Anil kumar yadav
-
దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కొండి.. చదువుకునే పిల్లల్ని కాదు.. అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
పార్టీ మార్పులపై అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ ..
-
ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వడ్డీతో సహా చెల్లిస్తా: అనిల్ కుమార్ హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్ చేసేలా కృషి చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు.నా మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని చానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. నా మీద వార్త రాయడం వల్ల ఛానల్స్ రేటింగ్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను.. నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తాం. పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారు. అధికారం చేతిలో పెట్టుకుని.. నాపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా.ఎవరు పోస్టింగ్ పెట్టినా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం శునకానందం పొందుతోంది. నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. గతంలో మా ప్రభుత్వంలో మేము ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవి. కానీ, మేము అలా చేయలేదు. రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరేగా ఉంటాయి. అరెస్ట్‌లపై కూటమి నేతలు మాకు ఒక దారి చూపించారు. రానున్న కాలంలో తప్పకుండా తప్పులకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్
-
పోరాటం కొత్త కాదు.. వెనకడుగు వేసేది లేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, నెల్లూరు: తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. తన స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పోరాటం చేయడం వైఎస్సార్సీపీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు.కాగా, వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్పర్స్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి వ్యక్తిని గతంలో ఎప్పుడూ చూడలేదు. తన స్వార్ధ రాజకీయాలు కోసం తిరుమల పవిత్రతను దెబ్బతిశాడు. మనం ఓడిపోయాం తప్ప.. ప్రజలని ఎప్పుడూ మోసం చేయలేదు. ఒక్క సీటుతో ప్రయాణం ప్రారంభించిన డీఎంకే.. ప్రతిపక్షానికి కేవలం నాలుగు సీట్లే మిగిల్చి అధికారంలోకి వచ్చింది. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకోండి.. అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ధ్వంసం చేసిన వారి సొంత ఖర్చులతోనే నిర్మాణాలు చేయిస్తాం. జమిలీ ఎన్నికలు వచ్చినా.. 2029 ఎన్నికలు వచ్చినా గెలుపు వైఎస్సార్సీపీదే. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారికే భవిష్యత్తులో పదవులు వస్తాయి. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందాం. రూరల్‌లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. పార్టీ కష్ట కాలంలో మనతో ఉండే వారికీ భవిష్యత్తులో పదవులు వరిస్తాయి. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. రూరల్ నియోజకవర్గానికి బలమైన నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ద్వారా దొరికారు. సిటీ, రూరల్‌లో మళ్ళీ మన జెండా ఎగరేస్తాం.రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రూరల్‌లో వైఎస్సార్సీపీ గెలిచింది. రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాంటిది. ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం. స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీ మారారు. కార్యకర్తలు మాత్రం పార్టీలో ఉన్నారు. పార్టీ మారిన వారికి భవిష్యత్తులో తన్నులు తప్పవు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పెడతాడని.. ఆయన్ను తిడుతూనే పంచన చేరుతున్నారు. నా నేతల జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తాం. ఊరికే వదిలిపెట్టం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మా టైమ్ కూడా వస్తుంది. అప్పుడు చెబుతాం.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లతో దేశంలో శక్తివంతమైన నాయకుడిగా వైఎస్ జగన్ ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఏపీలోని పార్టీలకు లేవు. రాష్ట్రం నాశనం అయిందనే భావన మూడు నెలల్లోనే వచ్చింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌తోనే ఉంటాం. పోరాటాలు చేయడం మాకు కొత్త కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తాడో పేడో తేల్చుకునే వాళ్ళకే జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసి కొట్లాడతాం.. కార్యకర్తలను బతికించుకుంటాం. ఎల్లో మీడియా నన్ను నిత్యం కలవరిస్తోంది. నేను ఎక్కడికి పోలేదు.. విజయదశమి తర్వాత యాక్టివ్ అవుతా’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ -
మంత్రి నారాయణ్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
లోకేష్.. పడవలు ఎక్కడ?: అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: వాయుగుండం కారణంగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణమ్మ వరద ధాటికి ఏకంగా కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇంట్లోకి కూడా నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటరిచ్చారు. గతంలో లోకేష్ కామెంట్స్‌కు బదులిస్తూ.. ఇప్పుడు మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.కాగా, అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా.. ఏమయ్యా లోకేష్.. ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు. మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా?. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు. ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి’ అంటూ కౌంటరిచ్చారు. ఏమయ్యా @naralokesh...ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు..మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా...?మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు..ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత… pic.twitter.com/J6WQiVApEb— Dr.Anil Kumar Yadav (@AKYOnline) September 2, 2024 -
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ కాదు.. లోకేశ్ ఆర్డర్ నడుస్తోంది’
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేశ్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో..‘రషీద్ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్ర ప్రదేశ్ ను అత్యాచార ప్రదేశ్…— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 18, 2024 ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చకండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. లోకేష్ ఆర్డర్ మాత్రమే కనిపిస్తోంది. నిన్నటి వినుకొండ వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి అన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆ ఒకటిన్నర నెలలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
తను విసిరిన ఛాలెంజ్ పై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్
-
మమ్మల్ని అన్నారు.. ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు
-
అధికారం ఇచ్చింది పక్షపాతం లేకుండా పాలించమని ఈ రోజు మీరు పగ సాధిస్తే..!
-
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్
సాక్షి, తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు.ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం’’ అని అనిల్ చెప్పారు.‘‘ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం చూస్తున్నారు. అధికార పార్టీకి కాస్త టైం ఇస్తాం. వారి తప్పులపై నిలదీస్తాం’’ అని అనిల్ పేర్కొన్నారు.‘‘తమిళనాడులో డీఎంకేకి నాలుగుసార్లు డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అంతే. రాజకీయ సన్యాసంపై నా ఛాలెంజ్‌ని టీడీపీ వారు స్వీకరించలేదు. కాబట్టి దాని గురించి ఇక నేను మాట్లడను. దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. కక్ష సాధింపు ఉండదని చెప్తూనే టీడీపీ దాడులు చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు’ అని అనిల్ పేర్కొన్నారు. -
అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
-
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
-
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.కాగా, అనిల్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పినా స్పందించలేదు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది. ఈవీఎం ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీని కనపడలేదా?. పోలింగ్ రోజు పోలీసుల వైఖరి ఈసీకి కనపడలేదా?. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్- ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్... అల్లర్లపై చర్యలు తీసుకోలేదు.- టీడీపీ నేతలు సత్యహరిచంద్రులు అన్నట్లుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది.- మాచర్లలో జరిగిన ఎన్నికల హింస, అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది.?- మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతనే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.- మాచర్లలో టిడిపి అల్లర్లకు పాల్పడవచ్చని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు నుంచి ఈసికి లేఖలు రాస్తూనే ఉన్నారు.- మాచర్లలో జరిగిన అన్నిసంఘటనలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.- మాచర్లలో పలుప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బిసిలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించలేదు.- టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట SP సహకారం అందించాడు. టిడిపి రిగ్గింగ్ పై ఎస్పి స్పందించకపోతే పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారు.- పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తలను టిడిపి గుండాలు పగలకొట్టినా పోలీసులు స్పందించలేదు- ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ డే రోజున తొమ్మిది EVMలు ధ్వంసం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది.?- మాచర్లలోను, మిగతా నియోజకవర్గాల పరిధిలో EVMలు పగులగొట్టినచోట ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీడియోలు బయటకు ఇవ్వలేదు.?- మొత్తం 9 సంఘటనలు EVMల ధ్వంసం జరిగితే కేవలం 1 మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది.? మిగిలిన 8 వీడియోలు బయటకు ఎందుకు రాలేదు.?- గొడవలకు టిడిపి కారణం కాదు అని చెప్పాలనే ఈసి ప్రయత్నంగా కనిపిస్తోంది.!- వీడియో ఎలా బయటకు వచ్చిందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.- అసలు వీడియో బయటకు ఎలా వచ్చింది? వారిపై చర్యలు తీసుకోరా.?- వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ కేంద్ర ఎన్నికల సంఘం జరిపించాలని డిమాండ్ చేస్తున్నా- ఒక సామాజిక వర్గం అధికారులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నేతలు రిగ్గింగ్ చేసారు.- టిడిపి ఎంపీ అభ్యర్ది లావు కృష్ణ దేవారాయులు సుధ్ద పూసలాగా మాట్లాడుతున్నారు- మాకు పోలీసులు సహకరించలేదు. బందోబస్తు పెట్టలేదు అని ఆయన మాట్లాడుతున్నారు- పల్నాడు ఎస్పి దాడులు జరుగుతున్న గ్రామాల్లోకి మాత్రం రాకుండా పక్క గ్రామాలలో తిరిగారు.- మాచర్లలో రెండు రోజుల ముందు ఓ పధకం ప్రకారం పోలీసులను మార్చారు. ఎంపీ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను నియమించుకున్నారు.- ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఘన విజయం సాధిస్తారు.- తుమృకోటలో రిగ్గింగ్ జరిగుతుందని నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్పికి తెలియచేశాను- తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పినా SP కనీసం స్పందించలేదు. నన్ను రమ్మని చెప్పి అక్కడకు వెళ్లేసరికి ఎస్పీ అక్కడ లేరు.- న్యాయ పోరాటం చేస్తాం. ఓటు వేసేందుకు వెళ్లకుండా ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.- ఎంఎల్ఏ స్వగ్రామమైన కండ్లగుంట, పక్క గ్రామం కేపి గూడెంలో ఇద్దరు డిఎస్పీలను పెట్టారు- టిడిపి రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను పెట్టారు.- ఈ గ్రామాలలో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయటపెట్టండి. పోలీసుల సహకారంతో రిగ్గింగ్ జరిగిన విషయం బయటకువస్తుందని బయటపెట్టడం లేదు.- ఈ గ్రామాలలో రీ పొలింగ్ పెట్టాలని అడిగినా ఈసి స్పందించలేదు.- ముటుకూరు గ్రామంలో ఎస్సిబిసిలను భయభ్రాంతులకు గురిచేశారు. తుమృకోటలో ఇనుప రాడ్లతో టిడిపి వాళ్ళు ఈవిఎంను పగులగొట్టారు.- పోతురాజుగుంటలో బుడగ జంగాల ఇళ్ళపై దాడి చేసి లూటి చేసిన మాట నిజం కాదా.- కృష్ణదేవరాయలు ఫోన్ రికార్డ్ చూసుకోండి అని సత్యహరిచ్చంద్రుల్గా అంటున్నారు. వాట్సప్ కాల్ మాట్లాడితే రికార్డు ఉండదని అందరికి తెలుసు.- సత్తెనపల్లిలో నాలుగు రీపోలింగ్ అడిగితే స్పందించలేదు.- ప్రజలు వైయస్సార్ సిపి వెంట ఉన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.- ఎంఎల్ఏ వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో తిరగకుండా చేయాలని పోలీసులు చూశారు.- సత్తెనపల్లి, కొత్తగణేషుని పాడులో ఘర్షణలు జరుగుతున్నా కూడా ఎస్పీ అక్కడకు వెళ్లలేదు. -
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
-
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
-
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
ప్రజలంతా మనసాక్షితో ఓటు వేయాలి - అనిల్ కుమార్
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్