ పిల్లలను 1 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లకు పంపుతున్న తల్లులు ఈ పథకం కింద నగదు సహాయం అందుకోగలరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలుకు తప్పనిసరైన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రూ. 6,455 కోట్లను కేటాయించింది. దీనికి ముందుగా సీఎం మరొక కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా కలిగి ఉంటూనే ఇంగ్లిష్ మీడియంలోకి మార్చివేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా ఇది గుర్తింపు పొందుతుంది. రాష్ట్రంలో విద్యా పరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. స్వాతంత్య్రం తర్వాత పాఠశాల విద్యా రంగాన్ని నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకు దఖలు పడినప్పటికీ, కేంద్రప్రభుత్వం దుర్మార్గమైన పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వహించడానికి అనుమతించింది. దీని ప్రకారం పేదవారు అరకొర నిధులతో నడిచే ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే తమ పిల్లలను పంపించాలి. కానీ, తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించదు. మరోవైపున నగర, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు మెరుగైన మౌలిక వసతులు ఉండే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లకు తమ పిల్లలను పంపించగలిగేవారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లల భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తుందన్నమాట. కుల/వర్గ ప్రమాణాలను బట్టి చూస్తే శ్రామిక ప్రజారాసులతో ఉండే దిగువ కులాలను, ఇన్ని దశాబ్దాలుగా సరైన వసతులు కూడా లేని స్కూల్ విద్య కొనసాగుతున్న ప్రాంతీయ భాషల్లో చదువుకే పరిమితం చేశారు. అగ్రకులాల సంపన్నులు మాత్రం తమ పిల్లలను అంతర్జాతీయ అనుసంధానం ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపిం చేవారు. ఇవి మెరుగైన వసతులతో ఉండేవని చెప్పనవసరం లేదు. ఈ పథకంతోపాటు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరుస్తామని వైఎస్ జగన్ వాగ్దానం చేశారు. జగన్ ప్రతిపాదించిన అదనపు చేర్పులేవీ లేకుండానే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కమ్యూనిస్టు పార్టీలు, మితవాద జాతీయవాద పార్టీలైన బీజేపీ, శివసేన వంటి అన్ని రాజ కీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్ ప్రతిపాదిత స్కూల్ విద్యా సూత్రాన్నే ఆమోదించాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన విద్యావ్యవస్థను కొనసాగిస్తూ వచ్చాయి. చివరకు కపటత్వంతో కూడిన ఉదారవాద మేధావులు సైతం బోధనా మాధ్యమం గురించి, పేద తల్లులకు అత్యవసరమైన ఆర్థిక సహాయం అందించడం గురించి మాట్లాడకుండా నాణ్యమైన పాఠశాల విద్య గురించి లెక్చర్లు దంచుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అమ్మఒడి తరహా ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అనేవి ఈ మసకను తొలగించేశాయి. దేశంలోనే ఇది మార్గదర్శకం కానుంది. దేశచరిత్రలో తొలిసారిగా అమ్మఒడి తరహా విద్యాపరమైన ఆర్థిక ప్యాకేజీ కింద తండ్రి ఖాతాలోకి కాకుండా తల్లి ఖాతాలోకి నేరుగా నగదు వచ్చి చేరనుంది. ఇది భారతీయ పాఠశాల విద్యావ్యవస్థ ప్రాథమిక నిర్మాణాన్ని దానితోపాటు మార్కెట్‌ని కూడా మార్చివేయనుంది. ఇది దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యుత్తమమైన భవిష్యత్ స్త్రీ–పురుష అధికారిక సంబంధాల వృద్ధి వ్యవస్థగా చెప్పాలి. ఈ తరహా విద్యా నమూనా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కలిగించే ప్రభావాలు ఏమిటి? ఈ పథకంలో భాగంగా నాణ్యమైన ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య మారుమూల పల్లెటూరి చిన్నారిని సైతం జాతీయ, ప్రాంతీయ విజ్ఞాన వ్యవస్థలతోపాటు అంతర్జాతీయ విజ్ఞాన వ్యవస్థలతో కూడా అనుసంధానం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ, ప్రపంచస్థాయి విజ్ఞానం చక్కగా అనుసంధానమవుతాయి. ఉత్పత్తి మూలాలను కలిగిన కుటుంబ నేప«థ్యం గల పిల్ల లకు స్కూలు చుట్టూ ఉన్న ఉత్పత్తి క్షేత్రాలు శ్రమపట్ల గౌరవం ప్రాతిపదికతో ఉండే జీవితంతో, విజ్ఞానంతో పెరిగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ తరహా ఉత్పత్తి, విజ్ఞాన అనుసంధానంలో పట్టణ పిల్లలు బలహీనులు. పల్లె వాతావరణంలో లభించే ఉత్తమమైన విద్య భాషలను సత్వరం నేర్చుకునేలా పిల్లలను తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రుల కష్టాలు, సంతోషాలతో భాగమైన పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకంటే ఎక్కువ అనుభవజ్ఞులై ఉంటారు. నా దృష్టిలో అమ్మఒడి పథకం ఏపీలో ఒక కొత్త, సానుకూల మార్కెట్ వికాసాన్ని ఆవిర్భవింప చేస్తుంది. తండ్రిలాగా తల్లి తన ఖాతాకు జమ అయిన నగదును లిక్కర్ మార్కెట్‌కు ధారపోయదు. ఆమె దాన్ని మంచి స్కూల్ డ్రెస్, చక్కటి షూలు, నాణ్యమైన తిండిపై వెచ్చిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఈ తరహా కొత్త కొనుగోలు సామర్థ్యం మార్కెట్ వికాసాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం అందించనున్న రూ. 6,455 కోట్ల డబ్బు పిల్లల శ్రేయస్సు, విద్యాపరమైన మెరుగుదల అవసరాలను తీర్చే మార్కెట్లలోకి ప్రవహిస్తుంది. ఇది ఒక కొత్త సాంస్కృతిక గ్రామాన్ని రూపొందిస్తుంది. పాఠశాల పిల్లల జీవితాన్ని మారుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యాన్ని అమ్మ ఒడి గణనీయంగా మెరుగుపరుస్తుంది. తల్లి తన పిల్లలలో సంవత్సరానికి రూ. 15,000ను సంపాదించే అర్జనాపరులను చూస్తుంది. కాబట్టి పిల్లల సంరక్షణ అపారంగా పెరుగుతుంది. మంచి పాఠశాల, మంచి ఆహారం, మంచి డ్రెస్, గ్రామీణ వాతావరణంలో సాగే ఆటలు పిల్లల సర్వతోముఖాభివృద్ధిని మెరుగుపరుస్తాయి. ఇది యోగా కాదు.. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూనే పరుగెత్తడం, హైజంప్, లాంగ్ జంప్ తీయడం, చెట్లు ఎక్కడం, చెరువులు, కాలువలు, నదుల్లో ఈత వంటి పల్లె ఆటలు పిల్లలను అత్యంత శక్తిమంతులైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం ఆరెస్సెస్/బీజేపీలు పాఠశాలల్లో ప్రోత్సహించాలనుకుంటున్న యోగా.. చిన్నపిల్లలను బాల్యంలోనే ముసలిపిల్లలుగా మారుస్తుంది. అంటే ఒక స్థలంలో మాత్రమే కొన్ని వ్యాయామాలు చేయగల ముసలి పిల్లలు అన్నమాట. యోగా తరహాలో కూర్చుని చేసే కార్యక్రమం కాకుండా పిల్లల శరీరాలు మరింత చురుకుదనంతో, మరింత చలన స్థితిలో ఉండాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలలు యోగాను కాకుండా పై తరహా శారీరక వ్యాయామం గురించి ఆలోచించాలి. యూరోపియన్–అమెరికన్ తరహా స్కూళ్లలాగా పిల్లల ఊహాశక్తిని పెంచగల మంచి పాఠశాలలు పల్లెల్లో ఉంటే, వారిలో విమర్శనాత్మక ఆలోచన చాలావరకు మెరుగుపడుతుంది. ఇంటిలోని ప్రజాస్వామికమైన, శ్రామిక సంస్కృతి వాతావరణం అటు గ్రామంలోనూ, ఇటు స్కూల్లోనూ ఉండే కుల వ్యవస్థను బలహీనపరుస్తుంది. కులపరమైన దొంతరలను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కుటుంబం కంటే పాఠశాల ఉత్తమమైన సంస్థగా ఉంటుంది. దీనికి ఒకే ఒక షరతు ఏమిటంటే, స్కూల్ సిలబస్ శ్రమగౌరవం గురించిన పాఠాలను చక్కగా పొందుపర్చగలగాలి. పవిత్రత, మాలిన్యంకి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను స్కూల్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేయాలి. పాఠ్యపుస్తకాలు చర్మకార పని, బట్టలుతకడం, క్షురక వృత్తి, పొలం దున్నడం, కుండల తయారీ గురించి పిల్లలకు తప్పక చెప్పగలగాలి. స్కూలులో పాఠం చెప్పడం, పూజారి పని చేయడం రెండింటినీ ఒకే గౌరవంతో చూడాలి. అప్పుడే పిల్లల మనస్సుల్లో మానవ సమానత్వానికి సంబంధించిన బీజాలు మొలకెత్తుతాయి. అవే అన్ని సామాజికవర్గాలు, శ్రమ సంస్కృతుల పట్ల పిల్లల ప్రవృత్తిని తీర్చిదిద్దుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. వచ్చే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక భిన్నమైన రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించిన స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయగలగాలి. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే ఈ విద్యా విధానం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రూపొం దించిన నూతన విద్యా విధానాన్ని సైతం మార్చివేయవచ్చు. (నేటితో ప్రజాసంకల్పయాత్రకు రెండేళ్లు. అమ్మ ఒడి పథకంఆ సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగమే) వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురాబోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులందరికీ ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఎంతో మందికి చేయూతనివ్వనుందని, దాని ద్వారానే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. విద్యను కేవలం వ్యాపారంగానే భావించాయి. అనుమతిలేని ప్రైవేటు యాజమాన్యాల చేతిలో విద్యావ్యవస్థను పెట్టి భ్రష్టుపట్టించారు. వాటన్నింటిని మా ప్రభుత్వం సమూలంగా మార్చుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురానున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్శించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఎంతో మందికి చేయూతనివ్వనుంది. దాని ద్వారానే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను బోధించేందుకు చర్యలు ప్రారంభించాం. రోడ్డు భద్రతా, పర్యవరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రతి తరగతిలో తప్పనిసరి చేయనున్నాం. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది’ అంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా తెలిపారు. Our Hon'ble CM @ysjagan garu has instructed officials to prepare a roadmap for establishing junior colleges in every mandal of AP. Environment, Climate Change and Road Safety are also to be included in the curriculum as compulsory subjects from the next academic year. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2019 -
‘గురు’తర బాధ్యత మీదే!
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పుల అమలు, లక్ష్యాల సాధనలో చదువులు చెప్పే గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది వారు చూపించే బాట నుంచేనని గుర్తు చేస్తూ వారిపై ఉంచిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతమయ్యేలా టీచర్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో నిరక్షరాస్యత శాతం జాతీయ సగటును మించి ఉందని, ఐదేళ్లలో ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, వారి వసతి, భోజనాలకు ఏటా రూ.20 వేలు, అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రవేశపెట్టామని చెప్పారు. మూడేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గురువులకు వందనాలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనం చేస్తూ నాలుగు మాటలు చెబుతున్నా. మన తెలుగువారైన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని దేశమంతా టీచర్స్‌డేగా జరుపుకొంటోంది. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసి అనంతరం భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికొక నిదర్శనం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితమే అని చెప్పవచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన అధ్యాపకుడు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో దివంగత నేత ఒక స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. గురువు విద్యార్ధుల మనసులపై చెరగని ముద్ర వేస్తారనేందుకు ఇదో నిదర్శనం. గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో. అందుకనే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః అని అంటారు. ఈ పరిస్థితులు మారాలి.. మన రాష్ట్రం చదువుల పరంగా ఏ స్థాయిలో ఉందో అంతా ఆలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత అక్షరాలా 33 శాతం. అదే జాతీయ సగటు 27 శాతం మాత్రమే. అంటే ఏపీలో నిరక్షరాస్యత జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. దీని అర్థమేమిటో మీరంతా ఆలోచన చేయాలి. వీరంతా చదువుకోవాలనే ఆరాటం లేని వారు కాదు. చదివించాలనే తపన ఉన్నా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చి నిరక్షరాస్యతను ఐదేళ్లలో పూర్తిగా సున్నాకు తీసుకురావాలన్నదే నా తాపత్రయం, తపన. ఇదేకాదు.. 18 – 23 సంవత్సరాల వయసు కలిగి ఇంటర్ తరువాత డిగ్రీ చదవాల్సిన పిల్లలు ఎంతమంది కాలేజీల బాట పడుతున్నారని చూస్తే దానిలోనూ వెనుకబడి ఉన్నాం. బ్రిక్స్ (బ్రెజిల్ రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలైన రష్యాలో 81 శాతం, చైనాలో 48 శాతం, బ్రెజిల్లో 50 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుండగా మన దేశంలో కేవలం 26 శాతమే చేరుతున్నారు. అంటే 74 శాతం మంది పిల్లలు ఇంటర్ దాటి కాలేజీల్లో చదివే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులు మార్చాలి. రష్యాలో 81 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుంటే దానికన్నా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలన్న తాపత్రయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేలు ఇచ్చే పథకాల ద్వారా విద్యారంగ పరిస్థితులను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌కు వీణను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారథి, మల్లాది విష్ణు మానవత్వం లేని పాలనను పాదయాత్రలో చూశా... నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో నడుస్తున్నప్పుడు చాలా స్కూళ్లు కనిపించాయి. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చారు. కొందరు ఉపాధ్యాయులు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినందుకు గత ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కానీ వాస్తవమేమిటనే ఆలోచన చేయలేదు. పాదయాత్రలో స్కూళ్ల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలలకుపైగా బకాయిలు చెల్లించలేదు. సరుకులు కొనే పరిస్థితి లేదు. ఆయాలకు ఇచ్చే గౌరవ భృతి రూ. వెయ్యి ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెడితే వాళ్లు సరుకులు ఏం తీసుకొస్తారు? పిల్లలకు తిండేం పెడతారు? ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు? పిల్లలు చదువుల బాట ఎలా పడతారు? అన్న కనీస ఆలోచన, మానవత్వం లేని పరిపాలనను ఆనాడు చూశాం. స్కూళ్లలో పరిస్థితులు మరీ అధ్యాన్నం. బాత్రూములో నీళ్లుండవు. అవి వినియోగానికి అసలు పనికిరావు. పాఠ్యపుస్తకాలు స్కూళ్లు తెరిచిన జూన్ మొదటి వారానికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా అక్టోబర్, నవంబర్‌లో కూడా అందించలేని దుస్థితి. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా నియామకాలు చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. యూనిఫారాల పరిస్థితీ అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏదీ ఇవ్వని దుస్థితి. ఇలా ప్రతి అడుగులో ప్రభుత్వమే పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే స్కూళ్లు ఎలా తయారవుతాయో నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తరువాతనే విప్లవాత్మక మార్పులు తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. తొలి అడుగులు మీ నుంచే.. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే స్కూళ్ల దశదిశ మార్చేలా ప్రతి స్కూలు ఫొటో తీయాలని చెప్పాం. దశలవారీగా మూడేళ్లలో ప్రతి స్కూలును ఎలా మార్చామో ఫొటోల ద్వారా వ్యత్యాసాన్ని చూపించాలని అధికారులను కోరాం. ఇందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూలులో మార్పులు చేస్తాం. పేరెంట్ బాడీలను తీసుకువస్తాం. తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియంగా మార్చాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు అందాలి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. మన పిల్లలను ఏ మోహమాటం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు చిరునవ్వుతో పంపించేలా ఉండాలన్న ఆరాటంతో అందరం ఉన్నాం. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఆ బృహత్తర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. అయితే ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది మీరు చూపించే బాట నుంచే. మీ బాధ్యతలను మరొక్కసారి గుర్తుచేస్తూ దీన్ని గొప్పగా నెరవేరుస్తారని ఆశిస్తూ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. టీచర్స్ డే సందర్భంగా 143 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందచేశారు. ఉత్తమ గురువులకు ట్యాబ్, పతకం, ధ్రువపత్రం, రూ.20 వేల నగదు అవార్డును పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందించింది. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్ధులకు ఉన్నత విద్య కలను సాకారం చేశారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికి నిదర్శనం దివంగత నేత వైఎస్సార్ జీవితమే. తనకు పాఠాలు చెప్పిన వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. – సీఎం వైఎస్ జగన్ గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు -
వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : విద్యారంగంలో మార్పులపై నిపుణుల కమిటీతో తన ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచుకున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. దీంట్లో భాగంగానే అమ్మ ఒడి పథక ప్రాముఖ్యాన్ని అధికారులకు వివరించారు. అమ్మ ఒడి, సంపూర్ణ ఫీజు రియింబర్స్ మెంట్, విద్యార్థులకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కింద ఏటా రూ.20వేల రూపాయలు చెల్లింపుపై అధికారులతో చర్చించారు. వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదని పేర్కొన్నారు. స్కూలు దగ్గర నుంచి తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసుకునేంత వరకూ డ్రాప్ అవుట్ అన్నది లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లనీయకుండా నిరత్సాహపరించదని అన్నారు. 6, 8నెలలు అయినా మధ్యాహ్నా భోజన కార్మికులకు గత ప్రభుత్వంలో సరకులకు బిల్లులు చెల్లించని పరిస్థితి ఉండేదని విమర్శించారు. పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని అన్నారు. ఏప్రిల్, మే, జూన్ మొదటి వారాల్లో అందాల్సిన డబ్బులు అక్టోబరు వచ్చినా అందని పరిస్థితి అని మండిపడ్డారు. పాదయాత్రలో మాకు పుస్తకాలు అందలేదని అక్టోబర్ నెలలో పిల్లలు నాకుచెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 40వేల స్కూళ్లు ఉన్నాయని, ప్రతి స్కూలు ఇప్పుడు ఏస్థితిలో ఉన్నాయో ఫొటో తీసుకోమన్నామని తెలిపారు. 2–3 ఏళ్లలో మరొక ఫోటో తీసుకుని ప్రజలకు చూపిస్తామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాత్రూమ్స్, తాగునీరు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్స్, ఫ్యాన్లు, ప్రహరీ గోడలు, ఫినిషింగ్ వర్క్స్... ఇలా ప్రతి పనీ ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని అన్నారు. ప్రతి పాఠశాలను ఇంగ్లిషు మీడియం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు భాషను తప్పనిసరి సబెక్ట్ చేస్తున్నామని ప్రకటించారు. మధ్యాహ్నభోజనం నాణ్యతను బాగా పెంచుతామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన రేటును పెంచే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పిల్లాడికి 3 జతల యూనిఫారాలు, షూలు అందిస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకే స్టిచ్చింగ్ ఛార్జీలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పిల్లలలకు షూలు, సాక్సులకోసం డబ్బులు కూడా ఇవ్వాలని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం అక్షయపాత్రకు, రూరల్ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ ఏర్పాటు చేయాలని, పాఠశాల అభివృద్ది, పర్యవేక్షణ బాధ్యత కమిటీదేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా విద్యా కమిటీలు ఉండాలని అన్నారు. క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను విద్యా కమిటీలు పర్యవేక్షించాలని తెలిపారు. స్కూల్లో బాత్రూమ్స్ క్లీన్ చేసేవారికి రూ.4 వేలు, క్లీనింగ్ సామాగ్రి కోసం వెయ్యి రూపాయాలు కేటాయించాలని తెలిపారు. స్కూలు, కాలేజీ ఫీజుల మానిటరింగ్ అండ్ రెగ్యులేటరి కోసం ఒక నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రకటించారు. దీనికోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇండియాలో విద్య అనేది వ్యాపారం కాదు, సేవ మాత్రమేనని అన్నారు. రూరల్ ఎకానమీ ఉన్న దేశంలో లక్షల ఫీజులు కట్టడం కష్టమని అన్నారు. వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ప్రతి విద్యార్థికి ఏటా రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు. ఏదశలో కూడా చదువు ఆపకూడదన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల జీవితాలు మారాలంటే.. చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. డిగ్రీ తీసుకున్నాక.. ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీ చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌ను ఎంపిక చేసుకుని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, జిల్లాలో ఉన్న పారిశ్రామిక వర్గాలతో ఇంటరాక్ట్ అవుతుందని పేర్కొన్నారు. వారికి కావల్సిన నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. విద్యావ్యవస్థను తీర్చి దిద్దాలన్నదే తన కల అని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని, అందుకు అధికారుల సహకారం, ప్రోత్సాహం అవసరమని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
‘ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదు’
-
‘ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పుల్లేవు’
సాక్షి, అమరావతి : రేపటి ఎంసెట్ కౌల్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. బుధవారం నుంచి యధావిధిగా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలకు అప్షన్లు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి యధావిధంగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. రిజర్వేషన్లు, ఫీజులపై త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు పెద్దపీట వేస్తామన్నారు. విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ అమలు చేస్తామని తెలిపారు. రెండేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. -
ఇంటర్ విద్యార్ధులకు అమ్మఒడి
-
ఇంటర్ వరకు అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అమ్మ ఒడి పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డులు, ఫ్యానులు ఏర్పాటు చేయాలని, ప్రహరీల నిర్మాణంతో పాటు మరమ్మతులుంటే పూర్తి చేసి రంగులు వేసి తీర్చిదిద్దాలన్నారు. ఈ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల ఫొటో తీసి రెండేళ్ల తరువాత రూపురేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని దీనికోసం టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ పద్ధతిలో ప్రతి స్కూలులో 20 – 25 మంది విద్యార్ధులకు ఒక టీచర్ చొప్పున ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కావాలనే ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారు.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగార్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పుస్తకాలు అందని దుస్థితిని తాను స్వయంగా పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథాకానికి సంబంధించి ఆరు నెలల పాటు సరకుల బిల్లులు కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో యూనిఫారాలను సైజుల ప్రకారం ఇవ్వకుండా విద్యార్ధులను ఇబ్బంది పెట్టారని, ఈసారి అలాకాకుండా వారే దుస్తులు కుట్టించుకొనేందుకు, షూలు, సాక్సులు కొనుక్కునేందుకు నేరుగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డుదారులంతా అర్హులు: విద్యాశాఖ మంత్రి సురేష్ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులని, ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పిల్లలు బడిలో చేరడం నుంచి ఉద్యోగాలు పొందేవరకు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఉద్యోగ భద్రత కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ముఖ చిత్రాలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. వైస్ చాన్స్‌లర్, అధ్యాపకులు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై త్వరలోనే సెర్చ్ కమిటీని నియమిస్తామని వివరంచారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. చదువుకోలేకపోతున్నామనే బాధతో పిల్లలు, చదివించలేకపోతున్నామనే ఆవేదనతో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న అనేక ఘటనలను పాదయాత్రలో స్వయంగా నా కళ్లతో చూశా. భవిష్యత్ తరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. ప్రభుత్వ విద్యా సంస్థలను బతికించుకోవడం ద్వారానే పేద, మధ్య తరగతి పిల్లలను చదివించుకోగలం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
నాణ్యమైన విద్యను అందించి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, అమరావతి : నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చి దిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు సంస్కరణల కమిటీ ని నియమిస్తూ తొలి సంతకం చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్స్ ఫైల్‌పై రెండో సంతకం చేయగా.. పదో తరగతిలో 20శాతం ఇంటర్నల్ మార్క్స్‌ను రద్దు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని, మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి నిర్ణాయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల కోసం నెలలో ఒకరోజు ఫిర్యాదుల దినంగా నిర్వహిస్తామని అన్నారు. యూనివర్సిటీల్లో అక్రమాలను అరికడతామని పేర్కొన్నారు. వీసీలుగా నిష్ణాతులైన వారినే నియమిస్తామని అన్నారు. త్వరలోనే ఎడ్యుకేషన్ క్యాలెండర్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మ ఒడి పథకంపై ప్రచారం చేసుకునే ప్రైవేట్ స్కూల్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలేనని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌పై ఏం చెయ్యాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇంజనీరింగ్, ఇంటర్‌అన్ని కాలేజీల్లో ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.