Bal Thackeray
-
షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం?
ముంబై: రెబల్ ఎమ్మెల్యేల ద్వారా శివసేన పార్టీని విభజించిన ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండే.. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం, ఏకంగా సీఎం అయిపోవడం విదితమే. అయితే.. తమదే సిసలైన శివసేన అని ప్రకటించుకున్న షిండే వర్గం.. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతోందా? బాలాసాహెబ్(బాల్‌థాక్రే) నేతృత్వంలో స్థాపించిన బడిన శివసేన ప్రధాన కార్యాలయం శివసేన భవన్.. దాదర్‌లో ఉంది. ఈ భవనంతో సంబంధం లేకుండా ఓ శివసేన భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో షిండే వర్గం ఉన్నట్లు ఊహాగాన కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు దాదర్ ప్రాంతంలోనే కొత్త భవనం కోసం వేట ప్రారంభించినట్లు, ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక కార్యాలయాలను సైతం నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనాల సమచారం. అయితే ఈ కథనాలపై షిండే వర్గం స్పందించింది. తాజాగా షిండే కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయ్ సామంత్ అదంతా ఊహాగానమే అని ప్రకటించారు. కొత్త ప్రధాన కార్యాలయం లాంటి ఆలోచనేం లేదు. బాలాసాహెబ్‌పై ఉన్న గౌరవంతో శివసేన భవనాన్నే మేం గౌరవిస్తాం. కానీ, సీఎం షిండే.. సామాన్యులతో భేటీ కోసం ఓ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నాం. బహుశా ఈ కథనాలు తెలిసి పొరపాటుగా అర్థం చేసుకుని మీడియా ఇలా ప్రచారం చేస్తుందేమో అని ఉయద్ సామంత్ వెల్లడించారు. ప్రస్తుతం శివ సేన పార్టీ ఎవరికి చెందాలనే వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోంది. తమదే అసలైన క్యాంప్ అంటూ మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే క్యాంప్‌లు పోటాపోటీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. చదవండి: మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన -
ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే వర్గంలోకి సొంత కుటుంబ సభ్యులు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్ థాక్రేకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలతో పాటు కుటుంబ సభ్యుల్లోనూ కొందరు షిండే వర్గానికి మద్దతు తెలుపుతుండటం ఉద్ధవ్‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరో షాక్ తగిలింది. బాల్‌థాక్రే మనుమడు, ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్ థాక్రే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిహార్ థాక్రేకు ఇప్పటి వరకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షిండేను కలవటం హాట్‌టాపిక్‌గా మారింది. బాల్ థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ థాక్రే కుమారుడే నిహార్ థాక్రే. బిందుమాధవ్.. 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన సినీ నిర్మాతగా ఉండగా.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే.. ఆయన కుమారుడు నిహార్.. తాజాగా షిండేను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ఉద్ధవ్ మరో సోదరుడు జైదేవ్ థాక్రే మాజీ భార్యా స్మితా థాక్రే సైతం ఇటీవలే సీఎం షిండేను కలిశారు. నిహార్ థాక్రే ఒక న్యాయవాది. ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మంత్రిగానూ సేవలందించారు. వలసలు పెరిగిన క్రమంలో షిండేపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్ధవ్ థాక్రే. తాను అనారోగ్యానికి గురైనప్పుడు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
దమ్ముంటే ఆ పని చెయ్యి.. షిండేకు థాక్రే సవాల్
ముంబై: రాజకీయ చదరంగంలో ఓడినా.. న్యాయం తమవైపే ఉందని, ప్రజాక్షేత్రంలో నెగ్గి తీరతామని మరోసారి ఉద్ఘాటించారు శివ సేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోనుందుకే ఇదంతా జరిగిందని మరోసారి సంక్షోభంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తింపు వ్యవహారం ఈసీ దగ్గర ఉన్న తరుణంలో.. తాజా ఇంటర్వ్యూలో థాక్రే మరోసారి సీఎం షిండేపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లు(రెబల్స్) నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి’’ అంటూ చురకలంటించారు. వాళ్లు శివ సేన అనే మహా వృక్షానికి పట్టిన చీడ. కుళ్లిన ఆకులు వెళ్లిపోయాయి. అయినా శివ సేనే నేలకు ఒరగదు. నా ప్రభుత్వం కుప్పకూలినా.. నా పదవి పోయినా.. నాకేం బాధ లేదు. కానీ, నా సొంత వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారన్న బాధను సహించలేకపోతున్నా. ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న సమయంలో.. కోలుకోలేని దెబ్బ వేశారు నా అనుకున్నవాళ్లే. నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎలాగైనా పార్టీని నిలబెడతాడన్న నమ్మకం అతనిపై ఉండేది. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. కుట్రకు తెరలేపాడు. ఆ నమ్మక ద్రోహికి సవాల్ చేస్తున్నా.. నీ తండ్రి ఫొటోతో ఎన్నికల్లో నెగ్గి చూపించూ.. అంటూ పరోక్షంగా షిండేపై విమర్శలు గుప్పించారాయన. తన తండ్రి తర్వాత పార్టీ చీలిపోకుండా ఉండేందుకు తాను ప్రయత్నించానని, కానీ, అయినవాళ్లే ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లను, వాళ్ల పాపులారిటీని వాడుకుని బీజేపీ లాభపడాలని ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ నుంచి సర్దార్ పటేల్‌ను ఎలాగ వాడుతుందో.. ఇప్పుడు తన తండ్రి(బాల్‌థాక్రే) విషయంలోనూ అదే పని చేస్తోందని చెప్పారు. బాల్ థాక్రేకు అసలైన వారసులం, శివ సైనిక్లం తామేనంటూ మహారాష్ట్ర సీఎం షిండే ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్దవ్ థాక్రే ఇలా తీవ్రంగా స్పందించారు. -
కూటమిలోనూ నేనే సీఎం కావాల్సింది!: సీఎం షిండే
బీజేపీ మద్దతుతో బలపరీక్షలో అలవోకగా నెగ్గిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన అనంతరం.. చనిపోయిన తన ఇద్దరు కొడుకులను తల్చుకుని సభలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారాయన. బలనిరూపణలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించే అర్హతను సంపాదించుకున్నారు ఏక్నాథ్ షిండే. పరీక్షలో 99 వ్యతిరేక ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాఢి కూటమిలోనూ సీఎంగా తన పేరే ముందుగా తెరపైకి వచ్చిందని, కానీ, ఎన్సీపీ నేత ఒకరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. సోమవారం బలనిరూపణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అజిత్ దాదా(అజిత్ పవార్‌ను ఉద్దేశించి)నో ఇంకెవరో నన్ను ముఖ్యమంత్రిని చేయకుండా అడ్డుకున్నారు. ఆ టైంలో నాకేం ఇబ్బంది లేదని, ఉద్దవ్‌తోనే ముందుకు వెళ్లాలని తాను చెప్పానని, అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నానని, సీఎం పదవి మీద తనకు ఎలాంటి వ్యామోహం షిండే వ్యాఖ్యానించారు. మేం శివ సైనికులం.. బాలాసాహెబ్(బాల్ థాక్రే), ఆనంద్ దిఘే సైనికులం మేమంతా. ఆరేళ్ల పాటు బాలాసాహెబ్‌ను ఓటు వేయకుండా నిషేధించారో మీకు గుర్తు చేయాలనుకుంటున్నా(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ..1995-2001 మధ్య) అని షిండే వ్యాఖ్యానించారు. శివ సేనను రక్షించేందుకే తాను తిరుగుబాటు బావుటా ఎగరేశారనని చెప్పారు. బాలాసాహెచ్ ఆశయాలను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని వ్యాఖ్యానించారాయన. థానే కార్పొరేటర్‌గా పని చేస్తున్నప్పుడు నా ఇద్దరు కొడుకులను కోల్పోయా. అంతా అయిపోయిందనుకున్నా. రాజకీయాలు వదిలేయాలనుకున్నా. ఆనంద్ దిఘే సాహెబ్.. నన్ను రాజకీయాల్లో కొనసాగాలని కోరారు అంటూ సీఎం షిండే గుర్తు చేసుకుంటూ గద్గద స్వరంతో ప్రసంగించారు. #WATCH | Maharashtra CM Eknath Shinde breaks down as he remembers his family in the Assembly, "While I was working as a Shiv Sena Corporator in Thane, I lost 2 of my children & thought everything is over...I was broken but Anand Dighe Sahab convinced me to continue in politics." pic.twitter.com/IVxNl16HOW — ANI (@ANI) July 4, 2022 -
Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా. తొలి కేసు ఇందిరదే పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్ (ఐ)కి హస్తం గుర్తు లభించింది. తాజా వివాదాలు... గత అక్టోబర్‌లో బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి (రామ్‌విలాస్ పాశ్వాన్) పేరుతో, హెలికాప్టర్ గుర్తుతో; పరాస్ వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పేరుతో, కుట్టు మిషన్‌తో పోటీ చేశాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తు ఆయనకే దక్కింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’ సంక్షోభం.. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!
ముంబై: శివసేన పార్టీలో అగ్రశ్రేణి నాయకుడు, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఏక్నాథ్ శిండే హఠాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో ఇటు శివసేన పార్టీలో, అటు ప్రభుత్వ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనాలు ఏర్పడ్డాయి. శివసేన పార్టీకి మొదట్నుంచి ఎంతో నిష్టావంతుడైన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక కారణాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. బాలాసాహెబ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడైన ఏక్నాథ్ శిండే అసంతప్తికి గురికావడానికి, తిరుగుబాటు చేయడానికి కారణం తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవి మధ్యలో ఉద్ధవ్ ఠాక్రే రావడం వల్ల చేజారిపోయిందని భావించటం ఒకటైతే, హిందూత్వ పార్టీగా పేరుపొందిన శివసేన, బాలాసాహెబ్ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్‌లాంటి బాలాసాహెబ్ ఠాక్రే వ్యతిరేక పార్టీలతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రెండవది అని కొందరు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. శరద్ పవార్ దౌత్యం ఫలించి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టిన మొదట్లో ఏక్నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారని అనుకున్నారు. ఏనాడూ ప్రభుత్వ పదవుల్ని ఆశించని ఠాక్రే కుటుంబం అకస్మాత్తుగా పదవిని ఆశించడం షిందేకు తీవ్ర నిరాశను కలిగించింది. ముఖ్యమంత్రి కావాల్సిన తనకు మంత్రి వర్గంలో సైతం తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతో లోలోన తీవ్ర అసంతప్తికి గురయ్యాడనీ కొందరు సన్నిహితులు చెబుతున్నారు. సంబంధిత వార్త: ఉద్దవ్ థాక్రేపై ఫడ్నవీస్ భార్య ట్వీట్! నిధులివ్వకుండా అవమానించారు.. హిందుత్వకు ప్రతీకగా పేరుపొందిన శివసేన పార్టీ అవకాశవాద పార్టీగా మారిందని, పదవుల కోసం బాలా సాహెబ్ సిద్ధాంతాలను మంటగలుపుతోందనీ, సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మీడియాలో వస్తున్న విమర్శలు కూడా ఏక్నాథ్ షిండేను ఆందోళనకు గురిచేశాయంటారు. ఆర్థిక మంత్రిగా ఎన్సీపీకి చెందిన వ్యక్తి ఉండడం వల్ల కూడా అవసరమైన నిధుల్ని విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం కూడా షిందే అసంతప్తికి మరోకారణంగా చెబుతున్నారు. తనను ఫ్లోర్ లీడర్ పదవి నుండి తొలగించడంపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రే శిష్యుడినేననీ, నిఖార్సయిన శివసైనికుడినని.. పదవుల కోసం తిరుగుబాటు చేయడం బాలాసాహెబ్ తనకు నేర్పలేదనీ.. హిందుత్వం కోసమే తాను తిరుగుబాటు చేస్తున్నాననీ.. శివసేన సిద్ధాంతాలను నమ్ముకున్న 35 మంది శాసన సభ్యులు తన వెంట ఉన్నారనీ’ చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా, తాను తిరిగిరావాలంటే, శివసేన పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు తెంపుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా కండిషన్ విధించాడు. సంబంధిత వార్త: ‘మహా’లో మరో ట్విస్ట్.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కరోనా పాజిటివ్ తాజా సమాచారం ప్రకారం షిండేను బుజ్జగించేందుకు ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే కూడా రంగంలోకి దిగారు. ఆమె ఏక్నాథ్ శిండేతో మాట్లాడారనీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా శిండేతో మాట్లాడారనీ తెలిసింది. ఏక్నాథ్ షిండేతో మాట్లాడేందుకు ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు దూతల్ని సూరత్ పంపిస్తున్నట్లుగా సమాచారం. ఈ తిరుగుబాటు వెనక బీజేపీ హస్తమున్నట్లుగా కొందరు శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా బుధవారం సాయంత్రానికి పరిణామాలపై స్పష్టత రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందిదీ.. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్ధానాలున్నాయి. అందులో బీజేపీ–106, శివసేన–56, ఎన్సీపీ–53, కాంగ్రెస్–44, ఎంఐఎం–2, ఆర్ఎస్పీ–1, జేఎస్ఎస్–1, ఇండిపెండెంట్లు, ఇతరులు–24 (శివసేనకు చెందిన ఓ స్ధానం ఖాళీ ఉంది) ఇలా బలాబలాలున్నాయి. ఈ నెల 10న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు గెలిచారు. తాజాగా సోమవారం జరిగిన విధాన్ పరిషత్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఐదుగురు అభ్యర్ధులను గెలిపించుకుని మహా వికాస్ ఆఘాడి ప్రభు త్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ముఖ్యంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఇతరుల బలమున్నప్పటికీ కేవలం 52 ఓట్లు పోలయ్యాయి. అదే బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ 134 ఓట్లు పోల్ అయ్యాయి. దీన్ని బట్టి బీజేపీకి 134 మంది సభ్యుల బలముందని స్పష్టమవుతోంది. మెజార్టీ నిరూపించుకోవాలంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఏక్నాథ్ షిండేసహా ఆయన మద్దతుదారులు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో ప్రవేశిస్తుండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయే ఆస్కార ముంది. దీంతో మంగళవారం శివసేన పార్టీ కార్యాలయమైన సేన భవన్‌కు ఎమ్మెల్యేలందరు వెంటనే హాజరు కావాలని ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. కాని సేనా భవన్‌లోకి షిండే వర్గం మినహా కేవలం 21–24 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలిసింది. -
అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: గుజరాత్లో గోద్రా అల్లర్ల తరువాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ‘గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే ఆద్వానీ ఓ ర్యాలీ కోసం ముంబై వచ్చారు. అప్పుడు బాలా సాహెబ్‌తో మాట్లాడుతూ.. మోదీని తొలగించాల్సి ఉంటుందా అని అడిగారు. దీనిపై బాలా సాహెబ్ స్పందిస్తూ.. లేదు అతని జోలికి వెళ్లకండి. ‘మోదీ గయాతో గుజరాత్ గయా’(మోదీ పోతే, గుజరాత్ పోయినట్లే) అని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. కానీ మేము హిందుత్వానికి మద్దతు ఇచ్చాం’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి కూడా మోదీతో సత్సంబంధాలు ఉన్నాయని, కానీ దానర్థం పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మసీదుల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై శివసేన వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖల్యు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్‌లాగే మహారాష్ట్రలో త్వరలో ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని తెలిపారు. ‘ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వెళ్లాలంటే కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి రాకూడదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకోకూడదు. రాజకీయ నాయకులు చేసిన దానికి అధికారులు భయపడుతున్నారు. ప్రధాని దేశం మొత్తానికి. ఆయన దేశ శత్రువులతో పోరాడాలి. అదే విధంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రేపై సీఎం విరుచుకుపడ్డారు. కొంతమంది ఎప్పటికీ జెండాలు మారుస్తూనే ఉంటారని విమర్శించారు. ‘ముందుగా వారు మరాఠీయేతరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో హిందువేతరులపై దాడులు చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాలం. ఇది పని చేయకుంటే ఇంకొకటి. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఒక మతం గురించి చెప్పిందని నేను అనుకోను. మార్గదర్శకాలు అన్ని మతాలకు వర్తిస్తాయి’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. చదవండి: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్ వైన్ -
అమిత్ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్‌లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు. స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు. ‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు. చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్‌ని ఎత్తి వ్యాన్‌లో వేశారు శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్ నాగ్‌పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు. అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
పొలిటీషియన్ మనవడితో డేటింగ్: స్పందించిన నటి!
బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ కూతురు అలయ ప్రేమలో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రేతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు రహస్య ప్రేమలో మునిగి తేలుతున్నారని కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తమ మధ్య ఉన్నది వండర్ఫుల్ స్నేహం మాత్రమేనని స్పందించింది అలయ. ఐశ్వరీ ఒక అద్భుతమైన స్నేహితుడు అని అభివర్ణించింది. ఐశ్వరీకి, తనకు మధ్య ఏదో ఉందంటూ వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవద్దని సెలవిచ్చింది. మొదట్లో ఈ వార్తలు చూసి తన బంధుమిత్రులు ఆశ్చర్యపోయారని, కానీ రానురానూ వాళ్లకు కూడా అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది. కాగా అలయ, ఐశ్వరీ.. ఇద్దరూ ఒకరి బర్త్‌డేకు మరొకరు హాజరవుతూ, కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఫిక్సయ్యారంతా. అయితే అలయ తల్లి పూజా కూడా ఈ గాసిప్‌ను ఖాతరు చేయలేదు. ఇలాంటి పుకార్లు చాలా చూశానని లైట్ తీసుకుంది. అయినా నటీమణులకు కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కుంది అంటూ తన కూతురి లైఫ్, తనిష్టమని స్పష్టం చేసింది. చదవండి: ‘ఇది చాలా చిన్న విషయం, మరి ప్రజలు అంగీకరిస్తారో లేదో’ -
అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం కార్యక్రమం ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గుడి శంకుస్థాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దీని కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పోరాటం కొనసాగించిన శివసేనను శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా పెట్టడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 5న జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోనే కీలక ఘట్టానికి తమను ఆహ్వానించలేదని సేనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి) బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను భుజనాకెత్తుకున్న శివసేన మొదటి నుంచీ రామాలయ నిర్మాణం కోసం పాడుపడిందని, దేశంలోని హిందువుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు బాల్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో రామాలయ నిర్మాణం కొరకు న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేశామంటారు. హిందుత్వ ఎజెండానే ధ్వేయంగా పురుడుపోసుకున్న శివసేనకు తొలుత నాయకత్వం వహించిన బాల్‌ఠాక్రే కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలో శంకుస్థాపన సందర్భంగా శివసేన సీనియర్ నేతలు, బాల్‌ఠాక్రే సహచరులు చంద్రకాంత్ ఖైరే, సూర్యకాంత్ మహడీక్, విశ్వనాథ్, విజయ్ దరువాలే వంటి నేతలు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించారు. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) ‘మహారాష్ట్ర రాజకీయాలను కను సైగలతో శాసించిన బాలా సాహేబ్.. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహరీ వాజ్‌పేయీలతో కలిసి మందిర నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేతలో కరసేవలతో పాటు, శివసేన కార్యకర్తలు, నేతల పాత్ర ఎంతో ఉంది. ఆ కేసు విచారణలో భాగంగా సీబీఐ మొదటిసారి నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో 48 మంది పేర్లు ఉంటే వారిలో బాల్‌ఠాక్రేతో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణం కొరకు ఠాక్రే తన చివరిశ్వాస వరకూ పోరాటం చేశారు. ఆయన మరణం అనంతరం బాల్ ఠాక్రే బాటలోనే ఉద్ధవ్ నడిచారు. బీజేపీతో రాజకీయ పరమైన దోస్తీ కొనసాగిస్తూనే.. అయోధ్య కోసం కొట్టాడారు. కోర్టుల్లో కేసుల విచారణ సాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని ఠాక్రే అనేకసార్లు డిమాండ్ చేశారు. (భారీగా ఆలయ నిర్మాణం) వేయిమంది సేన కార్యకర్తలతో ఉద్ధవ్ అయోధ్యలో సైతం పర్యటించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణాల నేపథ్యంలో శివసేనపై బీజేపీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బీజేపీ తమను తక్కువ అంచనా వేయడం కారణంగానే సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ శివసేన హిందుత్వ ఎజెండా మాత్రం ఎప్పటికీ మారదు. రామాలయ నిర్మాణ శంకుస్థాపక కార్యక్రమానికి ఠాక్రేను ఆహ్వానించకపోవడం నిజంగానే అవమానం. తాను చేసిన కృషి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు. అయోధ్య పోరాట చరిత్రలో మమ్మల్ని ఎప్పటికీ తొలగించలేరు’ అని పేర్కొన్నారు. -
స్మారక నిర్మాణం కోసం చెట్లను నరకొద్దు: సీఎం
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఔరంగబాద్ మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో తాజాగా చెట్లను నరికి వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని ఈ మేరకు ఖైరే పేర్కొన్నారు. ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సుప్రియా సూలే భావోద్వేగ పోస్టు
ముంబై : మరికొద్ది గంటల్లో మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడి’ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. గత వారం రోజులుగా ‘మహా’ రాజకీయంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, శివసేన నేత సంజయ్ రౌత్, చాకచాక్యంగా పావులు కదిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ఉద్దవ్ ఠాక్రే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే ట్విటర్లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఉంచారు. ఉద్దవ్ ఠాక్రే తల్లిదండ్రులైన బాల్ ఠాక్రే, మీనాతాయ్ ఠాక్రే(మా సాహెబ్) లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా.. ఈ రోజు మాత్రం ఇక్కడే ఉంటారని అన్నారు. బాలా సాహెబ్, మా సాహెబ్‌లు తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని ఆమె తెలిపారు. నా జీవితంలో వారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని.. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని తెలిపారు. కాగా, మొన్నటివరకు పవార్, ఠాక్రే కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. వారి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. -
ఉద్ధవ్ స్టైలే వేరు..
ముంబై: తండ్రి బాల్ ఠాక్రే, మామయ్య రాజ్ ఠాక్రేల్లో ఉన్న చరిష్మా లేదు, వారిద్దరిలా అనర్గళ ఉపన్యాసకుడు కూడా కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. క్షేత్రస్థాయిలో శివసేనను నిలదొక్కుకునేలా చేయడంలో సఫలీకృతం అయ్యాడు. అంతేకాదు హిందుత్వ భావజాలమున్న శివసేనను బుద్ధిస్టు దళితులకూ, హిందీ మాట్లాడేవారికీ చేరువయ్యేలా చేయడంలో కృతకృత్యుడయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు కొందరిని అంచనావేయడంలో పొరబడే ప్రమాదం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే విషయంలో అదే జరిగిందని భావించొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేని సంకుచితవాదిగా అంతా భావిస్తారు. కానీ నిజానికి విశాల భావాలున్న వ్యక్తి. తనపై ఉన్న అపోహని తొలగించుకొని ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. దూకుడు స్వభావం కలిగిన శివసేన భావజాలాన్ని బట్టి ఉద్ధవ్ ఠాక్రేని అలా అంచనావేసి ఉండవచ్చు. కానీ దగ్గర్నుంచి చూసినవాళ్లు ఠాక్రే స్టైలేంటో సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. స్వభావ రీత్యా, అనుభవం రీత్యా బాల్ ఠాక్రే వారసుడు, శివసేన పార్టీ నడపగలిగిన వాడు రాజ్ఠాక్రేనేనని అంతా భావించారు. అయితే మృదుస్వభావి, విశాల స్వభావం కలిగిన ఉద్ధవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం సొంత మామ రాజ్ ఠాక్రేతో తలపడాల్సి వచ్చింది. - బాల్ ఠాక్రే మీనా థాయ్‌ల కుమారుడు ఉద్దవ్ ఠాక్రేకు వైల్డ్ లైఫ్ అన్నా ఫొటోగ్రఫీ అన్నా ఆసక్తి. - ఉద్ధవ్‌కి ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో మిలింద్ గునాజీ ఒకరు. తండ్రి బాల్ ఠాక్రేలా, రాజ్ ఠాక్రే మాదిరిగానే ఉద్ధవ్ కూడా తొలుత కార్టూనిస్టే. ఆ తరువాత ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరిగింది. - 1960లో జన్మించిన ఉద్ధవ్ ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వరై్టజింగ్ ఏజెన్సీని స్థాపించారు. 1985లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు. - 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. - 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు. - 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు. - 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అంత మోదీ గాలిని సైతం తట్టుకొని 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. దీంతో బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాల్సి వచ్చింది. - 2019 ఎన్నికల్లో మాత్రం ముంబైలో తనకున్న పట్టునేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఉద్ధవ్ సిద్ధపడలేదు. ఫలితంగా బీజేపీయేతర పార్టీల మద్దతు కోరి, శివసేన లక్ష్యసాధనలో దాదాపు సఫలీకృతం అయ్యింది. కూటమి ప్రభుత్వంలో ఉద్ధవ్‌కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. దీంతో మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న పొత్తుకి ఫుల్ స్టాప్ పడినట్లయింది. -
ఆదిత్య ఠాక్రే ఆస్తులివే..
ముంబై : శివసేన యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ఠాక్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్‌ఠాక్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠాక్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి. -
‘సోనూ నిగమ్‌ను చంపాలని చూశారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నిలేశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ను శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే చంపాలని చూశారని ఆరోపించారు. దీనికోసం పలుమార్లు ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. అసలు బాల్‌ఠాక్రే, సోనూ నిగమ్ కుటుంబాలు మధ్య సంబంధం ఏమిటని తనను అడగవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన పార్టీ నాయకుడు వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. నారాయణ్ రాణేపై పలు వ్యాఖ్యలు చేశారు. వినాయక్‌ను ఉద్దేశించే నిలేశ్ ఈవిధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలస్తోంది. ఇంకా నిలేశ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎప్పుడు బాల్‌ఠాక్రేను రాజకీయ విషయాల్లో తప్పుపట్టలేదు. కానీ కొందరు మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేస్తే నేను కూడా కొన్ని విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. శివసేనలో ఉన్నప్పుడు నారాయణ్ రాణే ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. ఆయన కుటుంబం శివసేనకు దూరమైంది. -
‘థాకరే’ బయోపిక్కు సెన్సార్ అడ్డంకులు
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలోని ఆరు డైలాగులు, రెండు సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. సీబీఎఫ్సీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించుకుంటామని చిత్ర బృందం పేర్కొంది. చట్టబద్ధంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను ఎదుర్కొంటామని, సమస్యను పరిష్కరించుకంటామని చిత్ర నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా చిత్ర ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం.ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృతారావు మీనా థాకరే పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 23న బాల్ థాకరే జయంతి సందర్భంగా థాకరే మూవీ విడుదలవుతోంది. -
బాల్‌ఠాక్రే సమాధి నుంచి లేచొస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే నిజ జీవితం ఆధారంగా తీస్తున్న ‘బాల్ ఠాక్రే’ సినిమాలో టైటిల్ పాత్రను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పోషించడం పట్ల ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ముస్లిం మైనారిటీలను వ్యతిరేకించిన బాల్ ఠాక్రే పాత్రలో ఓ ముస్లింను ఎలా తీసుకున్నారని ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం బాల్ ఠాక్రేకే తెలిస్తే ఆయన సమాధి నుంచి లేచొస్తారని మరి కొందరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మరాఠీలకే ఉపాధి అవకాశాలు ఉండాలంటూ పోరాడిన బాల్ ఠాక్రే యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి ముంబై నగరానికి ప్రజల వలసలను, ముఖ్యంగా మైనారిటీల వలసలను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి జీవిత కథను తెరకెక్కిస్తూ ఓ మైనారిటీ ముస్లింను, అందులోనూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటుడిని తీసుకోవం ఏమిటని వారు విమర్శించారు. మరాఠీ నటులను ఎందుకు ఎంపిక చేయలేదని వారు ప్రశ్నించారు. యూపీ, బీహార్ నుంచి ప్రజల వలసలను వ్యతిరేకిస్తూ బాల్ ఠాక్రే కొన్నిసార్లు విధ్వంసకర ఆందోళనలకు కూడా దిగారు. హిందూ ఛాందసవాద నాయకుడి పాత్రకు ఓ ముస్లిం నటుడిని తీసుకోవడం పట్ల కొందరు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఠాక్రే పాత్రలో ముస్లిం చూపించడం ఎంత చల్లని మాటని కొందరంటే ‘ఆహా! ఏమి వైరుధ్యవైవిధ్యము’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఠాక్రే పాత్ర కోసం యూపీ నుంచి సిద్దిఖీని తీసుకున్నట్టే బీహార్ నుంచి రవి కిషన్‌ను తీసుకుంటే తానింకా ప్రశాంతంగా మరణిస్తానని ఒకరు వ్యాఖ్యానించారు. ఠాక్రేను తెరపై చూపించడం ఇదే మొదటిసారి కాదని, ఓ ముస్లింను ఆయన పాత్రలో చూపించడం ఇదే మొదటిసారని, దాన్ని తాను హదయపూర్వకంగా హర్షిస్తున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ తన జర్నలిస్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సిద్దిఖీ ‘బాల్‌ఠాక్రే’ చిత్రంలో ఠాక్రేగానే కాకుండా దేశ విభజన సందర్భంగా జరిగిన సంఘటనలపై గుండెలను మండించే కథలను రాసిన ‘సాదత్ హసన్ మంటో’ బయోపిక్‌లో కూడా మంటోగా నటిస్తున్నారు. ‘బాల్ ఠాక్రే’ సినిమా షూటింగ్ మొన్న అంటే, గురువారం సాయంత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సినిమాకు శివసేన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ స్క్రీన్‌ప్లే రచించగా, 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొద్దకాలంపాటు నవ నిర్మాణ సేనలోకి వెళ్లి వచ్చిన శివసేన సభ్యుడు అభిజిత్ ఫాన్సే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. -
ఠాక్రే నాకు ప్రాణం పోశారు : అమితాబ్
సాక్షి, ముంబయి : తనకు ప్రమాదం జరిగినప్పుడు శివసేన అధినేత దివంగత నేత బాల్ ఠాక్రే తన ప్రాణాలు రక్షించారని బాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. కూలీ చిత్ర షూటింగ్ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని, అప్పుడు శివసేన అంబులెన్స్ సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిందని అన్నారు. 'అప్పుడు బాగా వర్షం పడుతోంది. అంబులెన్స్‌లు లభించే పరిస్థితి లేదు. చివరకు సేన అంబులెన్స్ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది' అని అమితాబ్ అన్నారు. బాల్ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం 'ఠాక్రే' షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఠాక్రే నాకు నా కుటుంబంలాగే. బోఫోర్స్ కుంభకోణం సమయంలో నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తనకు అండగా ఉన్నారు. ఠాక్రే చనిపోవడానికి ముందు కూడా ఆయనను చూసేందుకు నన్ను ఉద్దవ్ అనుమతించారు. ఆ సమయంలో నేను ఉద్దవ్ కుమారుడు ఆదిత్యతో ఠాక్రేకు చికిత్స జరుగుతున్న గదిలో ఉన్నాను. ఆయనను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను' అంటూ అమితాబ్ బావోద్వేగానికి లోనయ్యారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ 'ఠాక్రే' చిత్రానికి సంగీతం అందిస్తుండగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీ జనరల్ సెక్రటరీ అభిజిత్ పన్సే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఠాక్రేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. -
బాల్థాకరేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ
సాక్షి, న్యూఢిల్లీ: బాల్‌థాకరే బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టైటిల్ రోల్ పోషించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్ లాంఛ్ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూడనున్నాయి. అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఫస్ట్‌లుక్ లాంఛ్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిధిగా హాజరవనున్నారు. ఈ బయోపిక్కు రాజ్యసభ ఎంపీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్ర్కిప్ట్ సమకూర్చుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై సంజయ్ రౌత్ పనిచేస్తున్నారు. బాల్ థాకరేతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసని, వీటిని ప్రజారంజకంగా తెరకెక్కిస్తానని రౌత్ చెప్పారు. బాల్ థాకరే కుటుంబ సభ్యులు సహా ఏ ఒక్కరి జోక్యం లేకుండా మూవీని వాస్తవాల ఆధారంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. -
గాంధీ, మోదీ.. ఓ కార్టూన్..!
ముంబై: మహత్మాగాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీపై వినూత్న రీతిలో విమర్శలు సంధించారు. మాటల్లో కాకుండా.. కార్టూన్ రూపంలో మోదీని టార్గెట్ చేశారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ పక్కపక్కనే నిల్చుని ఉన్న ఒక కార్టూన్‌ను తన ఫేస్బుక్ పేజ్‌లో అప్లోడ్ చేశారు. ఆ కార్టూన్లో గాంధీ చేతిలో ఆయన ప్రసిద్ధ ఆత్మకథ ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’(సత్యంతో నా ప్రయోగాలు) అని మరాఠీలో ఉన్న పుస్తకం ఉండగా.. మోదీ చేతిలో ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ లైస్(అసత్యాలతో నా ప్రయోగాలు) అనే పుస్తకం ఉంటుంది. కార్టూన్ పై భాగంలో ‘ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు’ అనే కాప్షన్ ఉంటుంది. గతంలో బాల్‌ఠాక్రే నేతృత్వంలో వచ్చిన మార్మిక్ పత్రికలో రాజ్ ఠాక్రే కార్టూన్లు విరివిగా వచ్చేవి. -
బీజేపీతో పొత్తువల్లే నాశనమయ్యాం!
ముంబై: బీజేపీతో గత 25 ఏళ్లుగా కొనసాగించిన పొత్తు వల్ల శివసేన పార్టీ బాగా చితికిపోయిందని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. చాలాకాలం నుంచి మిత్రపక్షాలుగా కొనసాగిన ఈ రెండు పార్టీలు 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధికార ప్రతికలైన ‘సామ్నా’ (మరాఠీ), దోపహర్ కా ‘సామ్నా’ (హిందీ)కు ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ-శివసేన పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘25 ఏళ్లు అంటే రెండు తరాలు మనం చేతిలో చేయి వేసి ముందుకుసాగాం. మనం సొంతబలంతోనే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లం. కానీ బీజేపీతో పొత్తు వల్ల నాశనమైపోయాం’ అని ఠాక్రే పేర్కొన్నారు. మంగళవారం తన 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాద దృక్పథంతో భావజాల ఐక్యత పరంగానే బాల్ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇందులో ఎలాంటి ప్రేరణగానీ, స్వల్పకాలిక ప్రయోజనాలుగానీ లేవని, బాల్ ఠాక్రే ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదని చెప్పారు. -
అతను మా నాన్న కొడుకు కాదు: జయ్ దేవ్ ఠాక్రే
ముంబై: ఆస్తి కోసం కోర్టుకెక్కిన బాల్ ఠాక్రే కుమారుడు జయ్ దేవ్ ఠాక్రే కేసును గురువారం ముంబై హైకోర్టును మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన మాజీ భార్య స్మిత తనయుడైన జయ్ దేవ్ ఠాక్రే, ఐశ్వర్య ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు కాదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో కొంతభాగాన్ని మాత్రమే ధర్మాసనం మీడియాకు అనుమతినిచ్చింది. మిగిలిన విచారణను జస్టిస్ పటేల్, ఇరువైపులా లాయర్లతో కలిసి సమావేశమయ్యారు. తుది తీర్పు వెలువడే వరకు చర్చకు సంబంధించిన వివరాలను మీడియాకు అందుబాటులో ఉండవని ప్రకటించారు. కేసు విచారణలో భాగంగా ప్రస్తుత శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్ ఠాక్రే తరఫు లాయర్ రోహిత్ కపాడియా జయ్ దేవ్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. జయ్ దేవ్ కు ఆస్తిపై ఎటువంటి హక్కూలేదని, తన ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాల్ ఠాక్రే వీలునామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఐశ్వర్యకు ఠాక్రే నుంచి వారసత్వ సంపద దక్కడంపై జయ్ దేవ్ కోర్టుకెక్కారు. బాంద్రాలోని మఠోశ్రీ బాల్ ఠాక్రే నివాసంలో 2004కు ముందు రెండో అంతస్తులో తాను నివసించినట్లు జయ్ దేవ్ తెలిపారు. మొదటి అంతస్తులో ఎవరు నివసించేవారు? అని లాయరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎప్పుడూ తలుపుల మూసేసి ఉండేవని, అప్పుడప్పుడు తెరచి ఉండేవని చెప్పారు. బాల్ ఠాక్రేను ఈ విషయం గురించి అడుగగా ఐశ్వర్య ఉంటున్నాడని చెప్పారని తెలిపారు. మరి ఐశ్వర్యను బాల్ ఠాక్రే తన తనయుడని మీకు చెప్పారా? అని లాయరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన జయ్ దేవ్ ఆయన అలా చెప్పలేదని తెలిపారు. ఐశ్వర్యకు సంబంధించిన వివరాలను తాను సేకరించాలని ప్రయత్నించానని కానీ అవకాశం రాలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గత విచారణల్లో 1999లో తల్లి స్మితతో మనస్పర్దలు రావడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. 2004లో ఠాక్రేతో విడాకులు తీసుకునేంత వరకూ స్మిత మఠోశ్రీలోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. 1999-2004 మధ్య కాలంలో అప్పుడప్పుడు తన తండ్రి ఠాక్రేను కలిసేందుకు వెళ్లి రాత్రికి తిరిగి తన ఫ్లాట్ కు చేరుకునేవారని తెలిపారు. 2012 నవంబర్ లో ఠాక్రే మరణించే ఒక నెల ముందు వరకూ ఆయన్ను కలవడం ఆపలేదని చెప్పారు. -
తెగుతున్న పొత్తు బంధనాలు
బాల్‌థాక్రే నోట్లోంచి మాట ఊడిపడటం చాలు.. ఆయన నివాసానికి ప్రమోద్ మహాజన్ పరుగెత్తుకెళ్లి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాంటిది ‘మమ్మల్ని కాస్త గౌరవించండి’ అంటూ ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది. భారతీయ జనతాపార్టీ ఇప్పుడు దేశంలో ప్రాబల్య పార్టీగా ఉన్నప్పటికీ (కాంగ్రెస్ ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అంతిమ పత నంలో ఉన్నట్లు స్పష్టంగానే కనబడు తోంది), భారత్ ప్రాంతీయ శక్తుల అధికార పట్టులో ఇరుక్కుని పోయి ఉంది. దేశంలోనే అతి ప్రాచీన ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తమిళనాడులో తన సొంత బలంతోటే అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. దాని ప్రత్యర్థి ఏఐడీఎంకేది కూడా అదే చరిత్రే. ఈశాన్య ప్రాంతంలో 1980లలో ఏర్పడిన అసోం గణ పరిషత్ అస్సాంని పాలించడం మనం చూసే ఉన్నాం. ఇక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, దాని వైరి పక్షం బహుజన్ సమాజ్ పార్టీ తమవంతు పాలన సాగించాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్లో రెండో దఫా పాలనలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లోనూ గెలుపు సాధిం చింది. కొత్త రాష్ట్రం తెలం గాణలో తెరాస అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, 1966 జూన్ 19న ఉనికిలోకి వచ్చిన శివసేన రాష్ట్ర లేక పార్ల మెంటరీ ఎన్నికల్లో గానీ లేదా ప్రత్యేకించి తనకు గుండెకాయ లాంటి ముంబైలో స్థానిక ఎన్ని కల్లోగానీ ఇలాంటి గెలు పును ఎన్నడూ సాధించలేకపోయింది. హిందుత్వ పునాది పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఇది బీజేపీతో భాగం పంచుకోవలసివచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు విచ్ఛిన్నమై పోయింది. ఆదివారం సాయంత్రం శివసేన పార్టీ నిర్వహించిన 50వ ఆవిర్భావ వార్షికోత్సవం దాని రెండో తరం అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రసంగానికి మాత్రమే పరిమితమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో కనిపించే అట్టహాసం, ఆడంబరం ఈసారి కనిపిం చలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎలాంటి భారీ బహిరంగ సభ లకు పథక రచన చేయడం, నిర్వహించడం జరగలేదు. ఎందు కంటే ఇపుడు కూడా ఆ పార్టీ తన పంథా విషయంలో అనిశ్చితి లోనే ఉంది. పాత భాగస్వామితో పోరాటం, తర్వాత కొత్త ప్రభు త్వంలో అవమానకరంగా సర్దుకునిపోవలసి రావడంతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఆనాడు మహారాష్ట్రలోని 62 జౌళి మిల్లులు, అనేక పారి శ్రామిక విభాగాల్లో ఎక్కువమంది మరాఠా కార్మికులే ఉన్న ప్పటికీ, ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల హక్కుకు భద్రత కలి గించే లక్ష్యంతో శివసేన ఒక సంస్థగా ఏర్పడ లేదు. స్థానికులకు హక్కులు అనేవి వైట్ కాలర్ ఉద్యోగాల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. మరాఠీ జనాభాలో ఇది ప్రతిధ్వనించేది. దీనివల్ల ఈ పార్టీ నగర కేంద్రకంగానే ఉండిపోయింది. ఆ స్థితి నుంచి శివ సేన బయటపడలేక పోయింది కూడా. నెమ్మదిగా, పురపాలక రాజకీయాల్లో కాలుమోపటం ద్వారా శివసేన రాజకీయ పార్టీగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ లోకి దాని ప్రవేశం చాలా సమయం తీసుకుంది. విజయాలు కూడా అంత సులువుగా రాలేదు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే, శివసేన ప్రత్యేకించి పురపాలక ఎన్నికల్లో ఒకటి లేక ఎక్కువ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. ప్రాంతీయ పార్టీ శక్తిని ఇదేమంతగా వివరించదు. పైగా, తనకు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఆకాంక్షలేవీ లేవని శివసేన స్పష్టం చేసింది. హిందుత్వను శివసేన పూర్తిగా బలపరుస్తున్న కారణంగా, అప్పట్లో అతి చిన్న పార్టీగా ఉన్న బీజేపీ మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. శివసేనతో భాగస్వామ్యం లేనిదే అతల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని కాలేరు కాబట్టి శివసేన పెద్దన్న వైఖరిని జీర్ణం చేసుకోవాల్సి ఉంటుందని ప్రమోద్ మహాజన్ బీజేపీ కార్యకర్తలకు పదే పదే ఉద్బోధించడాన్ని ఎవరైనా గుర్తుకు చేసుకోవచ్చు. ఆవిధంగా ఇరుపార్టీల మధ్య పొత్తు కొనసాగింది. మహా రాష్ట్రలో ఈ కూటమి 1995లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల్లో ప్రాంతీయపార్టీకి, పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీకి అనుకూలంగానే అన్ని వేళల్లో సీట్ల పంపిణీ జరిగేది. నరేంద్ర మోదీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పుడు మినహా బీజేపీ తక్కిన అన్ని వేళలా జూనియర్ భాగస్వామిగానే వ్యవహరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సాధించిన ఘనవిజయంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇకనుంచి ఒంటరిగానే పోరుకి దిగాలన్న ఆకాంక్ష బీజేపీలో బలపడిపోయింది. యాభయ్యవ వార్షికోత్సవం సందర్భంగా, పురపాలక ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలన్న విషయంపై శివసేన ఆలోచిస్తోంది. బీజేపీ కూడా ఇలాగే భావిస్తోంది. మహా రాష్ట్రలో అధికారంలోకి వచ్చి వార్షికోత్సవం జరుపు తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర విభాగం రణగొణ ధ్వనులు చేస్తున్నప్పటికీ ఇకనుంచి మనం ఒంటరి గానే తలపడదామంటూ స్థానిక నేతలు పట్టుబడు తుండటం గమనార్హం. శివసేన ప్రస్తుతం కపటవైఖరితో ప్రదర్శిస్తున్న అనిశ్చితి పట్ల బీజేపీ మరింత కఠిన వైఖరితో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరడానికి ముందు శివసేన ఆడిన పిల్లి-ఎలుకల ఆట తీరు బీజేపీ కేడర్‌కు చేదుగుళికగా మారింది. శివసేన మొదట ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోవడమే కాదు. బీజేపీని అది పూర్తిగా పక్కకు నెట్టి వేసింది. తర్వాత అది ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, ప్రభుత్వంలో ప్రతిపక్షం పాత్రను పోషిస్తూనే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శివసేన ఒకవైపు రేచుకుక్క లాగా వేటాడుతూ, మరోవైపు కుందేళ్లతో పరుగు సాగి స్తోంది. రెండు పార్టీలలోని కేడర్‌కు ఇది నచ్చడం లేదు. స్పష్టంగానే ఇది ఒక అసౌకర్యాన్నే తలపిస్తోంది. తరచుగా శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో తన భాగస్వామిపై అటు ఢిల్లీలోనూ, ఇటు ముంబైలోనూ నిప్పులు కురిపి స్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఒంటరి ప్రచారానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడు ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో ఇది మొదలవుతుంది. పొత్తు కుదిరిన తొలినాళ్లలో శివసేన నిజంగానే కొర డాను చేత బట్టుకుని ఉండేది. బాల్‌థాక్రే నోట్లోంచి మాట వచ్చిందే తడవుగా, ప్రమోద్ మహాజన్ థాక్రే నివాసానికి పరుగెత్తుకుని వచ్చి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాం టిది ‘మమ్మల్ని కూడా కాస్త గౌరవించండి’ అంటూ శివసేన ప్రస్తుత అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది. పైగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శివ సేన లోగో అయిన పులి అందరికీ తెలిసినట్లే తక్కువగా గర్జి స్తుంది. ఉద్ధవ్ దానికి అనుగుణంగానే చెప్పారు, ‘‘అవును, మేము పొత్తును విచ్ఛిన్నపర్చం’’. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఠాక్రేపై హత్యాయత్నం చేశాం!
ముంబై దాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్ గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఈ రోజు కోర్టుకు మరిన్ని వివరాలు వెల్లడించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గతంలో అనేకసార్లు హెడ్లీని విచారించిన ముంబై న్యాయస్థానం తాజాగా మరోమారు విచారణ చేపట్టింది. శివసేన వ్యవస్థాపకుడు బాల ఠాక్రేని చంపేందుకు ఓ వ్యక్తి ఉగ్రవాద దుస్తులు ధరించి ప్రయత్నించాడని, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, అయితే అతడు ఆ తర్వాత కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడని తాజా విచారణలో భాగంగా డేవిడ్ కోల్మన్ హెడ్లీ కోర్టుకు తెలిపాడు. తన పర్యవేక్షకుడు సాజిద్ మీర్ సూచనల మేరకు తాను కూడా శివశేన నాయకుడ్ని చంపే లక్ష్యంతో రెండుమార్లు సేనా భవన్ సందర్శించానన్నాడు. ఠాక్రేను లష్కరే తాయిబా ఎందుకు చంపాలనుకుందో తనకు తెలియకపోయినా.. చంపడమే లక్ష్యం కావడంతో ప్రయత్నం మాత్రం చేశానని క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హెడ్లీ వెల్లడించాడు. అమెరికన్ చట్టాల్లో ప్రాధేయపడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అనేది లేదని, మీరు క్షమించినా లేకపోయినా నేరాన్ని కోర్టు ముందు అంగీకరించి ప్రాధేయపడుతున్నానని హెడ్లీ కోర్టుకు వివరించాడు. ముంబై కోర్టుకు తాను వాగ్మూలం ఇవ్వడం ద్వారా అమెరికా విట్నెస్ ప్రొటెక్షన్ లో తనకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నాడు. అంతేకాక తాను అమెరికా పాస్‌పోర్టులో పేరు మార్చుకునేందుకు అక్కడి అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని హెడ్లీ స్పష్టం చేశాడు.