Axar Patel
-
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్‌ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్‌కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్‌కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్‌ను తప్పించి మూడో సీమర్‌ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్‌కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్‌కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్‌కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపింది. ఈ క్రమంలో నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్‌ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్‌ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్‌లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది.నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్‌కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాగ్‌పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్‌లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్‌గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్‌బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్‌లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్‌లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్‌రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్‌లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్‌లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్‌స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్‌మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్‌కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్‌తో (England) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్‌మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్‌లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్‌లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్‌కు నో ప్లేస్ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్‌లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్‌లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్‌కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్‌లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌ను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్! నితీశ్‌కు చోటు? -
CT 2025: గంభీర్‌కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్‌కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్‌కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్‌కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్‌కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్‌లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. -
IPL 2025: కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే..!
భారత మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్‌కే ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్‌బజ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్‌ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అక్షర్‌కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్‌గా కూడా అక్షర్‌కు అనుభవం ఉంది. అక్షర్‌కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.డీకే ఏ ఆధారంగా అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్‌కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్‌గా సేవలందించాడు. మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.సాధారణ ఆటగాడిగా రాహుల్..?అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్‌గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. అందుకే ఆసీస్ టూర్‌కు దూరం
టీమిండియా స్టార్ క్రికెటర్ అక్షర్ పటేల్(Axar Patel) తండ్రయ్యాడు. అతడి భార్య మేహా పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్షర్ పటేల్ మంగళవారం(డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫోటోను ఈ గుజరాతీ షేర్ చేశాడు. డిసెంబర్ 19న తమ మొదటి బిడ్డకు బిడ్డకు స్వాగతం పలికినట్లు అక్షర్ వెల్లడించాడు. అదే విధంగా తమ బిడ్డకు హక్ష్ పటేల్ అని పేరు పెట్టినట్లు భారత ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.కాగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఈ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మిగిలిన రెండు టెస్టులకు అతడి స్ధానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేస్తారని అంతా భావించారు. కానీ అతడు పితృత్వ సెలవులో ఉండడంతో సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.ఈ విషయాన్ని బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ధ్రువీకరించాడు. ఇక అశ్విన్ స్ధానాన్ని ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కోటియన్తో భర్తీ చేశారు. అక్షర్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు.He's still figuring out the off side from the leg, but we couldnt wait to introduce him to all of you in blue. World, welcome Haksh Patel, India's smallest, yet biggest fan, and the most special piece of our hearts.19-12-2024 🩵🧿 pic.twitter.com/LZFGnyIWqM— Axar Patel (@akshar2026) December 24, 2024 -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
శివాలెత్తిన అక్షర్ పటేల్.. ఒకే ఓవర్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్‌లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది. AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
సౌతాఫ్రికాతో టీ20లు.. తిలక్ రీ ఎంట్రీ.. ఆర్సీబీ స్టార్ అరంగేట్రం!
టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై 3-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటాడు.సఫారీ పిచ్‌లపై అంత ఈజీ కాదుఅయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను క్లీన్‌స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్‌లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్‌ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.తిలక్ వర్మ పునరాగమనం ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు. ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.ఈసారి ఛాన్స్ పక్కా ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్‌లో అక్షర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రొటిస్‌తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్‌లో భాగంగా ఆర్సీబీ యశ్‌ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్‌మెషీన్‌కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్‌లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్‌లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్‌ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్‌లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్‌లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్‌కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్‌దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్‌రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్‌దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్‌దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
Duleep Trophy 2024: అక్షర్ ఆల్‌రౌండ్ షో..
సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్‌దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1. భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0. -
Duleep Trophy 2024: ఆదుకున్న అక్షర్ పటేల్
దులీప్ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇండియా-సితో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. THE SHOW OF AXAR PATEL. 🔥He smashed an excellent fifty when his team was 8 down on just 76 runs - AXAR PATEL, THE CRISIS MAN. 👏pic.twitter.com/ezWupOFTKQ— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఇండియా-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్‌కుమార్ వైశాఖ్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ఇండియా-డి: దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే -
విశ్వ విజేతలకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. టీమిండియా గెలుపుకు పునాది వేసిన అక్షర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్‌గా చెప్పవచ్చు. ఈ స్కోర్‌ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్‌లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్‌తో పాటు మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.