anaparthi
-
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
అనపర్తిలో చంద్రబాబు కుట్ర రాజకీయాలు..
-
టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు
-
అనపర్తి: ‘రామకృష్ణారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరిస్తా’
సాక్షి,అనపర్తి: కాకినాడలోని అనపర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం సాగుతోంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచాడు. దీంతో ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. ఇవాళ (శుక్రవారం) ముహూర్తం ఖరారు చేసుకున్న చేసుకునన్నారు. దీంతో అనపరర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చలకు వేదికను సిద్ధం చేశారు. అయితే అక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బయల్దేరగా.. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్లమిల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు చేసిన సవాలును ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిద్ధమైయ్యారు. రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ పెట్టి మరీ ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వలేదు. ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. -
అధికారంలో లేకపోవడంతో అరాచకంగా తయారైన బాబు
-
‘ఇరుకు’ సభ కోసమే.. బాబు నానా రభస
సాక్షి, అమరావతి: తన సభకు విపరీతంగా జనం వచ్చారని చూపించుకునేందుకు చంద్రబాబు కాకినాడ జిల్లా అనపర్తిలో ఇరుకు రోడ్డును ఎంచుకుని పెద్ద హైడ్రామా సృష్టించారు. ఆ రోడ్డులో సభ పెట్టడం ప్రమాదకరమని చెప్పిన పోలీసులపై విరుచుకుపడి వారిని దుర్భాషలాడారు. తన స్థాయిని మరచిపోయి గల్లీ నాయకుడిలా డీఎస్పీని ఇష్టానుసారం దూషిస్తూ ఊగిపోయారు. అనుమతిచ్చినా సభ జరగనివ్వడంలేదని, పోలీసులు అడ్డుకుంటున్నారని, సీఎం జగన్ ఇదంతా కావాలని చేయిస్తున్నారని తనకు తానే ఒక కట్టు కథను అల్లి శుక్రవారం సాయంత్రం అనపర్తిలో నానా హంగామా సృష్టించారు. నిజానికి.. పోలీసులు అనుమతిచ్చింది ర్యాలీకి మాత్రమే. కానీ, ర్యాలీ పేరుతో ఇరుకు రోడ్డులో సభ పెట్టేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. సభ కోసం పోలీసులు అనపర్తిలోని రెండు స్థలాలను టీడీపీ నేతలకు సూచించారు. గరŠల్స్ హైస్కూల్ ఎదుట ఉన్న ఖాళీ లేఅవుట్, స్థానికంగా ఉన్న కళా క్షేత్ర ప్రాంగణంలో ఎక్కడైనా సభ పెట్టుకోవాలని కోరారు. కానీ, టీడీపీ నేతలు అందుకు ఒప్పుకోలేదు. అవి పెద్ద స్థలాలు కావడంతో సభకు వచ్చే కొద్దిపాటి జనం కనపడరని, సభ ఫెయిల్ అయినట్లు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు రోడ్ల జంక్షన్‌ను ఎంచుకున్నారు. అక్కడే సభ పెడతామని భీష్మించుకుని పోలీసులతో గొడవకు దిగారు. చంద్రబాబు కూడా స్వయంగా పోలీసులపై విరుచుకుపడి తిట్ల దండకం అందుకున్నారు. మరోవైపు.. ఇరుకు రోడ్డులో సభ పెడితే ఇబ్బందులొస్తాయని, జీఓ నెంబర్–1లో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని పోలీసులు ఆయన్ను కోరారు. చిన్న రోడ్డులో ఎక్కువ మంది జనం వస్తే సమస్యలు వస్తాయని తాము ప్రత్యామ్నాయ స్థలాలు చూపించామని ఎంత చెప్పినా చంద్రబాబు వినకుండా డీఎస్పీని తిట్టిపోశారు. తాను చూపించిందే ఆర్డర్.. ఇదేనయ్యా ఆర్డర్ అంటూ ఊగిపోయారు. ‘ఎక్స్‌ట్రాలు చేయకు.. ఇదే ఆర్డర్’ అంటూ బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా పోలీసులు వద్దన్న చోటుకే వెళ్లి సభ పేరుతో హడావుడి చేశారు. తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వి, వాళ్ల వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కావాలని ఇరుకు రోడ్డును సభ కోసం ఎంచుకోవడం, ఎలాగో పోలీసులు అడ్డుకుంటారు కాబట్టి హైడ్రామా సృష్టించి మీడియా హైప్ ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అనపర్తిలో డ్రామా నడిపినట్లు స్పష్టమవుతోంది. జనం ఎక్కువ వచ్చినట్లు చూపించేందుకు సభ కోసం చంద్రబాబు ఎంచుకున్న ఇరుకు రోడ్డు బాబులో పశ్చాత్తాపం లేదు ఇక కందుకూరులో ఇరుకు రోడ్డులో సభ నిర్వహించి 8 మంది మృత్యువాత పడడానికి కారణమైనా ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే తనను కావాలని అడ్డుకుంటున్నారని, తన సభలకు వస్తున్న జనాన్ని చూసి భయపడి ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. సభ కోసం పోలీసులు సూచించిన మరో స్థలం కళా క్షేత్రం ప్రాంగణం నిజంగా తన సభలకు అంత పెద్దఎత్తున జనం వచ్చే పరిస్థితి ఉంటే పోలీసులు చూపించిన ఖాళీ స్థలాల్లో సభ నిర్వహించుకోవడానికి అభ్యంతరం ఏమిటనే ప్రశ్నకు చంద్రబాబుగానీ ఆయన పరివారం నుంచి గానీ సమాధానంలేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం.. పోలీసులతో గొడవకు దిగి హైడ్రామా సృష్టించడం.. మీడియా హైప్‌తో ఏదో జరిగిపోయినట్లు చిత్రీకరించడం.. తద్వారా ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. -
చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్‌లో కేసు నమోదు
-
రూల్స్ బ్రేక్.. చంద్రబాబు, టీడీపీ నేతలకు షాక్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాజమండ్రి ఈస్ట్‌జోన్ డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, చంద్రబాబు నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారు. పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో, ఐపీసీ సెక్షన్లు 143, 359r/w, 149 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు సహా 8 మంది నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. అనపర్తిలో జరిగింది ఇదే.. ‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. బహిరంగ సభ కోసం అనుమతి కావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్‌యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్‌ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు. దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్‌షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు. దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. -
తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్
అనపర్తి: యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న ఐదుగురిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి (సత్య) ఇంట్లోనే నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్‌లకు ఆయనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అనపర్తి సీఐ జె.వి.రమణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అనపర్తి మండలం రామవరంలో ఓ ముఠా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ సత్య, మరో నలుగురు యువకులు ఐపీఎల్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. సత్యతో పాటు తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంతరెడ్డి, కర్రి వీరవెంకటసత్యనారాయణరెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డిలను అరెస్టు చేసి.. రూ.2.50 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, బెట్టింగ్ లావాదేవీలు, బెట్టింగ్ ఆడుతున్నవారి వివరాలతో ఉన్న పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్య ఆధ్వర్యంలోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన బుకీలు, పంటర్లు ఎవరనే దానిపై లోతైన విచారణ నిర్వహించి, దీంతో సంబంధమున్న వారందర్నీ అరెస్ట్ చేస్తామని సీఐ వెల్లడించారు. -
రన్నింగ్‌లో రేసుగుర్రం.. సానబెడితే.. చిరుతే..
అనపర్తి(తూర్పు గోదావరి): ఆ యువకుడు పరుగెత్తాడంటే చిరుత కూడా వెనుకబడాల్సిందే. పరుగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలన్నదే అతడి ఆశయం. పేదరికం అడ్డుపడుతున్నా.. మెళకువలు నేర్పే కోచ్ లేకున్నా.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో ముందుకు దూసుకుపోతున్న ఆ యువకుడి పేరు ఉందుర్తి రమేష్. అనపర్తికి చెందిన ఈ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి లక్ష్మి కూలి పనులు చేస్తోంది. చిన్నప్పటి నుంచీ పరుగులో రమేష్‌ది ముందంజే. యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించాడు. చదవండి: Extramarital Affair: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి.. అథ్లెటిక్స్‌లో 10కే, 5కే ఆఫ్ మారథాన్ పూర్తి చేశాడు. నిత్యం స్థానిక జీబీఆర్ మైదానంలో నిరంతరం సాధన చేస్తూ కనిపిస్తాడు. ఇతడి సంకల్పానికి జీబీఆర్ యోగా, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, జీబీఆర్ విద్యాసంస్థల అధినేత తేతలి కొండబాబు తోడుగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం వంద కిలోమీటర్ల దూరాన్ని 9.20 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా 140 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో పరుగెత్తాలనే లక్ష్యాన్ని 70 నిమిషాలు ముందే చేరుకుని అబ్బురపరిచాడు. బుధవారం రాత్రి జీబీఆర్ కళాశాల నుంచి, బలభద్రపురం, బిక్కవోలు, జి.మామిడాడ, పెదపూడి, ఇంద్రపాలెం లాకులు, కాకినాడ, జగన్నాథపురం వంతెన, కోరంగి మీదుగా యానాం సరిహద్దు చేరుకుని తిరిగి అదే దారిలో గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు అనపర్తి జీబీఆర్‌కు చేరుకున్నాడు. ఇతడి పరుగు ప్రతిభకు ముచ్చటపడిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తేతలి కొండబాబుతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. రికార్డును తిరగరాస్తా.. జాతీయ స్థాయి రన్నింగ్ రేస్ పోటీల్లో పాల్గొని రికార్డులు నెలకొల్పడడమే తన లక్ష్యమని రమేష్ చెబుతున్నాడు. వికాస్ మాలిక్ అనే రన్నర్ 160 కిలోమీటర్ల దూరాన్ని 18.20 గంటల్లో పూర్తి చేసి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని వివరించాడు. ప్రభుత్వ సహకారం లభిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. కనీసం ఈ రంగంలో తనకు కొంచెం మార్గదర్శకంగా నిలిస్తే అబ్బురపరిచే విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
సీఎం జగన్ చల్లగా ఉండాలంటూ.. అమ్మవారికి మొక్కు..
అనపర్తి (తూర్పుగోదావరి): అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. సావరానికి చెందిన కర్రి వెంకటరెడ్డి పుట్టుకతో అంధుడు. నిరాశ చీకట్లు అలముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల పంట సచివాలయంలో ఇతనికి వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం వృద్ధుని వేషం వేసుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. సీఎం జగన్ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్నేహితుడు తాడి గోపికృష్ణారెడ్డి(మహిళ వేషధారి)తో కలసి అమ్మవారికి “ముసలోడికి దసరా పండుగ’ వేషధారణలో మొక్కు తీర్చుకున్నాడు వెంకటరెడ్డి. బీ టెక్.. డిఫరెంట్ లుక్ : అఖండ వేషధారణలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్.వీర్రాఘవరెడ్డి అదుర్స్ : పండితుల వేషధారణలో గ్రామస్తులు తగ్గేదే లే : పుష్ప సినిమాలోని వేషధారణలో యువకులు చదవండి: (మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!) -
Road Accident: వలంటీర్‌కు అత్యవసర వైద్యసేవలందించిన ఎమ్మెల్యే
సాక్షి, అనపర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రికి చేరిన క్షతగాత్రురాలికి అత్యవసర వైద్యాన్ని అందించి వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి నిదర్శనంగా నిలిచారు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి. స్థానిక గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేతగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ రూ.10 వైద్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పేరొందారు. వైద్యుడిగా తన ధర్మాన్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రిలో చేరిన వలంటీర్‌కు అత్యవసర వైద్య సేవలు అందించటం ద్వారా తన వృత్తి ధర్మాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే అనపర్తి గ్రామ సచివాలయం–4లో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.సంధ్య ఆదివారం రాత్రి మండలంలోని లక్ష్మీనరసాపురం సమీపంలో రోడ్డు ప్రమాదానికై గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కుడిచేయి మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో చేతి మణికట్టు భాగం నుజ్జయ్యింది. దీంతో ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చదవండి: (చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..) అయితే ఈ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రురాలి బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంధ్యకు అత్యవసర వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ సైతం అందుబాటులో లేకపోవడం, సిబ్బంది సకాలంలో స్పందిచకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ జి.వరలక్ష్మికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఇటువంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన
సాక్షి, అనపర్తి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. ► పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి. ►టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంపట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. కాగా, విషయం తెలుసుకుని రామవరం చేరుకున్న రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని విరమించాలని కోరడంతో మహిళలు అందుకు సహకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
యూట్యూబ్ చానల్స్ ప్రతినిధుల బరితెగింపు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని యూట్యూబ్ చానళ్లకు చెందిన ప్రతినిధులు బరితెగించి.. ఓ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. తొలుత సదరు వ్యాపారిని యూట్యూబ్ చానళ్ల ప్రతినిధులు డబ్బు డిమాండ్ చేశారు. అయితే నగదు ఇచ్చేందుకు వ్యాపారి నిరాకరించడంతో.. అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వ్యాపారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత వ్యాపారి పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ధాన్యం వ్యాపారం చేస్తాను. ఆదివారం లోడ్‌ను అడ్డగించిన కొందరు వ్యక్తులు విజిలెన్స్ అధికారులమని చెప్పి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసకున్న నేను అక్కడికి వెళ్లాను. వారిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూడగా.. నాపై దాడి చేసి పారిపోయారు. -
అనపర్తిలో కరోనా కేసు.. అధికారులు అప్రమత్తం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అనపర్తిలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్మెంట్ ఏర్పాటు చేసి పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వీధులను మూసివేశారు. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 273కు చేరుకుంది. పెదపూడి మండలం గొల్లలమామిడాడలో కరోనా కేసుల ఉధృతి ఆగడం లేదు. సోమవారం ఒక్కరోజే ఆ గ్రామంలో 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గొల్లలమామిడాడలో కరోనా బారినపడివారి సంఖ్య 113కు చేరుకుంది. పెద్దాడ, గండ్రేడు, రాజపాలెం గ్రామంలో ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి. మండలంలో కేసుల సంఖ్య 116కు చేరుకున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంటాక్ట్ వ్యక్తుల వివరాలు సేకరించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. -
అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. 1989, 2004లో అనపర్తి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
అనపర్తిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన స్కూల్ యాజమాన్యం
-
అనపర్తిలో పండగలా సాగుతున్న పాదయాత్ర
-
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు : మహిళ మృతి
అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన నాగమణి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో 14మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
ఇదేమి పెత్తనం
ఎంపీ నిధులతో చేపట్టే పనులకు కోడలు ప్రారంభోత్సవాలు అధికారిక కార్యక్రమాల్లో ఆమెదే హవా విస్తుబోతున్న అనుచరగణం ప్రేక్షకపాత్రలో అధికారులు. రాజకీయాల్లో అతివల అధికారాన్ని చేజిక్కించుకొని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి మూలన కూర్చోబెట్టిన మగ మహారాజులున్నారు... పెత్తనం చెలాయిస్తూ వారికి కేటాయించిన అధికార సీట్లపై కూర్చొని అధికారాన్ని వెలగబెట్టినవారున్నారు. మండల సమావేశాల్లో జెడ్పీటీసీలకు, సర్పంచులకు బదులుగా భర్తలు, లేదా వీరి బంధువుల గళాలే వినిపిస్తాయి. సంబంధితాధికారులు కూడా కిమ్మనకుండా చర్చల్లో పాల్గొంటున్నారు. చివరకు జిల్లా కేంద్రంలోని ఓ మహిళా శాసన సభ్యురాలు కూడా స్వతంత్రంగా వ్యవహరించలేని దుస్థితిలో ఉండడం విచారకరం. ఇందుకు భిన్నంగా ఉంది సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని పరిణామాలు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ మురళీమోహన్‌కు బదులు కోడలు రాజ్యమేలుతున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఎంపీ మురళీమోహన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన ఉన్నా లేకున్నా అన్నింటా తానే అన్నట్టు కోడలు చక్రం తిప్పుతూ పెత్తనం చెలాయిస్తూ రావడం ఆయన అనుచరులతోపాటు అధికారులకు ఇబ్బందుల్లో నెడుతున్నా అడ్డు చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. మురళీమోహన్ ఎంపీ అయ్యాక కోడలు రూపాదేవి కూడా నీడలా ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం వచ్చే ప్రతిసారీ ఈమె లేకుండా ఆయన రావడం లేదు. మురళీమోహన్ వయస్సు రీత్యా చేదోడువాదోడుగా ఉండేందుకు వస్తున్నారని ఇంతకాలం పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటూ వస్తున్నాయి. మురళీమోహన్ ఏమనుకుంటారేమోననే మొహమాటంతో ఆయనతోపాటు కార్యక్రమాల్లో వేదికపైకి కోడల్ని కూడా అనివార్యంగా ఆహ్వానిస్తున్నారు. అది పార్టీ కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా సరే. మామ వెంట కోడలు రావడంలో తప్పేంటని సమర్థిస్తూ వచ్చిన వారు కూడా రంగాపురం గ్రామంలో సోమవారం (12వ తేదీన) ఆమె చేసిన ప్రారంభోత్సవాలతో ఒక్కసారిగా విస్తుపోయారు.. మురళీమోహన్ ఎంపీగా ఎన్నికయ్యాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఓటమి తరువాత అందుకు ప్రధాన కారణమైన అనపర్తి నియోజకవర్గంపై మురళీమోహన్ వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నారు. 2014లో ఎన్నికలు వచ్చే వరకు కాళ్లకు బల్పాలు కట్టుకుని ఈ నియోజకవర్గంలో మురళీమోహన్ తిరిగినన్నిసార్లు మరే నాయకుడూ తిరిగి ఉండరు. తన గెలుపులో అనపర్తి నియోజకవర్గ పాత్రను మరిచిపోలేనని, అందుకే నియోజకవర్గంలో బిక్కవోలు మండలం రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. అలా దత్తత తీసుకుని రెండున్నరేళ్లవుతున్నా ఎంపీ పర్యటించిది వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో కోడలు ఆకస్మికంగా ఈ నెల 12వ తేదీన (సోమవారం) రూ.12 లక్షల వ్యయంతో ఎంపీ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాలును ప్రారంభించి, రూ.7 లక్షలు ఎన్ఆర్జీఎస్, పంచాయతీ నిధుల భాగస్వామ్యంతో బీసీ కాలనీ రోడ్డు పనులకు రూపాదేవి కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశ వేదికపైకి రూపాదేవిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిచయం చేసి మాట్లాడాల్సిందిగా కోరడం విశేషం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి రూ.19 లక్షలతో పంచాయతీ భవనం, రూ.9.50 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.4 లక్షలతో ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అదే సమయంలో రూపాదేవి రంగాపురంలో ప్రారంభోత్సవాలు ఏ హోదాతో చేశారని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గ్రామాన్ని దత్తత తీసుకున్నంత మాత్రాన కోడలు ప్రారంభోత్సవాలు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ నిధులు తమ సొంత జేబులోంచి తీసి ఖర్చు చేస్తున్నట్టుగా భావిస్తున్నట్టున్నారని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మేధావి వర్గం ఆక్షేపిస్తోంది. . -
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఘనంగా జాప్ రజతోత్సవ మహాసభలు కనీస వేతనాలు కరువవుతున్నాయన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల అనపర్తి : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రజతోత్సవాల్లో భాగంగా జాప్ అనపర్తి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం, జిల్లా మహా సభలు ఆదివారం స్థానిక ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో జరిగాయి. చిన రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో జిల్లా స్థాయిలో కూడా హైపర్ కమిటీల ఏర్పటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యాలు దృష్టి సారించాల్సిన అవసరం వుందని, ఇందులో భాగంగా పాత్రికేయుల శ్రమకు తగిన వేతనాన్ని అందించటాన్ని యాజమాన్యాలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి, గృహ నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని, దీనికి స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో పాత్రికేయులకు బాధ్యతలు, ఒత్తిడులే తప్ప కనీస వేతనాలు కరువవుతున్నాయన్నారు. చట్టాల అమలు కోసం, సమాజంలో అవినీతిని తమ వార్తల ద్వారా తెలియజేసే పాత్రికేయులు తమ విషయంలో అమలుకాని చట్టాలపై నిరంతరం పోరాడాల్సిన అవసరం వుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. పాత్రికేయులు తమ చిన్నారులకు విద్య, కుటుంబానికి వైద్య సాయం అనే రెండు అంశాలపై దృష్టి సారించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు ఇళ్ల స్థలాల మంజూరు, ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ పాత్రికేయులు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధులుగా నిలుస్తున్నారని, పాత్రికేయులు తమ వృత్తిని పవిత్రంగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్సీపీ అనపర్తి, మండపేట, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ల లీలా కృష్ణ, í రాజమండ్రి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కర్రి పాపారాయుడు మాట్లాడుతూ వృత్తి పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్ఎన్ఆర్ పున్నంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార శాఖ ఏడీ ఎం.ఫ్రాన్సిస్, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి తదితరులు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు చెల్లుబోయిన వేణు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కార్యదర్శి నల్లమిల్లి దుర్గా వరప్రసాదరెడ్డి, అనపర్తి మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల సమస్యలపై అలుపెరగని పోరాటం... పాత్రికేయుల సంక్షేమమే పరమావధిగా, వారి సమస్యలపై జాప్ నిరంతరం పాటు పడుతోందని జాప్ వ్యవస్థాపకుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జాప్ రజతోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో వర్తింపచేయటానికి కృషి చేస్తున్నామన్నారు. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలోని విలీన మండలాల్లో, పుదిచ్చేరి రాష్ట్రంలో అంతర్భాగమైన యానాంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు వివరించారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు, గృహనిర్మాణాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పదో తరగతి పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతులమీదగా శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. జాప్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఎస్ఎం కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎ రెహ్మాన్, జాప్ జిల్లా నేతలు పాల్గొన్నారు. -
అనపర్తిలో వైభవంగా సంక్రాంతి వేడుకలు
-
అదే రచ్చ.. మరో చిచ్చు
ఎమ్మెల్సీ వెర్సెస్ ఎమ్మెల్యే అనపర్తి ‘దేశం’లో ఆగని వర్గపోరు తెలుగు మహిళకు అవమానం మూడునెలలైనా లభించని సారీ! తాజాగా ఆమె భర్త అరెస్ట్ ‘బాబు’ కోర్టులో బంతి సాక్షిప్రతినిధి, కాకినాడ : అనపర్తిలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ నియోజకవర్గంలో తెలుగు మహిళకు అవమానం జరిగి మూడు నెలలైనా ఎమ్మెల్యే ఆమెకు క్షమాపణ చెప్పిస్తానన్న మాట నిలబెట్టుకోకపోవడం కేడర్‌లో అసంతృప్తిని పెంచుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు అనపర్తి రచ్చ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినా పట్టించుకోలేదు. ఫలితంగా అక్కడ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(రాము) మరింత ఒంటెత్తు పోకడలతో పార్టీలో చిచ్చురేపుతున్నారని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ మాగంటి మురళీమోహన్‌పై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇప్పటికే వర్గ విభేదాలతో అనపర్తిలో సతమతమవుతున్న పార్టీని ఆ ఇద్దరూ మరింత భ్రష్టుపట్టిస్తున్నారని పార్టీ కేడర్ మండిపడుతోంది. వారి వైఖరితో పార్టీ ప్రజల్లో మరింత పలచనైపోయిందంటున్నారు. ఎమ్మెల్యేపై కేడర్ గుర్రు పెదపూడి పంచాయతీలో పెట్రోలుబంకు విస్తరణకు పంచాయతీ తీర్మానం విషయంలో పార్టీ మండల కన్వీనర్ మార్నీడి రాంబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఎంపీటీసీ గుణ్ణం వనితను అవమానించారు. మార్నీడితో క్షమాపణ చెప్పిస్తానని మాట ఇచ్చి మూడు నెలలైనా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖం చాటేశారంటున్నారు. ఆవిర్భావం నుంచి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గంగా ఉండటమే ఆమె చేసిన పాపమా అని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ వర్గ రాజకీయాలు పెంచి పోషిస్తుండబట్టే నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన సీనియర్లు టీడీపీకి దూరమైపోతున్నారని ద్వితీయశ్రేణి మండిపడుతోంది. రంగంపేట మండలం మర్రిపూడిలో ఎమ్మెల్యే ఏకపక్ష విధానాలపై విసుగెత్తిపోయిన సీనియర్లంతా గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దూరం పెంచిన ఫ్లెక్సీ వివాదం అనపర్తి జెడ్పీటీసీ కర్రి దొరబాబు వర్గం ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. ఎమ్మెల్యే తీరు నచ్చకున్నా దొరబాబు సీనియర్ల మాట కొట్టేయలేక అంటీముట్టనట్టు ఉంటున్నారు. గత ఏడాది నియోజకవర్గంలో జరిగిన ఒక అధికార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాముకు అక్కడ దొరబాబు పేరిట పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆగ్రహం రప్పించింది. కార్యక్రమం అనంతరం ఆయన దొరబాబునుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య విభేదాలను మరింత పెంచాయి. అనపర్తిలో సొంత సామాజికవర్గ జెడ్పీటీసీని దూరం పెడుతోన్న రాము చివరకు ఎమ్మెల్సీ భాస్కరరామారావుతో కూడా ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ పెద్దాడలో పీహెచ్సీ భవన శంకుస్థాపనకు వచ్చిన ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో కత్తులు దూసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొడ్డు సత్తిరాజు ఇంటికి అల్పాహారం కోసం వెళ్లబోయిన మంత్రి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ అడ్డంపడటంతో అప్పట్లో వీరిద్దరూ బజారున పడ్డారు. క్షమాపణ కోరితే మరింత అవమానం! తాజాగా పెదపూడి జన్మభూమిలో మార్నీడితో తనకు క్షమాపణ చెప్పించాలని ఎంపీటీసీ వనిత ఎమ్మెల్యే, ఎంపీలకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకుండా వెళ్లిపోవడమే కాకుండా వనిత భర్తను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అవమానించారు. దీనిపై వనిత సహా ఎమ్మెల్సీ భాస్కరరామారావు పెదపూడి పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగడం తెలిసిందే. తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యేకు మొరబెట్టుకున్నా న్యాయం జరగకపోగా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తన భర్తను అవమానించారని వనిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఇదేనా న్యాయం అని ఆమె నిలదీస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో అన్ని తానే అన్నట్టు చక్రం తిప్పిన బొడ్డు భాస్కరరామారావు పార్టీని వీడి తిరిగి రావడంతో ఆయన హవా తగ్గింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తరచు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి సీనియర్లు, ముఖ్యనేతలు ఒకరొకరుగా దూరమవుతున్నారు. వనిత భర్తను ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సుతోనే అదుపులోకి తీసుకున్నారని సోమవారం రాత్రి పెదపూడి స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టిన వనితకు భాస్కరరామారావు మద్ధతుగా నిలిచారు. ఈ పరిణామాన్ని భాస్కరరామారావు జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా వద్ద ప్రకటించడం గమనార్హం. గతంలో రెండు పర్యాయాలు కూడా ఇదేరకంగా వీరిద్దరి మధ్య నెలకొన్న వైషమ్యాలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. కానీ వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి యత్నించిన దాఖలాలు కనిపించలేదు. -
లారీ ఢీకొని పాత్రికేయుడి మృతి
అనపర్తి (బిక్కవోలు) : సీనియర్ పాత్రికేయుడు సూరిశెట్టి రామకృష్ణ (38) విధి నిర్వహణలో భాగంగా ద్వారపూyì వెళ్లి తిరిగి వస్తూ అనపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన రామకృష్ణ పదేళ్లుగా వివిధ పత్రికలు న్యూస్ చానళ్లలో పాత్రికేయుడిగా పనిచేశారు. శుక్రవారం తను పని చేస్తున్న స్యూస్ చానల్‌కు వార్తా సేకరణకు ద్వారపూడి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వస్తూ అనపర్తి గ్యాస్ గొడౌన్ల వద్దకు వచ్చేసరికి అనపర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో రామకృష్ణ రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా అసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. రామకృష్ణకు భార్య 3 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే మండపేట, అనపర్తి నియోజకవర్గాల పాత్రికేయ సంఘ సభ్యులంతా ఘటనా స్థలానికి వచ్చి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
అనపర్తిలో భారీ అగ్ని ప్రమాదం
అనపర్తి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనపర్తి మండలం రామవరం గ్రామంలోని దళితవాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అనపర్తి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.