Aryan Rajesh
-
స్పై వస్తున్నాడు
నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు గ్యారీ బీహెచ్. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘భారతదేశ అత్యుత్తమమైన రహస్య కథగా ‘స్పై’ మూవీ ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం,కన్నడ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూన్ 29న విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా, ఆర్యన్ రాజేష్ ఓ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
గుండెల్లో మోగిందే నీ కబురే!
నిఖిల్, ఐశ్వర్యా మీనన్ జంటగా ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ ఆదివారం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
నిహారిక కొణిదెల 'హలో వరల్డ్' ట్రైలర్ రిలీజ్
Niharika Konidela Hello World Web Series Trailer Released: వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్‌తో ముందుకొచ్చింది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్నమైన వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్న ఆమె తాజాగా ఈ సిరీస్‌ను జీ5తో కలిసి నిర్మించారు. ఇంతకుముందు జీ5తో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్‌ను కూడా రూపొందించారు. 8 ఎపిసోడ్లుగా రూపొందిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌కి శివసాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను శనివారం (ఆగస్టు 6) ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. 'చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లానే చాలా అవుదామనుకున్నా' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్లో 'మనకు సాలరీ ఇత్తరా బ్రో', 'నీకు ఇవ్వాల్సిన రెండు లచ్చలు ఒక్క సంవత్సరంలో కట్టిపడేత్తా', 'చావడం కన్ఫర్మ్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తూ చావాలి కానీ, ఇలా ఏడుస్తూ చస్తే లాభమేంట్రా' అనే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. Thank you so much sir! Here the trailer, everyone!! https://t.co/L3VV9jMclY — Niharika Konidela (@IamNiharikaK) August 6, 2022 కాగా భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. -
‘జీ5’లో ఆర్యన్ రాజేశ్, సదాల ‘హలో వరల్డ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Hello World Web Series: వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన ‘హలో వరల్డ్’సిరీస్‌ని ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌కి శివసాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. 8 totally disconnected youngsters are coming together to say HELLO to the WORLD! Get ready to meet them soon!#HelloWorldonZee5 #AZEE5OriginalSerie@IamNiharikaK @ActressSadha @anilgeela_vlogs @nikhiluuuuuuuu @NityaShettyOffl @actor_sudharsan @UrsKarishma @Ramnitin8 @ZEE5Telugu pic.twitter.com/oYphKR8Xci — ZEE5 Telugu (@ZEE5Telugu) July 25, 2022 -
వెబ్ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్‌లోహీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆర్యన్ రాజేష్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత కాలం నటనకు దూరమైన రాజేష్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు త్వరలో ఓ వెబ్ సిరీస్‌తోనూ అలరించేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. జీ5 సంస్థ రూపొందించిన ‘ఎక్కడికి ఈ పరుగు’ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్, శశాంక్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 8 నుంచి ప్రసారం కానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోసం అన్నపూర్ణ ఫిలిం అండ్ మీడియా స్కూల్ విద్యార్థులు కూడా పనిచేయటంతో కింగ్ నాగార్జున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో కల్పిక కీలక పాత్రలో నటిస్తున్నారు. -
కేకో కేక...
రామ్‌చరణ్ అండ్ టీమ్ లొకేషన్లో కేక్ కట్ చేశారు. ఏంటీ? అప్పుడే షూటింగ్ పూర్తయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. అందుకు టైమ్ ఉంది. నటి స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం సెట్లో కేక్ కట్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘విజయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుక్రవారంతో 37వ వసంతంలోకి అడుగుపెట్టారు స్నేహ. ఈ సందర్భంగా సెట్లోనే ఆమె బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షెడ్యూల్ కంప్లీటైన తర్వాత వైజాగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. -
అన్న కాదు విలన్..!
రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్‌తో పాటు మరో విలన్ కూడా కనిపించనున్నాడట. హాయ్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్, చెర్రీ సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను విలన్లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్‌చరణ్ సినిమాతో ఆర్యన్ రాజేష్‌ను ప్రతినాయక పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సీనియర్ హీరో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్ రాజేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రాజేష్ కూడా జగపతి బాబు, ఆదిల్లా స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
యూరోప్ పోదాం చలో చలో
హైదరాబాద్‌లో విలన్స్ అందర్నీ చితకబాదిన తర్వాత హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ పాడనున్నారట రామ్‌చరణ్. ఆ డ్యూయెట్ కూడా ఫారిన్లో పాడుకోనున్నారు. అందుకే హీరోయిన్‌తో కలసి యూరోప్ వెళ్లనున్నారని సమాచారమ్. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, స్నేహా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్ సీన్స్‌కు సంబంధించిన ఈ ఫైట్‌లో 200మంది ఫైటర్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి శ్రీను. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఫిక్స్ చేశారట. ఈ షెడ్యూల్లో సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్‌పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
బ్యాంకాక్ టు హైదరాబాద్
బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్‌చరణ్ కుటుంబం మరికొన్ని రోజులు సకుటుంబ సపరివార సమేతంగా హైదరాబాద్‌లో సందడి చేయనుంది. మరి హైదరాబాద్‌లో మకాం ఎన్ని రోజులంటే పది రోజులకుపైనే అట. ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదా? రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్ విశేషాలండి. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత స్టార్టింగ్ టు ఎండింగ్ యూనిట్‌ని ఫ్యామిలీయే అనుకుంటారు కదా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన బృందం ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. జూన్ 14 నుంచి స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందులో చరణ్, కియారాతో పాటు మిగతా తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్ పదిహేను రోజులపాటు సాగనుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. -
వీళ్లిద్దరూ కవలలు కాదు... కాదా?
మరి నాన్న గురించి ఏమడిగినా కవలల్లానే కనెక్ట్ అవుతున్నారేంటి?ఒకరికి చక్కిలిగింత పెడితే మరొకరికి నవ్వు వచ్చినట్టు.. ఒకర్ని గిల్లితే ఇంకొకళ్లకి కన్నీళ్లు వచ్చినట్లు.. వీళ్లిద్దరికీ నాన్న అంత దగ్గర. ఏది చేసినా నాన్న కీర్తి పెరగాలని, నాన్న ఆశయం నిలవాలని, నాన్న మాట నిలబెట్టాలని ఒకేలా ఆలోచించే ‘థాట్ ట్విన్స్’ ఈ హలో బ్రదర్స్. మీ నాన్నగారితో మీ మెమరబుల్ మూమెంట్స్.. రాజేశ్: ‘హాయ్’ సినిమా ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ సీన్ ఇంకా గుర్తున్నాయి. ఫస్ట్ టైమ్ నాన్న ఒక డైరెక్టర్లా నాకు సీన్ వివరించడం, నేను ఆయన్ను డైరెక్టర్లా అనుకుని చేయడం.. ఆ రోజు థ్రిల్లింగ్‌గా అనిపించింది. లొకేషన్లో ఫాదర్ అండ్ సన్‌లా కాదు. పని విషయంలో రూల్స్ రూల్సే. ఆ సినిమాకు నేను హీరో అవ్వొచ్చు కానీ అంతా ఆయన చేతుల్లోనే. డాడీతో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ‘హాయ్’ ఓ స్వీట్ మెమరీ. నరేశ్: నేను బాగుండనని, నన్ను డైరెక్టర్ని చేయాలని అనుకునేవారు. కాకపోతే ‘నువ్వు బాగుండవు’ అనే మాట నాతో అని, నన్ను డిజప్పాయింట్ చేయలేదు. నేను ‘అల్లరి’ సినిమా చేసినప్పుడు ఆయన పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రిలీజ్‌కి ముందు సురేశ్‌బాబుగారు, దర్శకుడు రవిబాబు, నాన్నగారు సెకండ్ షో వేసుకొని చూశారు. నాకు 24 ఏళ్లు వచ్చేవరకూ మా నాన్నగారి పక్కనే పడుకునేవాణ్ని. ‘అల్లరి’ షో చూసొచ్చి, రూమ్‌లోకి వచ్చీ రాగానే ‘చాలా బాగా చేశాడు. ఆర్టిస్ట్‌గా సక్సెస్ అవుతాడు’ అని అమ్మతో అన్నారు. మరో బెస్ట్ కాంప్లిమెంట్ ‘గమ్యం’కి ఇచ్చారు. ‘ఈ కథ ముందు నాకు చెప్పి ఉంటే వద్దనేవాణ్ని. నీది మంచి డెసిషన్’ అన్నారు. నాన్నగారు లేని ఇల్లు ఎలా అనిపిస్తోంది? నరేశ్: ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. వెలితి ఎప్పుడు తెలుస్తోందంటే... నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం. మా పిల్లల్ని చూసినప్పుడు ఆయన బ్రతికుంటే అసలు పిల్లల్ని ఎత్తుకుని కిందకి దించేవారు కాదేమో అనిపిస్తుంటుంది. మీ నాన్నగారు కెరీర్‌వైజ్‌గా ఇచ్చిన సలహాలేంటి? నరేశ్: ‘ఒకరికి మంచి చేయకపోయినా çఫర్లేదు కానీ చెడు చేయొద్దు. మన వల్ల ఎవరూ బ్లేమ్ అవ్వకూడదు. గొడవలకి వెళ్లకూడదు’ అనేవారు. ఆయన లైఫే మాకు మంచి లెసన్. మా ఆఫీస్ ముందు 20కి పైగా కారులు ఉన్న టైమ్‌ని చూశాం. హిట్స్ లేనప్పుడు ఎవరూ పలకరించని ఇన్సిడెంట్స్నీ చూశాం. ‘ఈవీవీ అయిపోయాడు’ అనే మాటని తట్టుకోలేక ‘ఈవీవీ సినిమా’ బేనర్ స్టార్ట్ చేసి, నాన్నగారు ‘చాలా బాగుంది’ తీశారు. ముందే ‘చాలా బాగుంది’ అని టైటిల్ పెట్టేస్తే సరిపోతుందా? అన్నవాళ్లు ఉన్నారు. సినిమా హిట్ కాబట్టి ఎవ్వరూ మాట్లాడలేదు. రాజేశ్గారూ.. మీ అబ్బాయి అచ్చం మీ నాన్నగారిలానే ఉన్నాడు... రాజేశ్: మా ఆరవ్‌ని ఎక్కడికి తీసుకెళ్లినా ‘చిన్న ఈవీవీ’గారు అంటుంటారు. (చెమర్చిన కళ్లతో). చిన్న ఈవీవీగారు అల్లరి చేస్తున్నారా? నరేశ్: (నవ్వేస్తూ)... మా తర్వాతి జనరేషన్లో మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ అబ్బాయి వాడు. అబ్బాయి అమ్మాయి అని కాదు కానీ ఫస్ట్ బేబీ కాబట్టి స్పెషల్. వాడు పుట్టినప్పటి నుంచి ‘ఈవీవీగారిలా ఉన్నాడు’ అని అందరూ అనడం వల్ల అమ్మ బాగా గారం చేస్తారు. అల్లరి చేసినా ఏమీ అనరు. ‘అమ్మా కోప్పడాలి. వెనకేసుకు రాకూడదు. తిట్టమ్మా’ అంటాం. ఈవీవీగారు ఉన్నప్పుడే మీ పెళ్లి సెట్ అయింది కదా? రాజేశ్: అవును. ఆయన ఉండగానే మాట్లాడాం. నా పెళ్లి చూడకపోయినా ఫలానా అమ్మాయిని చేసుకుంటున్నాడు అని ఆయనకు తెలుసు. కనీసం ఆ తృప్తి అయినా మిగిలింది. నరేశ్: రాజేశ్ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 10న అనుకున్నాం. నాన్నగారు జనవరి 21న చనిపోయారు. పెళ్లి ఇలా చేయాలని మీ నాన్నగారు చెప్పారా? రాజేశ్: రాజమండ్రిలో మ్యారేజ్ అనుకున్నాం. పెళ్లి అక్కడ బంధువుల మధ్య చేసి, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్, సన్నిహితుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయాలన్నారు. నాన్నగారికి బంతి భోజనం అంటే ఇష్టం. ఆయన అనుకున్న మండపంలోనే, ఆయన చూసిన అమ్మాయినే, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే నా పెళ్లి జరిగింది. ఈవీవీగారు ‘బెస్ట్ హోస్ట్’. అతిథులకు వడ్డించే వంటకాల విషయంలో కేర్ తీసుకునేవారు కదా? నరేశ్: మా నాన్నగారు ఏది చేసినా ఒక మార్క్ ఉండేలా చేస్తారు. ఈస్ట్ వెస్ట్‌లో ఫుడ్‌తో చంపేస్తారు. అందరూ విందులో స్వీట్స్, ఐస్‌క్రీమ్స్ పెడుతున్నారు కాబట్టి మనం జున్ను పెడదాం అని అది తయారు చేయించేవారు. అన్నయ్య పెళ్లికి నాన్నగారి స్థాయికి తగ్గట్టుగా విందు ఏర్పాటు చేయాలనుకున్నాం. పెళ్లికి 84 ఐటెమ్స్ పెట్టాం. ‘పిల్లలు కదా ఎలా చేస్తారో అనుకున్నాం. ఆయన పిల్లలనిపించుకున్నారు’ అని అందరూ అన్నారు. అంటే.. ఫుడ్‌లో కూడా మేం ఆయన పిల్లలు అనిపించుకోవాలంటే అది తెలియని బాధ్యత. అదొక హ్యాపీ ఫీలింగ్. మీ నాన్నగారి ఆత్మ శాంతంగా ఉండాలంటేæ మీ ఇద్దరూ ఎప్పటికీ కలిసుండాలి. పెళ్లయ్యాక మీ ఇద్దరూ ఎలా ఉంటున్నారు ? నరేశ్: అందరం హ్యాపీగా ఉన్నాం. రాజేశ్: నాన్నగారు అనుకున్నట్లుగానే ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు నా మరదలు (నరేశ్ భార్య) బాగా చూసుకుంది. మా పిల్లలు కూడా చక్కగా ఉంటారు. ఆస్తి విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఆ మధ్య ఏదో ఇష్యూ ఉందనే వార్త ఒకటి వచ్చింది? నరేశ్: అలాంటిది ఏదీ లేదండి. మా ఫాదర్ పేపర్స్ మీద ‘ఇది నాకు.. ఇది వాడికి’ అని ఎప్పుడూ పెట్టలేదండి. ఏది కొన్నా రెండు కొనేవారు. ఒకటి నరేశ్‌కి ఇంకోటి రాజేశ్‌కి అనేవారు. మా ఇంట్లో అందరికంటే స్ట్రాంగ్ మా అమ్మగారే. డబ్బులున్నప్పుడు, లేనప్పుడు ఒకేలా ఉన్నారు. నాన్నగారు పోయాక రాజేశ్ పెళ్లి అయిపోయింది. ‘వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడేమో’ అని నా విషయంలో అమ్మ కంగారు పడేవారు. ‘లేదమ్మా నేను అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా’ అని ఆవిడ చూసిన అమ్మాయినే చేసుకున్నాను. ఇంటికి వచ్చిన అమ్మాయిలు కూడా చక్కగా కలిసిపోయారు. పిల్లల్ని చూసినప్పుడల్లా నాన్నగారుంటే బావుణ్ణు అనిపిస్తుంటుంది. రాజేశ్ : మా మధ్య ఏవో గొడవలున్నాయనే వార్త నిజం కాదండీ. మేం ‘బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్’ కాదు. మాకు కష్టాలు తెలుసు. నాన్నగారు సంపాదించి ఇచ్చినదాన్ని కాపాడుకోవాలి. అలాగే మేం ఇంకా సంపాదించాలి. మా తాతయ్య, నానమ్మ (ఈవీవీగారి తల్లిదండ్రులు) ఇద్దరూ ఉన్నారు. ఒకే డేట్‌కి ఒక సంవత్సరం నాన్నగారు, ఆ మరుసటి ఏడాది మా బాబాయి చనిపోయారు. నాన్నమ్మ, తాతయ్యలకు అది పెద్ద షాక్. కొడుకు చేతిలో కొరివి పెట్టించుకోవాలని అనుకుంటారు ఎవరైనా. నాన్న ఆత్మ శాంతంగా ఉండాలంటే ఆయన అనుకున్నట్టు చేస్తే సరిపోతుంది. ఆయన పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి. మేం బాగుండాలి. అలానే ఉంటున్నాం. కష్టాలు తెలుసు అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్? రాజేశ్: మా 8, 9 క్లాసెస్ వరకూ కష్టాలుండేవి. నరేశ్ : మీకో ఎగ్జాంపుల్ చెబుతాను. ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్. సక్సెస్ వస్తే ఓకే కానీ ఫ్లాప్ అయితే చాలు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. చిన్నప్పుడు మేం చెన్నైలోఉండేవాళ్లం. అక్కడ వడపళని టెంపుల్‌కి వెళ్లినప్పుడు మాకు ముంత కొనిచ్చారు. నేను, అన్నయ్య డబ్బులు దాచుకునేవాళ్లం. నాన్నగారికి టీ, కాఫీ తాగాక సిగరెట్ తాగకపోతే చిరాకుగా ఉండేది. ఓసారి ఆయన దగ్గర సిగరెట్లు కొనడానికి డబ్బుల్లేవు. హుండీ పగలకొట్టి సిగరెట్ తెచ్చాను. అవి కొనడం తప్పని తెలిసే వయసు కాదు నాది. నాన్న కోసం అది చేయాలనిపించింది. 20 రూపాయిలు అప్పు తీసుకున్న రోజులూ ఉన్నాయి. రాజేశ్: అప్పట్లో మేం ఉన్న ఇంటి అద్దె 550 రూపాయిలు. 2, 3 నెలలు కట్టకుండా ఉండేవాళ్లం. స్కూల్ ఫీజ్ కూడా కట్టలేని పరిస్థితులను చూశాం. నరేశ్ : నాకు రాజేశ్ మీద కోపం ఉండేది. వాడి బర్త్‌డే ఫిబ్రవరి 14. కొత్త బట్టలు కొనేవారు. నాది జూన్ 30. సరిగ్గా స్కూల్ స్టార్ట్ అయ్యేది. నాలుగు జతల యూనిఫామ్‌లో ఒక దానికి పసుపు రాసి, బర్త్‌డే రోజు వేసుకోమనేవారు. క్లాస్‌లో 72 మంది ఫ్రెండ్స్ ఉంటే.. 25 చాక్లెట్స్ కొనిచ్చి, క్లోజ్‌గా ఉండేవాళ్లకు ఇవ్వమనేవారు. ఎవరెవరికి ఇవ్వాలో తెలియక నేనే తినేసేవాణ్ణి. ఈవీవీగారు రెడీ చేసిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? నరేశ్: కొన్ని కథలు స్టేల్ అయ్యాయి. అవి అప్పటి సందర్భాలకు తగ్గట్టుగా రాసినవి. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో ‘యుగాంతం’ అని వార్త వచ్చినప్పుడు, ‘కొంప కొల్లేరు’ అనే టైటిల్‌తో కథ అనుకున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కథ చెప్పారు. ‘2012 డిసెంబర్లో యుగాంతం అంటున్నారు కదా.. మనం నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేద్దాం’ అన్నారు. అయితే అనుకోకుండా 2011లో నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆ కథతో సినిమా తీయలేం. ఇంకొన్ని ఇలానే స్టేల్ అయ్యాయి. ఈవీవీగారు, చలపతిరావుగారు మంచి ఫ్రెండ్స్. మీ డాడీ మరణం ఆయన్ని కూడా కుంగదీసిందా? నరేశ్: చలపతిరావుగారి లైఫ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాన్నగారు ‘మా నాన్నకు పెళ్లి’ మూవీ స్టోరీ రాశారు. చలపతి బాబాయ్ మిసెస్ ఎప్పుడో చనిపోయారు. ‘తోడు ఉండాలి. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని నాన్నగారు బాబాయ్‌తో చాలాసార్లు అన్నారు. కానీ చేసుకోలేదు. నాన్న, బాబాయ్‌ల ఫ్రెండ్షిప్ జర్నీ దాదాపు 15 ఏళ్లు పైనే. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే వాళ్లదే. చలపతి బాబాయ్ టీ, కాఫీ కూడా తాగరు. చాలామంది నాన్నగారు మందు తాగుతారనుకునేవాళ్లు. కానీ ఆయనకు అలవాటు లేదు. నాన్నగారిని ఆయన చాలా మిస్సవు తున్నారు. ‘ఆయన ఉండి ఉంటే బాగుండేది’ అంటుంటారు. ఈ నెల 30న మీ బర్త్‌డే. మీ నాన్నగారు ఉన్నప్పుడు జరుపుకున్న బర్త్డేస్లో గుర్తుండిపోయినది? నరేశ్: ‘చిలక్కొట్టుడు’ షూటింగ్ అబ్రాడ్‌లో జరిగినప్పుడు 200 డాలర్లు పెట్టి పెద్ద కేక్ తెప్పించారు. సెట్లో ఫస్ట్ టైమ్ నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌డే అది. అక్కడ కేక్ కట్ చేయడం నాకు మంచి మెమరీ. రాజేశ్: ‘హాయ్’ మూవీ షూటింగ్ దుబాయ్‌లో జరిగినప్పుడు నా బర్త్‌డే వచ్చింది. ‘రారా’ అని తీసుకెళ్లి ఒమేగా వాచ్ కొనిపెట్టారు. ఆ వాచ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఫైనల్లీ.. మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు దాచుకున్నది? నరేశ్: నాకు చాలా వాచ్‌లు కొనిపెట్టారు కానీ నేను ఇప్పటికీ వాడుతున్న గిఫ్ట్ నాన్న ఇచ్చిన ‘వ్యాలెట్’. ఒకసారి నేను పర్స్ కొనడానికి వెళితే, ‘నీ అంతట నువ్వు కొనుక్కునే కన్నా ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది’ అని పక్కన ఉన్నవాళ్లు అన్నారు. అప్పుడు నాన్న ‘నా వ్యాలెట్ తీసుకో. ఆ డబ్బులు నాకిచ్చెయ్’ అన్నారు (నవ్వులు). ఆ పర్స్ భద్రంగా ఉంది. మా ఇద్దరి షూ సైజ్ ఒకటే. నా షూస్‌ని ఆయన, ఆయనవి నేను వాడేవాళ్లం. అవి ‘నైస్ మూమెంట్స్’. రాజేశ్: ఇందాక చెప్పినట్లు ఒమేగా వాచ్ నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది. మెటీరియల్స్ గురించి వదిలేస్తే.. నాన్నగారితో గడిపిన ప్రతి క్షణం వ్యాల్యుబుల్. మాకు ఎన్నో మంచి మెమరీస్‌ని మిగిల్చారు. మీ నాన్నగారు దూరమయ్యాక మీ ఇద్దరూ సినిమాలు తగ్గించేశారు. కారణం ఏంటి? నరేశ్: ఏదైనా సక్సెస్ మీదే డిపెండ్ అయ్యుంటుంది. చాలా కష్టపడి ‘లడ్డూ బాబు’ చేశాను. ‘యాక్షన్ 3డీ’ చేశాం. సక్సెస్ అవ్వలేదు. రెగ్యులర్ కామెడీ సినిమాలు చేస్తే ఎప్పుడూ అవేనా అంటారు. ఇదివరకు వరుసగా మాకు రెండు ఫ్లాప్స్ వస్తే నాన్నగారు మాతో ఓ హిట్ సినిమా తీసేవారు. దాంతో బ్యాలెన్స్ అయిపోయేది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ లేదు. ఇప్పటివరకూ రాజేశ్‌ది కానీ నాది కానీ ఒక్క సినిమా కూడా స్టార్ట్ అయ్యి, ఆగిపోయింది లేదు. ఇదివరకు కథ కొంచెం ఫర్లేదు అనిపించినా చేసేవాళ్లం. కానీ ఇప్పుడు కొంచెం డౌట్ ఉన్నా.. వద్దు అనేస్తున్నాం. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. రాజేశ్: నాన్నగారు పోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. పెళ్లయిన తర్వాత ఇంకాస్త గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ నుంచి వరుసగా సినిమాలు చేస్తాను. ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా ఒక విషయంలో మీ నాన్నగారితో మీ ఇద్దరూ విడివిడిగా వాదించిన సందర్భాలేమైనా ఉన్నాయా? రాజేశ్: ‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమా విషయంలో నాకు, డాడీకి వాదన జరిగింది. ‘ఇది మీ స్టైల్ సినిమా కాదు. మీకు సెట్ అవ్వదు’ అన్నాను. డాడీ వినలేదు. అప్పుడు గట్టిగా వాదించాను. అయినా తీశారు. నరేశ్: ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. ఆ సినిమా ఇప్పుడు తీసుంటే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎంత వద్దన్నా ఆ సినిమా చేశారు. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. అప్పట్లో మీ ఇద్దరి కోసం చాలా సినిమాలు తీశారు. కొన్ని సినిమాలకు డబ్బులు పోయాయి కూడా... నరేశ్: డబ్బులు గురించి నాన్నగారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన చనిపోయాక మేం ‘ఈవీవీ సినిమా’ బేనర్ మీద ‘బందిపోటు’ సినిమా చేశాం. బేనర్‌కి మంచి వ్యాల్యూ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ మూవీయే చేయాలనుకున్నాం. మా దురదృష్టం.. హిట్ కాలేదు. డబ్బుకన్నా కూడా ఆ ఫ్లాప్‌ని మేం అవమానంగా భావించాం. హిట్టయితే ‘ఈవీవీ పిల్లలు ఆయన బేనర్ మీద మంచి హిట్ సినిమా తీశారు’ అని చెప్పుకునేవాళ్లు. అది మిస్సయినందుకు బాధగా అనిపించింది. రాజేశ్: ఆ విషయంలో చాలా బాధపడ్డాం. మళ్లీ మా బేనర్ మీద సినిమా ప్లాన్ చేస్తున్నాం. – డి.జి. భవాని -
కొత్త ఇంట్లోకి...
మరో మూడు రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారు రామ్‌చరణ్. గృహప్రవేశం తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 21న కుటుంబ సభ్యులు, బంధువులందరితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారట. ‘రంగస్థలం’ సినిమా సూపర్ సక్సెస్‌తో రామ్‌చరణ్ కొత్త ఇంటికి మారిపోయారని అనుకుంటే పొరబాటే. ఈ గృహప్రవేశం రియల్‌గా కాదు... రీల్‌గా. విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో చరణ్ ఈ నెల 21 నుంచి పాల్గొంటారట. ఇప్పటివరకు ఇతర చిత్రబృందంతో సీన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సెట్లోకి చరణ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఓ భారీ ఇంటి సెట్ రూపొందించారట. ఆ ఇంటి సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర కీలక తారాగణంతో ముఖ్య సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారట. ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి కుర్రాడిలా కనిపించిన చరణ్ ఈ సినిమాలో ఫుల్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, స్నేహా, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు బోయపాటి మార్క్ యాక్షన్‌తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. -
చరణ్‌కు అన్నయ్యగా కమెడియన్
సాక్షి, హైదరాబాద్ : రామ్‌చరణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం ఇటీవలే పూర్తి చేసుకున్న చరణ్, ఆతర్వాత మాస్ అభిమానుల పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు టాప్ నటీనటులు నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ స్నేహ, తమిళ హీరో ప్రశాంత్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈసినిమాపై మరో వార్త టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. ఈవీవీ సత్యనారాయణ పెద్ద తనయుడు ఆర్యన్ రాజేష్ నటిస్తున్నట్లు సమాచారం. చరణ్‌కు అన్నయ్యగా కనిపించనున్నాడట. ఆర్యన్‌కు జోడీగా జర్నీ సినిమా ఫేం అనన్య కూడా నటిస్తోందట. రాజేష్ సొంతం, హాయ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కు ఏర్పాట్లు చేసుకుంటోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. -
కాణిపాకంలో అల్లరి నరేష్
కాణిపాకం: ప్రముఖ హీరో అల్లరి నరేష్ కుటుంబ సమేతంగా గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
మా నాన్న పేరు నిలబెడతాం..
రాజమండ్రి : సినీ పరిశ్రమలో తండ్రి ఈవీవీ సత్యనారాయణ సముపార్జించిన పేరును నిలబెట్టేలా తాను, సోదరుడు నరేష్ కృషిచేస్తామని హీరో, నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. శనివారం ఆయన భార్య సుభాషిణి, తల్లి సరస్వతితో కలిసి వి.ఐ.పి. ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి తండ్రి ఈవీవీ సత్యనారాయణకి పిండప్రదానం చేశారు. అనంతరం విలేకరులతో అర్యన్ రాజేష్ మట్లాడారు. ఇటీవలే వివాహమైన తన సోదరుడు నరేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలిపారు. జులై 21న నరేష్ హైదరాబాద్ వస్తాడని చెప్పారు. నరేష్ అవకాశాన్ని బట్టి పుష్కరస్నానం చేస్తాడని అర్యన్ రాజేష్ పేర్కొన్నారు. -
షికార్ మూవీ స్టిల్స్
-
ఈవీవీ సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది!
ఒక్కో తరంలో ఒక్కో కథానాయకుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యతను భుజాన వేసుకుంటారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ఈ తరంలో ఆ బాధ్యత మోస్తున్న ఓ కథానాయకుడు... ‘అల్లరి’ నరేశ్. ఆయన సినిమాకు వెళ్తే వందశాతం వినోదం గ్యారెంటీ అన్న మాట. నరేశ్ తాజాగా ‘బందిపోటు’ అవతారమెత్తారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’ తో చెప్పిన ముచ్చట్లివీ... అల్లరి నరేశ్: ‘అష్టాచమ్మా’ చూసినప్పట్నుంచీ ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఆయన సినిమాల్లో కథనం, వ్యంగ్యం నాకు బాగా నచ్చుతాయి. అయితే ఆయన క్లాస్ డెరైక్టర్, నేనేమో మాస్. మరి మేమిద్దరం కలిసి సినిమా చేస్తే క్లాసూ, మాసూ రెండూ కలిసినంత కథ కావాలి. ‘బందిపోటు’లో ఆ రెండూ ఉన్నాయి. ఇందులో నేను క్లాస్‌గానే కనిపిస్తాను కానీ, చేసే పనులు మాత్రం యమా మాస్‌గా ఉంటాయి. దొంగలపైనే కన్నేసి వాళ్లను మాత్రమే దోచుకొనే కుర్రాడి పాత్ర అన్నమాట. ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్నీ ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటారు. ఇదివరకటిలా స్కూఫ్లతో కూడిన కామెడీ కాకుండా, ఇందులో సన్నివేశాల నుంచే వినోదం పుడుతుంటుంది. యాభై సినిమాలకు చేరువవుతున్న నా ప్రయాణంలో నేను చేసిన ఒక భిన్నమైన చిత్రమిది. క్లాస్ డెరైక్టర్ అయిన ఇంద్రగంటిగారు నా కోసం కొంచెం మాస్‌గా మారారు. నేను ఆయన కోసం కొంచెం క్లాస్‌గా మారాను. అందుకే అటు క్లాస్, ఇటు మాస్ అందరినీ అలరించేలా ఉంటుందీ సినిమా. మా నాన్నగారు స్థాపించిన ‘ఈవీవీ సినిమా’ సంస్థ పునఃప్రారంభం ఇలాంటి క్లీన్ ఎంటర్టైనర్తో కావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఈ సంస్థ పేరు నిలబెట్టే సినిమా అవుతుంది. ఆర్యన్ రాజేశ్: నరేశ్ సినిమాకు వచ్చినవాళ్లు నవ్వుకోవాల్సిందే. అయితే ఇటీవల తను చేసిన సినిమాల్లో రొటీన్ కామెడీనే ఎక్కువ. స్కూఫ్లపైనే ఆధారపడినట్టు అనిపించేది. అందుకే ఎలాగైనా నరేశ్ నుంచి ఓ కొత్త రకమైన చిత్రం రావాలి, తను ప్రేక్షకుల్ని కొత్తగా నవ్వించాలి, అదెలా? అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన కథే ‘బందిపోటు’. రాజేంద్రప్రసాద్ గారి సినిమాల్లో ఎలాగైతే సన్నివేశాల నుంచి కామెడీ పుడుతుందో ఆ రకమైన కథ కథనాలతో తెరకెక్కిన చిత్రమే ఇది. ఉన్నవాళ్లను దోచి... లేనివాళ్లకు పంచి పెట్టే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నరేశ్ కనిపిస్తాడు. అలాగని సినిమా సీరియస్‌గా ఉండదు. ఎత్తులు, పైఎత్తులతో చాలా సరదాగా సాగుతుంది. సంపూ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా చిత్రాన్ని తీశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. నాన్నగారు స్థాపించిన సంస్థ నుంచి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న సంతృప్తి ఉంది. ఇక నుంచి ఈవీవీ సినిమా సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించబోతున్నాం. -
అల్లరి నరేష్ ‘బందిపోటు’ స్టిల్స్
-
ఐదు కథలను కలిపే పాత్ర
ఆర్యన్ రాజేశ్, మాదాల రవి, కిరణ్, ఉత్తేజ్, చిన్నా ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నటుడు మాదాల రవి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అయిదు కథలుంటాయి. ఆ కథలను కలిపే పాత్రను నేను పోషించాను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. వెండితెరపై ఇప్పటివరకూ కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయనీ, వాటన్నింటిలో తమ సినిమా భిన్నమైందని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఆద్యంతం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని నటుడు కిరణ్ అన్నారు. -
ఐదు కథలతో హారర్
దెయ్యాలతో అనుబంధం ఉన్న ఓ అయిదుగురి కథతో రూపొందిన చిత్రం ‘పంచముఖి’. ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ప్రధాన పాత్రలుగా గల ఈ చిత్రంలో సుమన్ ప్రత్యేక పాత్ర పోషించారు. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. సుమన్, ప్రమోద్, మోహన్ బల్లేపల్లి, జయసూర్య, భాను కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అల్లరి నరేశ్ ఆవిష్కరించి, తొలి ప్రతిని మాదాల రవికి అందించారు. ఆద్యంతం అలరించే హారర్ చిత్రమిదని, ఇందులో ఓ భిన్నమైన పాత్ర పోషించానని ఆర్యన్ రాజేశ్ చెప్పారు. ‘‘ఇందులోని ప్రధానమైన అయిదు పాత్రలకీ ఒకదానికొకటి లింకు ఉంటుంది. అదే ఇందులో ఆసక్తికరమైన అంశం’’ అని దర్శకుడు చెప్పారు. ఐదు కథలు, ఐదుగురు హీరోలు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల సమాహారమే ఈ సినిమా అని నిర్మాత తెలిపారు. -
‘పంచముఖి’ సినిమా న్యూ స్టిల్స్
-
పంచముఖి మూవీ ఆడియో అవిష్కరణ
-
మా వంశోద్ధారకుడు... నాన్నే!
నేడు ఫాదర్స్ డే అమ్మ నిజమైతే... నాన్న నమ్మకం అంటారు. కానీ, నిజానికి... పిల్లలకు తమ మీద తమకు నమ్మకాన్నీ, ఎంత నష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్నీ ఇచ్చేది నాన్నే! కొండంత కష్టాన్ని కూడా గుండెల్లో దాచుకొని... ఆ ఊసే ఎత్తకుండా పిల్లల్ని బంగారంలా పెంచేదీ నాన్నే! పిల్లల కెరీర్ కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టిన ఓ తండ్రి... లేకలేక పుట్టిన పిల్లల పసితనంలోనే వసివాడిన ఓ నాన్న... ‘జీవితంలో జాగ్రత్త’ అంటూనే, విధి చేతిలో ఓడిన ఓ ‘అప్పా’... వృత్తి రీత్యా డెరైక్టర్, రైటర్, హీరో... కన్నబిడ్డలకు మాత్రం కలల్లోనే మిగిలిన దేవుళ్ళు... బిడ్డలు తన కన్నా బాగుండాలని పరితపిస్తూ... అనుక్షణం వేలు పట్టుకొని నడిపించే అలాంటి నాన్న అకస్మాత్తుగా ఆ వేలును వదిలేస్తే? అనుక్షణం నాన్న జ్ఞాపకాలతో గడుపుతున్న ఆ పిల్లలెలా ఉంటారు? అలాంటి మూడు కుటుంబాలలో... తండ్రుల గురించి వారి పిల్లల తలపోతలు... పంచుకున్న జ్ఞాపకాల కలబోతలు... ఇవాళ్టి ‘ఫాదర్స్ డే’ స్పెషల్. పరిశ్రమలో స్టార్ డెరైక్టరైనా, పిల్లలకు స్నేహితుడి లాంటి తండ్రి ఈవీవీ సత్యనారాయణ. ఆయన క్యాన్సర్‌తో కన్నుమూసి, మూడేళ్లైనా పిల్లలు రాజేశ్, నరేశ్‌లకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు కళ్లలో సుళ్ళు తిరుగుతున్నాయి. మీ నాన్న గారు ఉన్నప్పటి రోజులకీ, ఇప్పటికీ మీరు గమనించిన తేడా? నరేశ్: చాలా తేడా ఉందండీ. ఆయన ఉన్నప్పుడు మా ఇల్లు సాక్షాత్ వైకుంఠంలా ఉండేది. ఇప్పుడు దేవాలయంలా ఉంది. అంతే. ఆర్యన్ రాజేశ్: ఇల్లంతా హడావిడే. వచ్చేవాళ్లూ, పోయేవాళ్లూ.. క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్లం. ఇప్పుడా లోటును నరేశ్ భర్తీ చేస్తున్నాడు. మీ నాన్న ఈవీవీ గారిలో మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి? నరేశ్: ఉజ్జ్వలమైన భవిష్యత్తు కంటి ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని ఎవరి కోసం ఎవరూ త్యాగం చేయరు. కానీ... నాన్న అలా కాదు. కెరీర్ ఉచ్చస్థితిలో ఉండగా, అగ్రహీరోలందరూ ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉండగా.. ఆ అవకాశాలన్నింటినీ మా కోసం పక్కన పెట్టేశారు. విలువైన సమయాన్నంతా మా కోసం ఖర్చు పెట్టారు. ‘రాజేశ్నీ, నరేశ్నీ సక్సెస్ఫుల్ స్టార్లుగా నిలబెట్టాలి’ అనే లక్ష్యంతో శ్రమించారు. నన్ను హీరోగా పెట్టి 9 సినిమాలు రాజేశ్ హీరోగా మూడు సినిమాలు చేశారు. ఆర్యన్: నాన్నతో నా కన్నా నరేశ్‌కి చనువెక్కువ. ఒక ఫ్రెండ్‌గా మాతో మసలుకొనేవారు. మాకేదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేవారు. నరేశ్: లవ్లెటర్ల గురించి కూడా నాన్నతో ప్రస్తావించేవాళ్లం. ‘ఫలానా అమ్మాయి లవ్‌లెటర్ ఇచ్చింది నాన్నా!’ అంటే, ‘ఔనా. అలాంటివి వద్దు నాన్నా! ఇది కరెక్ట్ టైమ్ కాదని ఆ అమ్మాయితో చెప్పు’ అని చెప్పేవారు. మీ ఇద్దరి విషయంలో ఆయన ఆలోచనా ధోరణి ఎలా ఉండేది? నరేశ్: నాన్న తన తదనంతరం నన్ను డెరైక్టర్ని చేయాలనుకున్నారు. రాజేశ్నేమో హీరోను చేయాలనుకున్నారు. ఎందుకంటే వాడు బావుంటాడు. నేను అంత బావుండను. అందుకే నన్ను ప్రొడక్షన్లో కూడా పెట్టేశారు. ‘చాలాబాగుంది, మా ఆవిడ మీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది’ చిత్రాలకు నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను. కానీ నా దృష్టి మొత్తం నటనపైనే ఉండేది. ఓ రోజు ‘నటించాలనుంది నాన్నా...’ అని డెరైక్ట్‌గా అడిగేశాను. చివరకు నన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక రాజేశ్‌తో పాటు నన్ను కూడా దేవదాస్ కనకాలగారి ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. రాజేశ్: ‘ఇంతమందికి జీవితాన్నిచ్చిన నేను.. నా బిడ్డకు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయానే’ అని బాధపడేవారు నాన్న. నిజానికి ఆయన నాకు ‘ఎవడిగోల వాడిది’ రూపంలో భారీ విజయాన్నిచ్చారు. తర్వాత కూడా నేను బిజీ కాలేకపోయానంటే అది కేవలం విధి. చనిపోయే ముందు కూడా నాతో ‘బురిడి’ తీశారు. మా నాన్న లాంటి తండ్రులు అరుదుగా ఉంటారు. నరేశ్:‘అల్లరి’ తర్వాత నా సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. ‘వీడు వన్ సినిమా వండర్’ అనేశారంతా. కానీ... నాన్న మాత్రం కసితో ‘కితకితలు’ తీశారు. ఆ సినిమా నా కెరీర్‌కు పెద్ద బ్రేక్ అయ్యింది. మీ చిన్నతనంలో ఎప్పుడైనా నాన్న మిమ్మల్ని కొట్టారా? నరేశ్: అయిదేళ్లపాటు రాజేశ్ మా నాన్నమ్మ దగ్గరే పెరిగాడు. అందుకే నాన్నకు నేను క్లోజ్. ఆయన ప్రేమను ఎక్కువగా అనుభవించిన అదృష్టం నాదే. అందుకే ఆయనతో దెబ్బలు కూడా ఎక్కువ నేనే తిన్నాను. రాజేశ్‌ను అసలు కొట్టేవారే కాదు. వాడు నాన్నలాగే సెన్సిటివ్. ఆ విషయం నాన్నకీ తెలుసు. పైగా వాడు చెప్పిన మాట వినేవాడు. నేనేమో ‘గాలిశీను’ టైపు. అందుకే నాకు పడేవి. మీ నాన్నపై మీకెప్పుడైనా కోపం వచ్చిందా? నరేశ్: అవకాశాల కోసం నాన్న దగ్గరకు చాలామంది వచ్చేవాళ్లు. అయితే... నాన్న మాత్రం వాళ్లను ‘రేపు రండి, ఎల్లుండి రండి’ అని తిప్పించుకుంటూ ఉండేవారు. ఎందుకిలా చేస్తారని ఆయననే నేరుగా అడిగేశాను. దానికి నాన్న జవాబిస్తూ, ‘అడగ్గానే అవకాశం ఇవ్వకూడదు నాన్నా! ‘లక్... బై ఛాన్స్’ అనుకొని వచ్చే వారికి అవకాశం ఇస్తే మన మంచితనం వృథా అయిపోతుంది. వృత్తే జీవితమనుకొనేవాళ్ళు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తారు. వారికి తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అదంతా నేను పెట్టే చిన్న పరీక్ష.. అంతే’ అన్నారు. నిజానికి నాన్న ఎందరికి జీవితాన్నిచ్చారో అందరికీ తెలుసు. ఆయనపై అనుమానం రావడం నా అజ్ఞానం. తొలి సినిమా ఫ్లాపైనప్పుడు మీ నాన్న గారి మానసిక స్థితి..? రాజేశ్: ఆ టైమ్‌కి మేమిద్దరం పెద్ద పిల్లలమే. అయితే... ఆయన సమస్యలేవీ మా దాకా తీసుకొచ్చేవారు కాదు. బాధలేమైనా ఉంటే అమ్మతోనే చెప్పేవారు. మాకు ఆనందాన్నే పంచేవారు. మాకు కష్టాలను పరిచయం చేసి బాధపెట్టడం నాన్నకు ఇష్టం లేదు. నరేశ్: తొలి సినిమా ‘చెవిలో పువ్వు’ విడుదలైన రోజే నాన్న వైజాగ్ నుంచి రాజమండ్రి బయలుదేరారట. ట్రైన్ ఎక్కే ముందే సినిమా ఫ్లాప్ అని తెలిసింది. ఆశలన్నీ నేలకూలిపోయాయి. ఇక బతకడం వేస్ట్ అనుకున్నారట. ట్రైన్ గోదావరి బ్రిడ్జి మీదకు వచ్చింది. బ్రిడ్జి మీదకు జంప్ చేద్దాం అనుకునే లోపు నేనూ, రాజేష్ గుర్తొచ్చామట. ‘పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇంకో ప్రయత్నం చేస్తే తప్పేంటి?’ అనుకొని మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా జాయిన్ అయ్యారట (చెమర్చిన కళ్లతో). నాన్న గుర్తొస్తే మీకు ఏమనిస్తుంది? నరేశ్: నాన్న లేని లోటు భర్తీ అవ్వడం జరగదు. వంశాన్ని ఉద్ధరించేవాణ్ణి వంశోద్ధారకుడు అంటాం. మా వంశోద్ధారకుడు నాన్న. మమ్మల్ని అదృష్టవంతుల్ని చేసి, ఆయన అనంత వాయువుల్లో కలిసిపోయారు. చివరి ఘడియల్లో దేని గురించి ఎక్కువగా మాట్లాడేవారు? నరేశ్: క్యాన్సర్ అని తెలిసినా కంగారు పడలేదు. చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఆలోచన అంతా రాజేశ్గాడి పెళ్లి గురించే. చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ గడిపింది రాజేశే. అప్పుడు ఆయన అన్న మాట నాకింకా గుర్తు. ‘రాజేశ్గాడు ముభావంగా ఉంటాడు. వాడి మనసులోని ఆంతర్యాన్ని కనుక్కోవడం కష్టం. బయటకు చెప్పడు గానీ, వాడి మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో ఇన్నాళ్లకు తెలిసింది’ అన్నారు. అప్పుడు రాజేశ్ లేడు. రాజేశ్: నాన్నకు నా పెళ్లి చూడాలని ఉండేది. మామూలుగానే ఇంట్లో ఫంక్షన్లంటే నాన్నకు సరదా. మార్చిలో నా పెళ్లి చేసేస్తే, వెంటనే ఉగాది వస్తుంది. సంవత్సరం మారుతుంది కాబట్టి జూన్‌లో నరేశ్‌కు కూడా చేసేస్తే సరిపోతుందనుకున్నారు. కానీ ఈ లోపే క్యాన్సర్ కబళించింది. నరేశ్: మా ఇంటికి ‘డ్రీమ్ హౌస్’ అని పేరు పెట్టారు నాన్న. ‘ఎందుకు నాన్నా... ‘డ్రీమ్ హౌస్’ అని పెట్టారు, ‘ఈవీవీ నిలయం’ అని పెట్టొచ్చు కదా?’ అని అడిగాను. ‘అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద ఇళ్లు చూశాను. ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవాణ్ణి. నా కలల నిలయం కాబట్టే దీనికి ‘డ్రీమ్ హౌస్’ అని పేరు పెట్టా. నీ పిల్లలు, రాజేశ్ పిల్లలతో ఇల్లు కళకళ లాడాలి. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి’ అని చెప్పారు. బాధాకరమైన విషయం ఏంటంటే, రాజేశ్‌కి పిల్లాడు పుట్టక ముందే ఆయన కన్నుమూశారు. మా రాజేశ్ కొడుకు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అందుకే వాడికి నాన్న పేరే పెట్టాం. మా నాన్న లేని లోటును మా బుడ్డోడు తీర్చేస్తున్నాడు. - బుర్రా నరసింహ -
‘పంచముఖి’ సినిమా స్టిల్స్
-
ఐదు కథలు... ఐదుగురు హీరోలు
ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ముఖ్య తారలుగా ఆర్ట్ ఇన్ హార్ట్ పతాకంపై యార్లగడ్డ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘యథార్థంగా జరిగిన ఐదు కథల సమాహారమే ఈ సినిమా. ముఖ్యంగా ఐదు పాత్రలతో సాగుతుంది. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది. కేవలం 38 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘ఐదు కథలు, ఐదుగురు కథానాయకులు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల కాంబినేషన్లో ఈ సినిమా చేయడం విశేషం’’ అని నిర్మాత చెప్పారు. మంచి సినిమా అని మాదాల రవి, కృష్ణుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్యప్రకాశ్, సంగీతం: సుమన్-ప్రమోద్-మోహన్ బల్లేపల్లి-జయసూర్య-భాను. -
వినోదంలో కొత్తకోణం
‘వీడు తేడా’ ఫేమ్ చిన్ని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, ఆర్యన్ రాజేష్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘బొమ్మన బ్రదర్స్-చందన సిస్టర్స్’ తర్వాత మా సంస్థలో చేస్తున్న సినిమా ఇది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి, మే నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వినోదంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్: గౌతంరాజు.