Amul milk
-
అమెరికాలో తొలిసారిగా అమూల్ పాలు
న్యూఢిల్లీ: అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహతా తెలిపారు. ‘మేము దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. కానీ తాజా పాలను భారత్ వెలుపల ప్రవేశపెట్టడం మాత్రం ఇదే ప్రథమం. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ ఎన్ ట్రిమ్ ఉత్పత్తులను వారం రోజుల్లో ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 108 ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిషిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ ఎంఎంపీఏ చేపడుతుందని, అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ తమ సంస్థ చేపడుతుందని మెహతా చెప్పారు. ముందుగా న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో అమూల్ పాలు లభిస్తాయి. వచ్చే 3–4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మెహతా చెప్పారు. రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. జీసీఎంఎంఎఫ్ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది. -
కర్నాటక ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. నందిని Vs అమూల్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అమూల్ పాల విషయం కాస్తా పొలిటికల్ హీట్‌ను పెంచింది. కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం, అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రస్తకే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్‌కు ఊహించని షాక్ తగిలింది. నందిని పాల ఉత్పత్తులకు సౌత్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది. #WATCH | Bengaluru: We want to protect our milk and our farmers. We already have Nandini which is a better brand than Amul...We don't need any Amul..our water, our milk, and our soil is strong: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/LNvBynEDsB — ANI (@ANI) April 8, 2023 -
మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?
రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి పాలిట భారంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అమూల్ పాల ధరలు మళ్ళీ పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉంది? అమూల్ పాల ధరలు ఎక్కడ పెరిగాయనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నివేదికల ప్రకారం, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) 'అమూల్' పేరుతో విక్రయిస్తున్న పాల ధరలను శనివారం ఏకంగా రెండు రూపాయలను పెంచింది. ఈ ధరలు గుజరాతీ నగరాలైన సౌరాష్ట్ర, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత 500 మీ.లీ పాలు రూ. 32, అమూల్ స్టాండర్డ్ ధర రూ. 29, అమూల్ తాజా ధర రూ. 26, అమూల్ టి-స్పెషల్ ధర రూ. 30కి చేరింది. డిసెంబర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత పాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆగష్టు నెలలో GCMMF పాల ధరలు 2 రూపాయలు పెంచింది. (ఇదీ చదవండి: రెండు సార్లు ఓటమి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధించాడిలా..) జిసిఎమ్ఎమ్ఎఫ్ సభ్య సంఘాలు గుజరాత్ రాష్ట్రంలోని 18,154 గ్రామాలలో ఉన్న మొత్తం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రతి రోజు సగటున 264 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమూల్ ధరలు పెరిగిన తరువాత మదర్ డెయిరీ కూడా పాల ధరలను రూ. 2 వరకు పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. -
ఇది ఆరోసారి.. పాల సేకరణ ధరలు భారీగా పెంచిన అమూల్
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా ఆరో సారి సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.3.08 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.30, ఘనపదార్థాలపై రూ.22 మేర పెంచారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో శనివారం నుంచి ఈ పెంపు వర్తించనుంది. 2.29 లక్షల మంది పాడి రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. 26 నెలల్లో ఆరు దఫాలు సేకరణ ధరలు పెంపు రాయలసీమలో అమూల్ తరఫున కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా తాజా పెంపుతో కలిపి గత 26 నెలల్లో ఆరు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో పాలు సేకరిస్తున్న కైరా యూనియన్ గతేడాది నవంబర్‌లో పెంచగా, సెంట్రల్ ఆంధ్రలో సబర్కాంత్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.82.50, ఆవు పాలకు రూ.39.48 చొప్పున చెల్లిస్తోంది. కాగా ఆరోసారి ఈ రెండు యూనియన్లు మరోసారి పాలసేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌కు గేదె పాలపై కనిష్టంగా (5.5 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.1.65, గరిష్టంగా (11 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.3.30 చొప్పున పెంచాయి. ఆవుపాలపై కనిష్టంగా (3.2 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.2.47, గరిష్టంగా (5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.3.08 చొప్పున పెంచాయి. దీంతో గేదె పాలకు లీటర్‌కు కనిష్టంగా రూ.40.75 నుంచి రూ.42.40కు, గరిష్టంగా రూ.82.50 నుంచి 85.80కు పెంచింది. ఆవుపాలకు లీటర్‌కు కనిష్టంగా రూ.31.73 నుంచి రూ.34.20కు పెంచగా, గరిష్టంగా 39.48 నుంచి రూ.42.56కు పెంచింది. ఈ పెంపు శనివారం నుంచి వర్తించనుంది. ఉత్తరాంధ్ర పరిధిలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ డిసెంబర్ 15వ తేదీన పెంచింది. 26 నెలల్లో 6.36 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాలతో ప్రారంభం కాగా ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.61 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,173 గ్రామాలకు విస్తరించింది. 1,608 ఆర్బీకేల పరిధిలోని 3,142 గ్రామాల్లో రైతుల నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. రెండేళ్లలో 6.36 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.276 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.2,728 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. మార్చిలోగా మిగతా జిల్లాలకు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున రాయలసీమ, కోస్తాంధ్రలో కైరా, సబర్కాంత్ యూనిట్లు ఆరోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను పెంచాయి. తాజా పెంపుతో సుమారు 2.29 లక్షల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 17 జిల్లాల్లో జేపీవీ అమలవుతుండగా మార్చిలోగా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ పాల ధర పెంపు: ఏకంగా లీటరుకు 3 రూపాయలు బాదుడు
న్యూఢిల్లీ: అమూల్ కంపెనీ తన వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. ఫిబ్రవరి 3 నుండి అమూల్ పాల ధరలు లీటరుకు రూ. 3 పెంచేసింది. పెరిగిన ధరలు అన్ని వేరియంట్లపై వర్తిస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, లీటరు అముల్ తాజా పాలు లీటరు ధర రూ. 54 గాను, అమూల్ ఆవు పాలు లీటరు ధర రూ.56గా ఉంది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 2022లో దీపావళికి ముందు ఫుల్ క్రీమ్ మిల్క్, తాజా, గోల్డ్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.గత 10 నెలల్లో పాల ధరలు రూ.12 పెరిగాయి. అంతకు ముందు ఏడేళ్ల పాటు పాల ధర పెరగలేదు. ఏప్రిల్ 2013 , మే 2014 మధ్య పాల ధరలు లీటరుకు రూ.8 చొప్పున పెరిగాయి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి. దీనివల్ల పాల కంపెనీలు పశువుల కాపరులకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
‘పెట్రోల్‌తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
పండుగ వేళ సామాన్యుడి నెత్తిన మరో పిడుగు
సాక్షి,ముంబై: ద్రవ్యోల్బణం, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఆహార ధరలతో కష్టాలు పడుతున్న సామాన్య జనానికి పండుగ సీజన్లో మరో షాక్ తగిలింది. అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయలు పెరిగింది. అకస్మాత్తుంగా శనివారం ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెరిగడంతో షాకవ్వడం వినియోగదారుల వంతైంది. ఈ మేరకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ధరల పెంపును నిర్ణయించినట్టు తెలుస్తోంది. పశువుల పెంపకంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర ఖర్చులతో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తోంది. అయితే అమూల్‌ను మరో ఐదు సహకార సంఘాలతో విలీనం చేసి బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్‌సిఎస్) ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. మరోవైపు శుక్రవారం విడుదలైన టోకు ద్రవ్యోల్బణం డేటా ప్రకారం పశుగ్రాసం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం పశుగ్రాస ద్రవ్యోల్బణం రేటు 25 శాతానికి పైగానే ఉంది. కాగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తుంది. సేకరణ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో అమూల్, మదర్ డెయిరీలు ఆగస్టులో 2 రూపాయలు చొప్పున పాలధరను పెంచిన సంగతి తెలిసిందే. మార్చిలో కూడా పాల ధరలు పెరిగాయి. -
పాల ఉత్పత్తి మూడింతలు అవుతుంది
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే. అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు. -
సామాన్యుడిపై మరో పిడుగు, పాల ధర పెంపు
ముంబై: అమూల్ లేదా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాజాగా పాల ధరలను పెంచేసింది. లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలను పెంచింది. మదర్ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. రెండు కంపెనీల సవరించిన ధరలు రేపటి నుంచి (బుధవారం, ఆగస్టు 17) అమలులోకి రానున్నాయి. పలితంగా ఇప్పటికే కూరగాయలు, ఇంధనధరలతో అష్టకష్టాలుపడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగుపడినట్టైంది. పాల ధరను రూ. 2 పెంచడం వల్ల ఎంఆర్‌పిలో 4 శాతం పెంపు ఉంటుందని అమూల్ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ,సౌరాష్ట్ర మార్కెట్స్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు అమూల్ తాజా పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్లలో ఈ సవరించిన ధరలు అమల్లో ఉంటాయని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 31, అమూల్ తాజా 500 మి.లీ రూ. 25, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ. 28లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది. మొత్తం నిర్వహణ వ్యయం , ఉత్పత్తి ఖర్చులు పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, తబ సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని అమూల్ తెలిపింది. -
March 1: నేటి నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
చూస్తుండంగానే రోజులు చకచక గడిచిపోతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో అప్పుడే 3 నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. కొత్త నెలతోపాటు దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అమూల్ సంస్థ తన లీటర్ పాల ప్యాకెట్ ధరలను రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలలోకి రానున్నాయి. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.105లు, 5 కేజీల సిలిండర్‌పై రూ.27లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా ఉన్నాయి అంతర్జాతీయ చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి పెరగడంతో జెట్ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 3.3 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు పెరిగిన తర్వాత జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటిఎఫ్) ధర పెరగడం ఇది ఐదోసారి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిటల్'గా డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మార్చి 1 నుంచి మారనున్నాయి. 2020 నవంబర్ నెలలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డీబీఎల్) విలీనం కావడంతో ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సీ కోడ్స్ ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుతాయని డీబీఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా రాష్ట్రాలలో కోవిడ్ 19 మహమ్మారి పెరగడంతో, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికేట్ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్‌ను 28.02.2022 వరకు సమర్పించవచ్చు. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి 1 నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. మార్చి 5, 2022 నుంచి రూ.150 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను విధించనున్నట్టు ఐపీపీబీ తెలిపింది. అయితే ఈ ఛార్జీలు కేవలం కేవైసీ అప్డేషన్ లేకుండా ఏడాది తర్వాత క్లోజ్ అయ్యే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమేనని తెలిపింది. మిగతా అకౌంట్ల మూసివేతకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. ఈ కొత్త నిబంధన మార్చి 5 2022 నుంచి అమల్లోకి వస్తుంది. చక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: Hero Electric Eddy: రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!) -
భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. లీటర్ పాలపై రూ. 2 పెంచుతున్నట్టు ఆ సంస్ధ యాజమాన్యం తెలిపింది. దీంతో, పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ(మంగళవారం) నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, అమూల్ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా.. అమూల్ సంస్థ చివరి సారిగా గతేడాది జూలైలో పాల ధరలను పెంచింది. మరోవైపు తమ కస్టమర్లకు అమూల్ సంస్థ ట్విట్టర్ వేదికగా శివరాత్రి శుభాకాంక్షలను తెలిపింది. కొత్త ధరల ప్రకారం.. 1. 500 Ml అమూల్ గోల్డ్ పాలు రూ. 30 (పాత రేటు రూ. 28) 2. 500 Ml అమూల్ తాజా వేరియంట్ రూ. 24. 3. 500 Ml అమూల్ శక్తి రూ. 27లకు పాలు లభించనున్నాయి. “Let’s celebrate this Mahashivratri with Amul Shrikhand!” pic.twitter.com/ICW3TB7RB7 — Amul.coop (@Amul_Coop) February 28, 2022 -
విజయవాడ, విశాఖలో అమూల్ యూనిట్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో విజయవాడ, విశాఖపట్నంలో అమూల్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుందని ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. ఇప్పటికే మదనపల్లిలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అక్కడే పాలు ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి విక్రయిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన మహిళలు అమూల్‌లో భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలో పాడి రంగం ప్రాధాన్యతను గుర్తించారని చెప్పారు. అమూల్ రైతుల సంస్థ అని, దీనికి 75 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గుజరాత్లో 36 లక్షలు, రాష్ట్రం వెలుపల మరో 7 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రెండూ సమ ఉజ్జీలుగా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజూ దాదాపు 4.25 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా, గుజరాత్లో కూడా అదే స్థాయిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని పాడి పశువుల్లో 60 శాతం గేదెలు, 40 శాతం ఆవులు ఉండగా, ఇక్కడా దాదాపు అదే విధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాల సేకరణలో సంఘటిత రంగం పాత్ర 26 శాతం మాత్రమే ఉందని తెలిసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ ► అమూల్ సంస్థ గుజరాత్లో రోజూ 2.5 కోట్ల లీటర్లు, రాష్ట్రం వెలుపల మరో 50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిగా పాలు సేకరిస్తున్నాం. రోజుకు దాదాపు లక్ష లీటర్ల పాలు ఇక్కడ అమూల్ సేకరిస్తోంది. ► అయితే ఇక్కడ (రాష్ట్రంలో) పాల ప్రాసెసింగ్‌కు తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అమూల్ ఇప్పటికే మదనపల్లిలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో ఆ యూనిట్లు ప్రారంభం అవుతాయి. అప్పుడు పాలు ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి విక్రయిస్తాం. ► అమూల్ సంస్థలో అటు ప్రభుత్వం కానీ, ఇటు బహుళజాతి సంస్థ కానీ, పారిశ్రామికవేత్త కానీ లేడు. ఇది కేవలం రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ. నేను పాడి రంగంలో నిపుణుడిని. 40 ఏళ్లుగా సంస్థలో పని చేస్తున్నాను. మిగతా వారంతా రైతులే. ► సంస్థలో అత్యంత పనితీరు చూపుతున్న మూడు పాడి రైతుల సహకార సంఘాలను (కైరా యూనియన్, సబర్కాంత యూనియన్, బనస్కాంత యూనియన్) రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు పంపించాం. తద్వారా రానున్న రోజుల్లో పాల సేకరణ మరింత పెరుగుతుంది. పాలు, పౌష్టికాహారం సరఫరా ► గుజరాత్లో అమూల్ సంస్థ గత 15 ఏళ్లుగా ప్రతి రోజూ అంగన్వాడీలు, స్కూళ్లలో దాదాపు 25 లక్షల మంది పిల్లలకు తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తోంది. సమీపంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి చల్లటి తాజా ఫ్లేవర్డ్ పాలను పిల్లలకు సరఫరా చేస్తున్నాము. ► ఇదే రీతిలో రాష్ట్రంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లకు చేరువలో ఉన్న గ్రామాల్లో అదే విధంగా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తాం. గుజరాత్‌లోని అంగన్వాడీల పిల్లలకు గత 4 ఏళ్లుగా పౌష్టికాహారం అందజేస్తున్నాము. ఇందుకోసం మూడు ప్లాంట్లు ఏర్పాటు చేసి, 15 వేల టన్నుల పౌష్టికాహారం సరఫరా చేస్తున్నాం. ► అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సబర్కాంత పాడి సహకార సంఘం ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి, పిల్లలకు అత్యంత నాణ్యతతో కూడిన పౌష్టికాహారం సరఫరా చేస్తుంది. పాల సేకరణ మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టుల్లో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాపై ఉంచిన నమ్మకం ఎక్కడా వమ్ము కాకుండా చూస్తాం. రాష్ట్రంలో పాడి ఒక బలమైన ఉపాధి రంగంగా ఎదుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు అదనపు ఆదాయం రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తే అందులో సగం గృహ వినియోగదారులు వాడుతున్నారు. మిగతా పాలలో కేవలం 26 శాతం మాత్రం ఆర్గనైజ్డ్ సెక్టార్లో అమ్ముడవుతుండగా, మిగిలినవి అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి వెళ్తున్నాయి. మధ్యవర్తులు, దళారీల కారణంగా డెయిరీ రైతులు మోసపోతున్నారు. ఈ క్రమంలో సీఎం ఆలోచన మేరకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. తద్వారా ప్రతి పాడి రైతుకు అమూల్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా పాల సేకరణ ప్రారంభిస్తాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి పాడి రైతుల్లో ఆనందం అమూల్‌తో ఒప్పందంతో పాడి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలందరికీ పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో సీఎం వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఎవరూ రక్తహీనతతో బాధపడకూడదని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి బాలామృతం, కర్ణాటక నుంచి మిల్క్ తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు అమూల్ భాగస్వామ్యంతో ఆ సమస్యలు తీరుతాయి. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళల డెయిరీ అని గర్వంగా ఉంది గతంలో ప్రేవేట్ డెయిరీలో పాలు పోసి చాలా నష్టపోయాం. ఇప్పుడు అమూల్ డెయిరీలో పాలు పోయగానే.. అన్ని వివరాలతో మెసేజ్ వస్తోంది. ఇది మా మహిళల డెయిరీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు దాణా కూడా ఇస్తున్నారు. గతంలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పడు బోనస్ కూడా వస్తుంది. మేం వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాం. మీ (సీఎం) సహకారంతో ఇంకా పాడి పశువులు పెంచుకుని మరింత వృద్ధి చెందుతాం. – అనసూయమ్మ, కఠారుపల్లి, గాండ్లపెంట మండలం, అనంతపురం జిల్లా జగనన్నా.. మీ మేలు మరువలేం మాకు ఆరు ఆవులకు గాను మూడు ఆవులు పాలు ఇస్తున్నాయి. గతంలో ప్రేవేట్ డెయిరీలకు పాలు పోస్తే తక్కువ డబ్బులు ఇచ్చే వారు. ఇప్పడు అమూల్ డెయిరీ వల్ల ఎక్కువ డబ్బు వస్తుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్ డెయిరీల వల్ల ఇంత మోసపోయామా అనుకున్నాం. జగనన్నా.. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. ఎప్పటికీ మీ పాలనే కావాలి. పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. – రత్నమ్మ, కాలసముద్రం, కదిరి మండలం, అనంతపురం జిల్లా -
అంగన్వాడీలకు అమూల్ పాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల్లో పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64,445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతి నెలా పాల ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆ పాలను ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా ఏపీకి సరఫరా చేస్తున్నారు. తొలుత 181 మిల్క్ స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జరుగుతున్న పాల సరఫరాలో ఇబ్బందులు అధిగమించేందుకు, పారదర్శకత కోసం ఇటీవల ఏపీ డెయిరీ కార్పొరేషన్ మిల్క్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అమూల్ పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు కూడా స్థానికంగానే సరఫరా చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేలా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకం(పైలట్ ప్రాజెక్ట్)గా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలు అందించేందుకు పరిశీలన జరుగుతోందన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
నేడు గుంటూరు జిల్లాలో అమూల్ పాలసేకరణ ప్రారంభం
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లాలో 831 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)ల ద్వారా పాలు సేకరించి పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకు రైతులకు అదనపు ఆదాయం లభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలివిడతగా 18 మండలాల్లో 129 గ్రామాలను ఎంపికచేశారు. ఈ గ్రామాలను 12 రూట్లుగా విభజించారు. ఈ గ్రామాలను 115 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి పాలసేకరణ ప్రారంభిస్తున్నారు. 2,320 మంది గ్రామ వలంటీర్లు గ్రామాల్లో సర్వేచేసి 15,328 మంది మహిళా రైతులకు 20,686 పాడి ఆవులు ఉన్నట్లు గుర్తించారు. పాడి రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. మహిళా కో ఆపరేటివ్ సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ప్రస్తుతానికి 697 బల్క్ మిషన్ సెంటర్లకు స్థలాలను గుర్తించారు. 130 ఆటోమేటిక్ పాలసేకరణ యూనిట్లు ఏర్పాటు చేసి పాలు సేకరించనున్నారు. జిల్లాలోని 6 గ్రామాలకు చెందిన మహిళా రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడతారని గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 14 గ్రామాల్లో మహిళా రైతులు చూసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదట 47 గ్రామాల్లో జిల్లాలో మొదట 47 గ్రామాలను 5 రూట్లుగా విభజించి పాలు సేకరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మిగిలిన గ్రామాల్లో దశలవారీగా పాలసేకరణ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి 6 గ్రామాల్లోని మహిళా రైతులతో వర్చువల్‌గా మాట్లాడతారు. యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం, నాదెండ్ల మండలం చిరుమామిళ్ల, గొరిజవోలు, చందవరం, నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెం, శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామాల్లోని వారితో ముఖ్యమంత్రి మాట్లాడతారు. చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ 104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్ -
ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆప్కో వస్త్రాలకు మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపిక చేసిన ఆర్టీసీ బస్టాండ్లలో అందుకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌కు ఆప్కో వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేఖ రాశారు. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్, మింత్ర, పేటీఎం, లూమ్‌ఫ్లోక్స్ తదితర ఈ–కామర్స్ సంస్థలతో ఆప్కో ఎంవోయూ కుదుర్చుకుందని లేఖలో వివరించారు. ఆప్కో వ్యాపారాభివృద్ధికి బస్టాండ్లలో స్టాళ్లు కేటాయిస్తే వ్యాపారం పెరుగుతుందని.. అందువల్ల నామమాత్రపు అద్దెలతో స్టాళ్లను కేటాయించాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. స్టాళ్లకు నెలనెలా ఎంత అద్దె వసూలు చేయాలనే అంశాన్ని నిర్ణయించేందుకు త్వరలో నివేదిక ఇవ్వాలని ఎండీ ఠాకూర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు కాగా, ఈ విక్రయ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఏర్పాటుచేయనున్నారు. కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచాలన్నదే లక్ష్యం. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం బస్టాండ్లలో వీటిని ఏర్పాటుచేస్తారు. అమూల్ మిల్క్ యూనిట్లకు అవకాశం బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లకే కాకుండా అమూల్ మిల్క్ యూనిట్లకు స్టాళ్లను కేటాయించేందుకు ఆర్టీసీ సుముఖంగా ఉంది. కొన్ని బస్టాండ్లలో సంగం డెయిరీకి స్టాళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పాడి రైతుల అభివృద్ధికి పాటు పడుతున్నందున అమూల్ ఉత్పత్తులకూ స్టాళ్లను ఆర్టీసీ కేటాయించనుంది. ఇదేకాక విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌లో మత్స్యశాఖకు ఓ స్టాల్‌ను ఆర్టీసీ అధికారులు ఇటీవలే కేటాయించారు. త్వరలో స్టాళ్లను కేటాయిస్తాం ఆప్కో ఎండీ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లలో స్టాళ్లను త్వరలోనే కేటాయిస్తున్నాం. దీనిద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఆర్టీసీ నడుచుకుంటుంది. – ఆర్పీ ఠాకూర్, ఎండీ, ఆర్టీసీ -
పాడి రైతుకు సిరులు కురిపించే అమూల్ ఒప్పందం
గుజరాత్‌లోని కైరా జిల్లాలో పాల రైతులు దళారీల నుండి దోపిడికి గురవుతున్న నేపథ్యంలో 1942లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాతో స్వాతంత్య్ర సమర యోధుడు, రైతు ఉద్యమ నేత త్రిభువన్ దాస్ కిషీ భాయ్ పటేల్ నేతృత్వంలో 1946 డిసెంబర్ 14న కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పారు. అంతక్రితం పాల్సన్ డైరీ రైతుల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి బొంబాయి మార్కెట్లో అధిక ధరలకు అమ్మి లాభాలు గడిం చేది. రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దాన్ని ఎదుర్కొనడానికి ఆవిర్భవించిన సంఘమే అనంత రకాలంలో అమూల్‌గా రూపాంతరం చెందింది. అమెరికాలో డైరీ ఇంజనీరింగ్ చేసి స్వదేశానికి వచ్చిన డాక్టర్ వర్గీస్ కురియన్ త్రిభువన్ దాస్ పటేల్ ప్రోత్సాహంతో పాడి రైతులకు బాసటగా నిలబడ్డారు. వీరిద్దరి నేతృత్వంలో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్(అమూల్) ఆవిర్భవించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అనేక అవా ర్డులు సాధించింది. పాల సేకరణలో ప్రపంచంలోనే అమూల్ 8 వ స్థానంలో నిలిచింది. అమూల్ ఒక బ్రాండ్ కాదు... ఒక ఉద్యమానికి ప్రతీక. పాడి రైతుకు మంచి ధర ఇచ్చి పాలు కొనుగోలు చేయడం, తనకు వచ్చే ఆదా యంలో కొంత మొత్తాన్ని బోనస్ రూపంలో ఏటా రైతులకు ఇవ్వడం ఆ సంస్థ విశిష్టత. కురియన్ 1921 నవంబర్ 26 న జన్మించి 2012 సెప్టెంబర్ 9న 91వ సంవత్సరంలో మరణించే వరకూ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయన సేవాతత్పరతకు, అంకితభావానికి గుర్తిం పుగా 1965లో పద్మశ్రీ, 1989లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1996లో పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్, అవార్డులు లభించాయి. కురియన్ నిరంతర కృషి కారణంగానే పాల ఉత్పత్తులలో మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థానానికి ఎగబాకింది. 2006 నుంచి 2011 వరకూ అలహాబాద్ విశ్వ విద్యాలయానికి మొదటి ఛాన్సలర్‌గా కురియన్ సేవలందించారు. 30 విశిష్ట సంస్థలను స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపచేస్తూ, ఆ సంస్థ లను నిపుణులతో అనుసంధానం చేశారు. గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కురియన్ను నేష నల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వ్యవస్థాపక చైర్మన్‌గా నియమించారు. కేరళలో క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండి యాగా, శ్వేత విప్లవ పితామహుడుగా ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. పాడి పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచశ్రేణి సంస్థలతో మనం పోటీ పడేవిధంగా తీర్చిదిద్దిన ఘనత కురియన్‌దే. రైతు లకు మంచి ధర ఇచ్చి పాలు సేకరించడం, వాటిని వినియోగదారులకు వీలైనంత తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా అమూల్ కృషి చేస్తోంది. 1948 జూన్‌లో కేవలం రెండు గ్రామాలనుంచి రెండు వందల యాభై లీటర్ల పాలు సేకరించిన అమూల్ నేడు గుజరాత్లో 36 లక్షల మంది రైతుల నుంచి సేకరించే స్థాయికి ఎదిగింది. పాడి రైతులకు వరం ఇలాంటి మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర పాడి రైతులకు వర మని చెప్పాలి. ఈ ఒప్పందంతో ఇకపై దోపి డీకి గురయ్యే పరిస్థితి రైతుకు ఎదురుకాదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్య అన్ని రాష్ట్రాలకూ ఆదర్శనీయం. పశుసంపదలో మన రాష్ట్ర వాటా 8.4 శాతం. పాల ఉత్పత్తిలో 7.6 శాతం. ఇక్కడ సుమారు 60 లక్షల గేదెలు, 40 లక్షల ఆవులద్వారా రోజూ 412 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతు న్నాయి. ప్రతి రోజు హెరిటేజ్ లాంటి వివిధ పాల కంపెనీలు 69 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. 123 లక్షల లీటర్లు స్వీయ వినియోగానికి కేటా యిస్తుండగా 219 లక్షల లీటర్లు అసంఘటిత విభా గంలో సేకరిస్తున్నారు. అమూల్ ప్రవేశంతో పాల ఉత్పత్తులపై ఆధారపడి ఉన్న 27 లక్షల మంది మహిళల జీవితాల్లో సంతోషం పెల్లుబుకుతుంది. పాడి రైతుకు ప్రతి లీటర్ పాల అమ్మకంలో అద నంగా రూ. 5 నుంచి రూ. 7 వరకూ లబ్ధి చేకూరు తుంది. ఇది మహా విప్లవం అనుకోవచ్చు. ఇంత వరకూ జరిగిన ఆర్ధిక దోపిడీ దీంతో ఆగుతుంది. ప్రస్తుతం పాల సేకరణ ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభం కాగా త్వరలో ఇది అన్ని జిల్లాలకూ విస్తరించి కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులకు దోహదపడుతుంది. అమూల్ తో ఒప్పందం చరిత్రాత్మకమైన నిర్ణయం. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపే నిర్ణయం. దోపిడీ వ్యవస్థను అరికట్టే నిర్ణయం. పాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం చేరుకోవడానికి దోహదపడే నిర్ణయం. ఆవు పాలను గేదె పాలలో కలిపి అధిక ధర లకు అమ్మి వివిధ పాలసేకరణ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు గడించాయి. వాటి లక్ష్యం రైతుల నుండి వీలైనంత తక్కువ ధరకు పాలు సేకరించడం వినియోగదారులకు వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి అత్యధిక లాభాలు గడించడం. అమూల్ రాకతో వీరి దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లీటర్‌కు అదనంగా ఇస్తున్న నాలుగు రూపాయలతో పాల రైతులు మంచి ధర పొందటానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలో 264 మిలియన్ల ఆవులు, గేదెల ద్వారా దాదాపు 600 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ తలసరి పాల ఉత్పత్తి సంవత్సరానికి ఒక ఆవుకు 2200 లీటర్లుగా ఉంది. మన దేశం 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఉండగా అమెరికా 94 మిలియన్ టన్నులతో రెండో స్థానం, 45 మిలియన్ టన్నులతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. తదుపరి స్థానాల్లో పాకిస్తాన్, బ్రెజిల్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, టర్కీలున్నాయి. దేశంలో మనది మూడో స్థానం. అమూల్‌తో చెలిమివల్ల మొదటి స్థానానికి చేరడానికి ఎంతో కాలం పట్టదు. వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్: 99499 30670 -
చంద్రబాబు, హెరిటేజ్ కోసం అమూల్‌ను తేలేదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అయిదో రోజు అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారులైన రైతులు, మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా అమూల్‌తో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంపై శుక్రవారం చర్చించారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అమూల్ సంస్థలో రైతులే యజమానులు అని పేర్కొన్నారు. అమూల్ ఒక సహాకార సంస్థ అని ఇది నేడు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పోటిపడుతోందన్నారు. ప్రపంచంలోనే అమూల్ 8వ స్థానంలో ఉందన్నారు. చదవండి: ఎల్లో మీడియాపై సీఎం జగన్ ఆగ్రహం అతి పెద్ద సహకార డెయిరీ అమూల్ అన్ని బహుళ జాతి సంస్థలు. 50 దేశాలలో పోటీ పడుతోందని పేర్కొన్నారు. దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అత్యంత పెద్ద సహకార రంగంలోని సంస్థ అని తెలిపిన సీఎం జగన్ ఆ సంస్థలో వచ్చే లాభాలు, అవి తీసుకునేవారు రైతులేనని పేర్కొన్నారు. ఎందుకంటే రైతులే ఆ సంస్థలో వాటాదారులు. ఇక్కడ సేకరించే పాలకు అమూల్ సంస్థ అక్క చెల్లెమ్మలకు అత్యధిక ధరలు ఇవ్వడమే కాకుండా, సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఏటా రెండుసార్లు తిరిగి ఇస్తారన్నారు. అంత గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోందని ప్రశంసించారు. ఇంకా ఏమన్నారంటే.. మినరల్ వాటర్ కన్నా తక్కువ ధర ‘ప్రభుత్వ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చూస్తే. నా పాదయాత్రలో కొందరు మినరల్ వాటర్ బాటిల్ తీసుకువచ్చి చూపి, దాన్ని రూ.21కి కొంటున్నామని, లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. అంటే మినరల్ వాటర్‌తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవడం దారుణ పరిస్థితి. మొన్న అమూల్ లాంచ్ సందర్భంగా అక్క చెల్లెమ్మలు చెప్పారు. తాము పశువులను అమ్ముకుందామనుకున్నామని, కాని ఇప్పుడు నమ్మకం కలిగిందని అంతా చెప్పారు. చదవండి: పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి? రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం పాలు పోసే వారికి మంచి ధర రానివ్వకుండా చేశారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. ఎప్పుడైతే సహకార రంగం అనేది లేకుండా పోతుందో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు ఒక్కటై ఒకే ధర నిర్ణయిస్తున్నారు. అంతకు మించి ఇవ్వబోమంటున్నారు. గత్యంతరం లేక పాలు వారికే పోయాలి, లేదా పాడి పశువులు అమ్ముకోవాలి. ఒక పద్ధతి ప్రకారం సహకార రంగాన్ని చంపేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. త దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. కేవలం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించడం, దాన్ని లాభాల్లో ఉంచడం కోసం రాష్ట్రంలో ఉన్న మొత్తం సహకార రంగాన్ని చంపేశాడు. 1974 వరకు డెయిరీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవగా, ఆ ఏడాది డెయిరీ అభివృద్ది సంస్థ పరిధిలోకి తెచ్చారు. ఆ తర్వాత 1981లో డెయిరీ రంగంలో త్రీ టయర్ కోఆపరేటివ్ వ్యవస్థ ఏర్పడింది. దాంతో 9 సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి ప్రయాణం బాగా జరిగింది. ‘మ్యాక్స్’ చట్టంతో గ్రహణం 1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్) చట్టం వచ్చింది. దాన్ని చంద్రబాబు తెచ్చారు. అంతకు ముందు 1992లో హెరిటేజ్ ప్రారంభించిన చంద్రబాబు, 1995లో సీఎం కాగానే, ఏపీ మ్యాక్స్ చట్టం తెచ్చారు. అనంతరం విశాఖ డెయిరీని1999లో, కృష్ణా డెయిరీని 2001లో, గుంటూరు డెయిరీని 1997లో, ప్రకాశం డెయిరీని 2002లో, నెల్లూరు డెయిరీని 2002లో, కర్నూలు డెయిరీని 2002లో సహకార రంగంలో ఉన్న ఈ డెయిరీలన్నీ మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ విధంగా చంద్రబాబు హయాంలోనే వాటన్నింటినీ మార్చారు. ఏపీ మ్యాక్స్.. ఏదైనా సొసైటీ లేదా యూనియన్, మ్యాక్స్‌కు మారాలి అంటే, ఆయా సహకార సంస్థలలో ఉన్న ప్రభుత్వ వాటా, ఆస్తులను వెనక్కు ఇవ్వాలి. లేదా ఆ రీఫండ్‌కు సంబంధించి ప్రభుత్వంతో ఒక అవగాహన (ఎంఓయూ) చేసుకోవాలి. అయితే ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. అంత కన్నా అన్యాయం అది ఒక రకమైన అన్యాయమైతే విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లోనూ, గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్ కంపెనీల కింద మార్చేశారు. కంపెనీల చట్టంలో అలాంటి అవకాశం లేకపోయినా వాటిని మార్చేశారు. అంతే ఒక పద్ధతి ప్రకారం సహకార సంస్థలను ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోకి తీసుకునే కార్యక్రమం జరిగింది. ఆ స్థాయిలోకి వ్యవస్థను దిగజార్చారు. ఇవాళ ఉభయ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం డెయిరీలు ఏపీ సహకార సంఘాల పరిధిలో ఉంటే, కృష్ణా, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్ చట్టం కింద, గుంటూరు, ప్రకాశం, విశాఖ డెయిరీలు కంపెనీల చట్టం పరిధిలో ఉన్నాయి. అంటే ఒక పద్ధతి ప్రకారం డెయిరీలను నిర్వీర్యం చేశారు. ఇవాళ సంగం డెయిరీని ఎవరైనా సహకార రంగం డెయిరీ అని చెబుతారా. ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థ కింద నడుపుతున్నాడు.ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు. చంద్రబాబు–చిత్తూరు డెయిరీ చంద్రబాబు దగ్గరుండి డెయిరీలను ఖూనీ చేశారు. అది ఏ స్థాయిలో ఆ పని చేశారంటే.. చిత్తూరు డెయిరీ అయితే ఒకప్పుడు హెరిటేజ్ డెయిరీకి పోటీ పడ్డాయి. దాంతో దాన్ని ఖూనీ చేయడం కోసం, ఈ పెద్దమనిషి సీఎంగా ఉన్నప్పుడు, 2003లో చిత్తూరు డెయిరీని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల క్లిప్ ప్రదర్శించి చదివి వినిపించారు. ఇక చంద్రబాబుకు కావాల్సిన మనిషి దొరబాబు. ఆయనను బీఎస్ రాజా నర్సింహులు అని కూడా అంటారు. ఆయన చిత్తూరు డెయిరీకి ఛైర్మన్‌గా పని చేశారు. ఆయనను ఛైర్మన్‌ను చేసి చంద్రబాబు చక్రం తిప్పారు. తర్వాత విజయవంతంగా చిత్తూరు డెయిరీని ఆయన మూసివేయించాడు. దొరబాబు ఆ పని చేశాడు కాబట్టి, ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడు. ఏ రకంగా సహకార రంగాన్ని మూసివేయించారనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.. ఇంకా ఆయన మాటల్లోనే.. అధికారంలో ఉంటే హెరిటేజ్ లాభాలు: ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ లాభాలు, షేర్ విలువ పెరుగుతాయి. ఆయన దిగిపోతే తగ్గిపోతాయి. ► 1999 నుంచి జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ ప్రకారం హెరిటేజ్ షేర్ ధర చూస్తే.. ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999 జనవరి,1న హెరిటేజ్ షేర్ ధర రూ.2.89 ఉండగా, అది డిసెంబరు 12, 2003 నాటికి ఏకంగా రూ.26.90 అయింది. ► ఆ తర్వాత 2009 ఎన్నికల ముందు, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఏప్రిల్ 9. 2009 నాటికి షేర్ ధర రూ.16.35కు పడిపోయింది. ►మళ్లీ సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు) సమయంలో రూ.35 నుంచి రూ.100కు పెరిగింది. ► 2014లో ఆ పెద్దమనిషి సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో రూ.100 షేర్ 2017 డిసెంబరు నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది. ► ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్ విలువ ఆ స్థాయిలో పెరిగితే ఏమనాలి? ► బాబు గారు దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్ షేర్ ధర మళ్లీ రూ.205కు తగ్గింది. ► ఒక్కసారి గమనించండి. బాబు అధికారంలో ఉంటే ఆయన డెయిరీ షేర్ విలువ పెరిగింది. ఆయన అధికారంలో లేనప్పుడు ప్రజల ఆదాయం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా–హెరిటేజ్: ► ఇది ఏఎన్ఐ రిపోర్టు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ ఎంఓయూ. 30.12.2016న ఆ ఒప్పందం చేసుకున్నారు. ► రైతులకు సులభంగా రుణాల పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడాతో హెరిటేజ్ ఫుడ్స్ ఒక ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. ► డెయిరీ రంగంలో రైతులకు రుణాలిస్తామని చెప్పి ఆ ఒప్పందం. ►అంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, అందుకు బదులుగా వారు హెరిటేజ్‌కు మాత్రమే పాలు పోయాలన్న నిబంధన పెట్టారు. ► ఇదీ చంద్రబాబు వైఖరి. అంత దారుణ స్థితి. అలాంటి పరిస్థితుల్లో.. ►పాల ఉత్పత్తిదారులకు సరైన ధర రాని పరిస్థితుల్లో.. ఎక్కడైనా సహకార రంగం గట్టిగా ఉంటే, పోటీ ఏర్పడి, రైతులు, పాలు పోసే అక్క చెల్లెమ్మలకు ఆదాయం పెరుగుతుంది. ►దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 27 లక్షలకు పైగా నిమగ్నమై ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలుగుతుంది. ►వారికి మంచి ఆదాయం లభిస్తుంది. వారికి మంచి జరుగుతుంది. ►ఇవాళ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్–ఏపీడీడీసీఎఫ్. ►దీని పని తీరు డెయిరీల పరిస్థితికి అద్దం పడుతోంది. ► అందుకే అమూల్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మనం కష్టపడ్డాం. ఒకవేళ అమూల్ రాకపోతే? ► ఒకవేళ అమూల్ రాకపోయి ఉంటే, ఇవాళ మెజారిటీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు మూతబడ్డాయి. ► కేవలం 800 గ్రామాల్లోనే పాల సేకరణ జరగుతోంది. చాలా డెయిరీలు మూతబడ్డాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ► ప్రైవేటు రంగంలోనే డెయిరీలు నిలబడ్డాయి. దీంతో వాటికి పోటీ లేకుండా పోయింది. ► ప్రైవేటు డెయిరీల అనైతిక పద్ధతులు, పాడి రైతుల్లో లేని అవగాహనతో సహకార సంఘాలు నష్టాల పాలయ్యాయి. దాంతో ఆ రంగం పూర్తిగా ప్రైవేటు రంగంలోకి వెళ్లింది. ► వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 21.07.2020న అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం లక్ష్యాలు: ► మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి. ►వారి (పాల ఉత్పత్తిదారుల) సామాజిక ఆర్థిక ఉన్నతి. ► రైతులకు మంచి పాల ధర అందించడం. ► వినియోగదారులకు కూడా నాణ్యమైన పాలు అందించడం. మార్కెటింగ్ అనుసంధానం: ► మార్కెటింగ్ అనుసంధానం కోసం అమూల్ ఎంపిక చేసుకున్నాం. ►అందుకోసం ఒక వ్యవస్థ అవసరం. మహిళలల్లో సహకార స్ఫూర్తి రావాలి. ► ప్రతి గ్రామంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ)లు, ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు కూడా రావాలి. ► అమూల్ ఇక్కడ ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, అమ్మి లాభాలు గడించి, ఆ మొత్తం తిరిగి బోనస్‌గా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం. ► ఇది ఒక గొప్ప కార్యక్రమం. దేశ సహకార రంగంలో పని చేస్తున్న అతి ఉత్తమ సహకార సంస్థ అమూల్. ► 50 దేశాల్లో ఆ సంస్థ పని చేస్తోంది. ప్రపంచంలో 8వ స్థానంలోనూ, దేశంలో అతి పెద్ద సంస్థగానూ ఉంది. ► అమూల్ ఏడాదంతా రైతులకు మంచి ధర చెల్లించడమే కాకుండా, వచ్చిన ఆదాయాన్ని రైతులకు బోనస్‌గా ఇస్తుంది. మహిళా డెయిరీ సహకార సంఘాలు ►రాష్ట్ర వ్యాప్తంగా 9899 గ్రామాలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ►అందుకే ఆయా గ్రామాలలో బీఎంసీయూలు ఏర్పాటు చేస్తోంది. అవన్నీ ఆర్బీకేల పరిధిలో ఉంటాయి. ►వాటిలో మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం. ►రూ.3 వేల కోట్లతో భవనాల నిర్మాణం. ఒక్కో దానికి రూ.16.90 లక్షల వ్యయం. ►బీఎంసీయూలు (ఒక్కోటి దాదాపు రూ.10 లక్షలు), ఆటోమేటిక్ పాల సేకరణ యూనిట్ల ఏర్పాటు (రూ.1.40 లక్షలు చొప్పున). ► ఆర్బీకేల పరిధిలో వాటి పక్కనే 9899 బీఎంసీయూలు, ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, పక్కా భవనాలు వస్తాయి. అవి గ్రామాల రూపురేఖలు మారుస్తాయి. ►సేకరించే పాలకు 10 రోజుల్లోనే పాల ఉత్పత్తిదారుల ఖాతాల్లో నగదు జమ. ఎక్కడా మధ్యవర్తి ఉండరు. లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తొలి దశలో.. ► తొలి దశలో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 400 గ్రామాల్లో సేకరణ మొదలైంది. ► ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు ఇవ్వగా, వచ్చే ఫిబ్రవరి 2021 నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. ► ఆ తర్వాత 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. ఇక అమూల్ ఇచ్చే పాల ధర: ఇక సేకరించే పాలకు అమూల్ ఏయే ధరలు చెల్లిస్తోందన్నది వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ స్లైడ్ కూడా ప్రదర్శించి చూపారు. ► లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.33.60 కు, దొడ్ల డెయిరీ రూ.34.20 కి, జెర్సీ సంస్థ రూ.34.80 కి కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. ► అవే గేదె పాలను లీటరుకు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది. ► ఇక ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్)కు హెరిటేజ్ సంస్ధ రూ.23.12 ఇస్తుంటే, అమూల్ రూ.28 చెల్లించనుంది. ► అంటే ఎక్కడ చూసినా ఎక్కువ ధరకు అమూల్ పాలు కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత లాభాలు కూడా పంచబోతోంది. ► ఆ విధంగా ఎంతో మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం చేపట్టాము. మా టార్గెట్ హెరిటేజ్ కాదు ► నిన్న లోకేష్ అనే వ్యక్తి ఏదో టీవీలో అన్నాడట. ఆంధ్రజ్యోతిలో రాశారట. ► ‘అమూల్ వల్ల హెరిటేజ్ చావదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తామని అన్నాడట’. ► అంటే ఇంత కాలం వారు తక్కువ ధర ఇస్తున్నారనే కదా? ► చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్ టార్గెట్‌గానో అమూల్‌ను తేలేదు. ► మా రాడార్‌లో చంద్రబాబు లేడు, మా మైండ్ సెట్ కూడా అది కాదు. అక్క చెల్లెమ్మల కోసమే ► చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇస్తున్నాం. ► అంత డబ్బు ఇస్తున్నందున వారికి సరైన పద్ధతిలో దారి చూపిస్తే రిస్క్ లేకుండా రెగ్యులర్‌గా ఆదాయం వస్తుంది. ► దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మంచి జీవితం గడుపుతారు. ► అందుకే అమూల్‌తో పాటు, పలు సంస్థలను తీసుకువచ్చాము. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్ కోసం కాదు. ► అంత తక్కువగా ఆలోచించే తత్వం కూడా మాది కాదు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగించారు. -
ఏపీ-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
-
పాల ఉత్పత్తిలో దేశాన్ని అగ్ర స్థానంలో..
సాక్షి, ఒంగోలు: దేశంలో క్షీర విప్లవానికి ఆధ్యుడు డాక్టర్ వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలబెట్టిన కురియన్ జయంతి నేడు. 1921 నవంబర్ 26న కేరళ రాష్ట్రంలోని కాలికట్లో జన్మించారాయన. దేశ ప్రజలు పౌష్టికాహర లోపంతో బాధపడకుండా కురియన్ చేసిన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. ఆయన జయంతిని ‘జాతీయ పాల దినోత్సవం’గా నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లోనూ, అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన ఆయన.. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ప్రభుత్వ క్రీమరీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో చేరారు. నేషనల్ డెయిరీ డెవలెప్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలన్న సంకల్పంతో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ప్రస్తుత అమూల్)ను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పాలను పౌడర్‌గా మార్చే యంత్రాన్ని కురియన్ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. వర్గీస్ కురియన్‌కు లెక్కకు మించిన అవార్డులు అందుకున్నారు. అందులో రామన్ మెగసెసే అవార్డు(1963), వాట్లర్ పీస్ ప్రైజ్(1986), వరల్డ్ ఫుడ్ ప్రైజ్(1989), పద్మశ్రీ(1965), పద్మభూషణ్(1966), పద్మ విభూషణ్(1999) ముఖ్యమైనవి. 2012 సెప్టెంబర్ 9న 91 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆసియాలోనే అతిపెద్ద డెయిరీ.. ఆసియాలో రూ.52 వేల కోట్ల అతిపెద్ద టర్నోవర్ కలిగిన డెయిరీగా అమూల్ రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్ లేదా కంపెనీల నుంచి కాకుండా కేవలం రైతుల నుంచి మాత్రమే 250 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయడం, ప్రాసెస్ చేయడం దీని ప్రాముఖ్యత. ఇంత పెద్ద డెయిరీ యజమాని ఏ వృత్తి నిపుణుడో కాదు. పేరున్న వ్యాపారవేత్త అంతకంటే కాదు. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాల్లో నివసించే 3.6 మిలియన్ల మంది రైతులే డెయినీ యజమానులు. ప్రతి రైతు తమ గ్రామ డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీలో ఒక లీటరు నుంచి 10 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడం ద్వారా అమూల్‌లో సమాన యాజమాన్య వాటా కలిగి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఈ పాల విప్లవం 74 ఏళ్ల క్రితం 1946లో గుజరాత్లో చిన్నదైన కైరా అనే జిల్లాలో ప్రారంభమైంది. ఏపీలో అమూల్ తరహా ఎంపీయూఎస్ఎస్లు గుజరాత్లో అమూల్ తరహా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ఎంపీయూఎస్ఎస్) ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆ సంఘం ద్వారా 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకుంటారు. ఈ 11 మంది సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. గ్రామ స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ ఏర్పడుతుంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీలు కలిసి రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో రైతులను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా అనాధిగా ఉన్న పాడి పరిశ్రమను బలోపేతం చేస్తే రైతు లోగిళ్లు సంతోషంగా ఉంటాయని గట్టిగా నమ్మారాయన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అమూల్ సంస్థను రాష్ట్రంలో పాల సేకరణకు రంగంలోకి దించారు. మొదటి ఫేజ్‌లో కేటాయించిన మూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లాను చేర్చి ఈ నెల 20వ తేదీ నుంచి 201 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మక పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమూల్ సంస్థ పాలు సేకరిస్తున్న వైనాన్ని చూస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి చర్యలకు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ డెయిరీలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో స్వయంగా ప్రజలు కళ్లారా చూశారు. సొంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి పథంలో నడిపించి ఒంగోలు డెయిరీ లాంటి ప్రభుత్వ డెయిరీలను నష్టాల ఊబిలోకి నెట్టిన పాపం మూటకట్టుకున్నారు. ఆ పరిస్థితి నుంచి డెయిరీ రంగాన్ని బయటపడేసేందుకే ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గురువారం నుంచి అమూల్ పాల సేకరణ కేంద్రాలు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభం కానున్నాయి. -
అమూల్ ఒప్పందంతో పల్లెల్లో పాలవెల్లువ
కరోనా వచ్చిన తరువాత ఇంచు మించు అన్నిరంగాలు తీవ్ర ఒడి దొడుకులకు లోనయ్యాయి. ఒక్క వ్యవసాయంలోనే చిన్నచిన్న అవాం తరాలు ఏర్పడినా ప్రభుత్వం తీసు కున్న పలురకాల నిర్ణయాలతో నిరం తర ప్రవాహంగా సాగుతోంది ఒక్క వ్యవసాయమే. దీని మీద ఆధారపడే అన్ని రంగాలవారు పెద్దగా ఇబ్బం దులు ఎదుర్కొనలేదనే చెప్పాలి. అలాంటి వ్యవసాయ రంగాన్ని మరింత పటిçష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను సైతం లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పాల విప్లవానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందుకు అమూ ల్తో చేసుకున్న ఒప్పందం ఒకటి. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పలు రకాల ప్రయోజనాలు అందనున్నాయి. అమూల్ కంపెనీ కాదు అమూల్ అనగానే చాలామంది దానిని కార్పొరేట్ కంపెనీ అనుకుంటారు. అది ఒక డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీ. సహ కార సంఘం పేరు అమూల్ కాదు. కైరా డిస్ట్రిక్ట్ కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (కేడీసీఎంపీ యూఎల్). దీనిని గుజరాత్‌లోని ఆనంద్‌లో 1946లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి ఒక ఏడాది ముందు అంటే బ్రిటిష్ హయాంలోనే దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సంఘంలో వచ్చిన లాభాలు డివిడెంట్ రూపంలో పాల ఉత్పత్తిదారులకు (పాడి రైతులకు) మాత్రమే అందుతాయి. అదే ప్రైవేట్ డెయిరీలు అయితే లాభాలు తమ వద్ద ఉంచుకుంటాయి. ఒక సహకార సంఘం ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందడం అసాధ్యం. కానీ దీనిని సాధ్యం చేసింది మాత్రం స్వాతంత్య్ర సమరయోధుడు త్రిభువన్దాస్ పటేల్, డాక్టర్ వర్గీస్ కురియన్లు. గుజ రాత్లో పాడి రైతుల కష్టాలను, నష్టాలను చూసిన వీరు అమూల్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరించే ప్రైవేట్ కంపెనీలు లాభాలను వారు మాత్రమే పొందేవారు. దీనిని అమూల్ బద్దలుకొట్టింది. అమూల్ వచ్చిన తరువాత పాడి రైతులకు లాభాలు అందాయి. నిజంగా ఇదొక విప్లవం. దేశంలో పాల విప్లవానికి అమూల్ పునాదులు వేసింది. ప్రపంచంలో పాల దిగుబడిలో మన దేశం అమెరికాను దాటి ప్రథమస్థానంలో నిలిచింది. పాడి రైతులకు లాభాలను అమూల్ చూపిం చింది. సర్దార్ పటేల్ స్వప్నం మేరకు ప్రతీ గ్రామంలోను పాడిరైతులతో సొసైటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. అమూల్ రాకముందు గుజరాత్లో పెస్తోన్జీ అనే వ్యక్తి పెట్టిన పోల్సన్ కంపెనీ ఉండేది. ఇది గుజరాత్ రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే పాలను సేకరించి ముంబైలో అధిక ధరలకు విక్రయించేది. లాభాలు పంచడం దేవుడెరుగు, తన స్వలాభం కోసం రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకుండా చేసింది. అమూల్ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు అమూల్ స్ఫూర్తితో ఇంచుమించు ప్రతీ రాష్ట్రంలో కో ఆపరేటివ్ డెయిరీలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో డెయిరీలు చాలా విజయ వంతంగా నడిచాయి. చిత్తూరు, విశాఖ, విజయ, గోదావరి డెయిరీలు అటువంటివే. ఇవన్నీ కో ఆపరేటివ్ డెయిరీలుగా వచ్చాయి. అయితే రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న నయా పెస్తోన్జీలు (చంద్రబాబు) స్వలాభాల కోసం.. తమ సొంత కంపెనీల ఎదుగుదల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. నష్టాల బాటలు పట్టించి కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కొన్ని డెయిరీలను నిర్వీర్యం చేయడం ద్వారా తమ సొంత ప్రైవేట్ డెయిరీలు కోట్ల రూపాయల మేర లాభాలు పొందే విధంగా చూసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఆశించిన విధంగానే పాల డెయిరీలు రైతుల చేతుల్లో ఉండాలని బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. పాల ఉత్పత్తిదారులతో గ్రామాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయనుంది. వారి ద్వారా పాలను సేకరించడం, పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మకాలు చేయడం ద్వారా వచ్చిన లాభాలను రైతు లకు డివిడెండ్ రూపంలో అందజేస్తారు. ఇలా చేయడం ద్వారా మన రాష్ట్రంలో పాడి రైతులు లాభాలు పొందే అవ కాశముంది. ఇప్పటి వరకు రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలను విక్రయాలు చేయడం ద్వారా ఆదాయం పొందుతున్నారు కానీ... డెయిరీల ద్వారా వచ్చే లాభాలను రైతులు పొంద లేకపోతున్నారు. లాభాలన్నీ ప్రైవేట్ కంపెనీలు పొందు తున్నాయి. ఉత్పత్తి చేస్తున్న పాలకు సరైన ధర రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. పెరిగిన మేత, డెయిరీల నిర్వహణ ధరలకు అనుగుణంగా పాల ధరలు పెరగడం లేదన్నది రైతుల ఆవేదన. ఇదే విషయంపై ఎన్నికలముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పాడి రైతులకు మేలు చేసే నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. సహకార డెయిరీలకు పాలు విక్రయిస్తే రైతులకు లీటరుకు రూ.2 చొప్పున బోనస్ ఇస్తానన్న విషయం తెలిసిందే. అమూల్ వచ్చిన తరువాత పాల ధరలు పెరిగే అవకాశముంది. అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చి పల్లెల్లో పాల ఉత్పత్తి ఉరకలు వేయ నుంది. వ్యవసాయం లాభసాటి కావాలంటే పంటలతో పాటు పాడి ఉండాలని నాడు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగానే అమూ ల్తో ఒప్పందం. అలాగే గ్రామ సచివాలయాలలో వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నియమించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలవెల్లువకు ఆయన బాటలు వేశారు. త్వరలో రాష్ట్రంలో 7 వేల పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అవి కూడా మహిళ లతో ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాలకు పాల కొనుగోళ్లను అనుసంధానం చేయను న్నారు. ఈ విధంగా గ్రామీణ రైతులు, మహిళల ఆదాయం పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బల మైన పునాదులు వేస్తున్నారని చెప్పవచ్చు. వ్యాసకర్త ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు మొబైల్ : 98483 91234 -
పాల ధర పెంచేసిన మదర్ డెయిరీ
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచింది.మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్‌కు రూ.2, అరలీటర్‌కు రూ.1 రూపాయి చొప్పు పెరగనుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ తెలిపింది. పాలు సేకరణ ధరలు గత 3-4 నెలల పెరుగుదలపై నిరంతరాయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 15-20 శాతం పెరగడం,లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టోకెన్ మిల్క్ లేదా బల్క్ వెండర్ మిల్క్ ధరలను పెంచడం లేదు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్‌కు ఇది వర్తిస్తుంది. కొత్త రేటు ప్రకారం,వెన్న శాతం అధికంగా ఉండే పాల ధర లీటరు, 53 రూపాయలుగాను, అర లీటరు ధర రూ. 27 గాను వుంటుంది. పూర్తిస్థాయి క్రీమ్ (ప్రీమియమ్) పాలు లీటరుకు 55 రూపాయలు, అర లీటరు రూ.28 గాను వుంటుంది. డబుల్ టోన్ మిల్క్ (లైవ్ లైట్) ధరను 34 రూపాయల నుంచి లీటరుకు 36 రూపాయలకు పెరిగింది. అరలీటరు ధర 18 నుంచి 19 రూపాయలకు పెరిగింది. స్కిమ్డ్ అరలీటరు పాల ధరను కూడా ఒక రూపాయి( రూ.20 నుంచి 21 రూపాయలకు) పెంచింది. అయితే అరలీటరు ఆవు పాల ధరను ఒక రూపాయి పెంచింది. కానీ, లీటరు ధరలో లాంటి మార్పు లేదు. కాగా ఇప్పటికే అమూల్ పాల ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్‌కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అభినందన్‌పై అమూల్ సరికొత్త యాడ్
న్యూఢిల్లీ : శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు యావత్ భారత్ జేజేలు పలుకుతుండగా.. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఆయన సాహసాన్ని కొనియాడుతూ ప్రత్యేక యాడ్‌ను రూపొందించింది. అమూల్ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్టైజింగ్లో ఎంతో ఉన్నతంగా నిలుస్తాయన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమ్యూనికేషన్స్‌లో అమూల్ మించిన వారు ఇంకెవ్వరూ ఉండరని చాలా సార్లు నిరూపితమైంది. అయితే తాజాగా అభినందన్ ధీరత్వాన్ని ఆయన మీసంతో పోల్చుతూ.. ఇది అముల్ మీసం అంటూ, మీసం లేనిది ఏం లేదూ అనే క్యాప్షన్‌తో సృజనాత్మకమైన ప్రకటనను విడుదల చేసింది. (చదవండి: అభి మీసం) యాడ్ మొత్తం భారత హీరో వర్థమాన్‌ను కొనియాడుతూ ఉండగా.. అతన్ని సాహసాన్ని మెచ్చిన జనాలు అతని మీసం స్టైల్‌ను ఫాలో అవుతూ గర్వంగా ఫీలవుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వీడియోను అమూల్ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆయన మీసం స్టైల్ ఫొటోలను పోస్ట్ చేస్తూ భారత హీరోపై ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా యాడ్స్ రూపొందించి అమూల్ మార్కెట్‌ను క్యాచ్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. గతంలో కరుణానిధి మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పిస్తూ రూపొందించిన యాడ్ కూడా జనాలకు చేరువైంది. (చదవండి: సరిహద్దుకు అటూ.. ఇటూ..) #Amul Mooch: To Abhinandan from Amul! pic.twitter.com/NAG3zNMlIL — Amul.coop (@Amul_Coop) 2 March 2019 భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. అభినందన్‌ను శుక్రవారం విడుదల చేసింది. (చదవండి : ఆకాశం ముద్దాడిన వేళ..) -
అమూల్ నుంచి ఒంటె పాలు
ముంబై: డెయిరీ దిగ్గజం అమూల్ తాజాగా ఒంటె పాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అరలీటరు పెట్ బాటిల్ ధర రూ. 50గా ఉంటుందని సంస్థ తెలిపింది. ముందుగా గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్, కచ్ మార్కెట్లలో ఈ పాలను విక్రయిస్తారు. ఫ్రిజ్ లో ఉంచితే ఈ పాలు మూడు రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఒంటె పాల చాక్లెట్లకు మంచి స్పందన వస్తోందని అమూల్ తెలిపింది. ఒంటె పాలు సులభంగా జీర్ణం కావడంతో పాటు మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని కంపెనీ తెలిపింది. -
అముల్, మదర్ డైరీ పాలల్లో లోపాలు
న్యూఢిల్లీ: అముల్, మదర్ డైరీలు సహా పలు కంపెనీల పాలల్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ఈ పాలు శ్రేయస్కరం కావని చెప్పడం లేదనీ, నాణ్యత తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం వివరించారు. ప్రముఖ, స్థానిక బ్రాండ్లు సహా ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను పరీక్షించగా వాటిలో అముల్, మదర్ డైరీలు సహా మొత్తం 21 నమూనాల్లోని పాలు తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీలు పాలపొడితో పాలను కల్తీ చేస్తున్నట్లు తేలిందన్నారు. అధికారిక వివరాలు, నివేదికలు ఇంకా తమ వద్దకు రానందున దీనిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అముల్, మదర్ డైరీల ప్రతినిధులు చెప్పారు. -
క్లిక్ దూరంలో అమూల్ తాజా పాలు
ప్యాకెట్ పాలు కావాలంటే సమీపంలో ఉన్న మిల్క్ బూత్‌కు వెళ్లాల్సిందే. అదీ ఉదయాన్నే లేచి వెళ్లక తప్పదు. ఆలస్యమైతే ఎక్కువ రేటుకి కిరాణా దుకాణాల్లో కొనాల్సిందే. అదే ఒక క్లిక్ దూరంలో తాజా (ప్యాకెట్) పాలు దొరికితే గంతేయరూ.. పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న దిగ్గజ బ్రాండ్ అమూల్ దేశంలో తొలిసారిగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతానికి అహ్మదాబాద్‌లో పైలట్ కింద ఈ సేవలను పరీక్షిస్తోంది. అతి త్వరలో వాణిజ్య పరంగా యాప్‌ను అందుబాటులోకి తేనుంది. అమూల్ తాజా పాలను విక్రయిస్తున్న నగరాల్లో దశలవారీగా యాప్ సర్వీసులను పరిచయం చేయనుంది.