birmingham
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం
బిర్మింగ్హమ్: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నగరంలో రెస్టారెంట్లు, బార్లకు నిలయమైన ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు. -
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్‌హామ్ కౌన్సిల్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్‌లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
తొలిటెస్టు ఆసీస్‌దే.. ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం (ఫొటోలు)
-
చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడం మ్యాచ్‌ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు వీరోచిత పోరాటం ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించింది. బజ్‌బాల్ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం. ► ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం ► ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను, 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్‌ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్‌ను, 2008లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి. ► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు బాబ్ సింప్సన్ నాలుగుసార్లు, జార్జ్ గిఫెన్ రెండుసార్లు, వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్, పాట్ కమిన్స్ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు. ► టెస్టుల్లో చేజింగ్ సందర్భాల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్ కమిన్స్-నాథన్ లియోన్ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్‌తో టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్‌టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్‌టౌన్, 1999 ఉన్నారు. ► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు, ఇయాన్ చాపెల్ 1972లో పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు కొట్టాడు. ► యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్‌ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్‌ను అడిలైడ్ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో(2023లో) 281 పరుగుల టార్గెట్‌ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్‌ను చేధించింది. ► యాషెస్ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్ మూడు సందర్భాల్లో ఒక వికెట్ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా?
'బజ్‌బాల్' అంటూ దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా ముకుతాడు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. అయితే చివరి రోజు బౌలర్లకు అనూకూలంగా ఉంటుందన్న అంశం ఇంగ్లండ్ బౌలర్లకు ఊరటనిచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ పోరాడకుండా మాత్రం ఉండదు. చేయాల్సింది 174 పరుగులే కావడం.. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ఉండగా.. ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఆసీస్ తొలి టెస్టును కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. 2005 రిపీట్ అవుతుందా? అయితే 2005లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అప్పట్లో 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినప్పటికి చివర్లో షేన్ వార్న్ 42, బ్రెట్ లీ 43 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 2023లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పరిస్థితి కూడా అచ్చం అదే పరిస్థితిని తలపిస్తుంది. బజ్‌బాల్ మంత్రంతో ఇంగ్లండ్ ఆసీస్ ఆట కట్టిస్తుందా లేక ఆసీస్ ఇంగ్లండ్‌కు షాకిస్తుందా అన్నది చూడాలి. చదవండి: #Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు -
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్‌గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్‌గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్‌లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్‌సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్‌లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్‌హమ్‌లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్‌లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు..
బర్మింగ్హమ్: ప్రతిష్టాతక్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్హమ్లో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే మాత్రం ఈ ఇద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్ మిస్ అయింది. #AllEngland2023 #Badminton 🏸 ✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d — The Field (@thefield_in) March 18, 2023 చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు -
సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్ నెంబర్‌వన్ జోడి.. మాజీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్స్ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. Women on a mission went past WR-9 pair in style 😎🔥 📸: @badmintonphoto #AllEngland2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ce4NANZnWN — BAI Media (@BAI_Media) March 16, 2023 ✅ @BAI_Media https://t.co/Iau4RzgK0Y pic.twitter.com/2YlD6gKmKg — 🏆 Yonex All England Badminton Championships 🏆 (@YonexAllEngland) March 16, 2023 -
చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్‌స్టోన్
హండ్రెడ్ లీగ్ 2022లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్‌హామ్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్‌హామ్ కోల్పోయిన 3 వికెట్లు లూక్ వుడ్ ఖాతాలో చేరాయి. అంతకుముందు డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్ రాకెట్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్ హేల్స్ (1), డేవిడ్ మలాన్ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్‌హామ్ బౌలర్ హోవెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బర్మింగ్‌హామ్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్‌లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్ రాకెట్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన లండన్ స్పిరిట్ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఓవల్ ఇన్విన్సిబుల్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్ సూపర్ చార్జర్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), సథరన్ బ్రేవ్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్ ఒరిజినల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు), వెల్ష్ ఫైర్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్సెంటి అండ్ గ్రెనడైన్స్కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్లాక్తో తలపడనుంది. చదవండి: Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్
-
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి!
న్యూఢిల్లీ: గత కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికలకు భిన్నంగా ఈ సారి బర్మింగ్‌హామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా మెగా ఈవెంట్ జరిగితే ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించి అందులో అందరికి వసతి ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో ఒక దేశానికి చెందిన అథ్లెట్ల బృందం ఒకే చోట ఉండటం కుదరదు. కరోనా తదితర కారణాలతో ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం 5000 పైచిలుకు అథ్లెట్ల కోసం బర్మింగ్‌హామ్‌లో ఐదు క్రీడా గ్రామాల్ని అందుబాటులోకి తెచ్చింది. 16 క్రీడాంశాల్లో పోటీపడే 215 మంది భారత అథ్లెట్లు ఇప్పుడు ఈ ఐదు వేర్వేరు క్రీడా గ్రామాల్లో బసచేయాల్సి ఉంటుంది. కోచ్‌లు, అధికారులు కలుపుకుంటే భారత్‌నుంచి 325 మంది బర్మింగ్‌హామ్ ఫ్లయిట్ ఎక్కనున్నారు. బస ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాల వివరాలను ఆర్గనైజింగ్ కమిటీ భారత ఒలింపిక్ సంఘాని (ఐఓఏ)కి సమాచార మిచ్చింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగనున్నాయి. -
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోహిత్.. ఆర్‌టీపీసీఆర్‌లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా జంట
రోత్సె క్లాసిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. బర్మింగ్హమ్లో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 6–2తో అలీసియా బార్నెట్–ఒలీవియా నికోల్స్ (బ్రిటన్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. చదవండి: World Youth Weightlifting Championship: భళా గురు... -
ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్ వరుసగా యూకేలోని మ్యూజిక్ కన్సర్ట్స్కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో బర్మింగ్‌హెమ్‌లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్న జానీ డెప్ రెస్టారెంట్‌కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు. చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్ దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా బర్మింగ్‌హోమ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్లో జానీ డెప్ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టెయిల్స్, రోజీ ‘ఆంపైయిన్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్ డిషెస్ టేస్ట్ చేసిన జానీ డెప్ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్ వెయిటర్స్‌ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు. చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్? దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తమ రెస్టారెంట్లో డిన్నర్‌కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ట్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో అతిపెద్ద రెస్టారెంట్స్‌లో ఇండియన్ ‘వారణాసి’ రెస్టారెంట్ ఒకటి. -
24 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ.. అయితే..?
Cricket Returns To Commonwealth Games: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లోకి క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బర్మింగ్హమ్(ఇంగ్లండ్) వేదికగా జరిగే 22వ ఎడిషన్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించింది. అయితే, ఈ సారికి కేవలం మహిళల క్రికట్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్). టీ20 ఫార్మాట్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో సాగే ఈ గేమ్స్‌లో మొత్తం 8 జట్లు(భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, బార్బడోస్, సౌతాఫ్రికా, శ్రీలంక) పాల్గొనేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. జులై 29న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ క్రీడలు.. ఆగస్ట్ 7న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌తో ముగుస్తాయి. ఈ మేరకు ఐసీసీ, సీజీఎఫ్ మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, 1998(మలేషియా)లో చివరిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు(50 ఓవర్ల ఫార్మాట్) ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. నాడు షాన్ పొలాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్టీవ్ వా సారధ్యంలోని ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఇదిలా ఉంటే, 72 దేశాలకు చెందిన 4500 అథ్లెట్లు జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటారు. చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే.. -
Commonwealth Games: తప్పనిసరి క్రీడాంశాలుగా ఆ రెండు!
Commonwealth Games: 2026- 2030 Roadmap(London): భవిష్యత్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) 2026–2030కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను జనరల్ అసెంబ్లీలో అమోదించింది. దీని ప్రకారం 2026 నుంచి జరిగే సీడబ్ల్యూజీలో క్రీడాంశాల సంఖ్య తగ్గనుంది. వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2026 నుంచి క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గనుంది. వీటిలో అథ్లెటిక్స్, అక్వాటిక్స్ (స్విమ్మింగ్) మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇక మిగిలిన క్రీడాంశాలను కొనసాగించే నిర్ణయాన్ని ఆతిథ్య దేశానికి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆప్షనల్ గ్రూప్‌లో ఉన్న క్రికెట్, 3x3 బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్‌లను కోర్ గ్రూప్‌లోకి మారుస్తూ సీజీఎఫ్ తీర్మానించింది. కాగా గేమ్స్ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజీఎఫ్ అధ్యక్షురాలు డెమె లూసీ మార్టిన్ తెలిపారు. తాజా మార్పులతో గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలకు లబ్ధి జరగనుంది. తాము ఏ క్రీడాంశాల్లో పతకాలను ఎక్కువగా గెలవగలమో వాటికి ఆ దేశాలు పెద్ద పీట వేస్తాయి. 2026 కామన్వెల్త్ గేమ్స్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు -
సినీ ఫక్కీలో స్టార్ హీరో కారు చోరీ
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్ చేయగలిగిన పోలీసులు. కానీ.. కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. చాలా తెలివిగా.. మోడ్రన్ డే కారులు కీలెస్గా, ఇగ్నిషన్ ఫోబ్స్తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్లెస్ ట్రాన్స్మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారు చోరీకి గురైంది. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్‌ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పని చేయకుండా చేశారు. అటుపై దర్జాగా కారును వేసుకుని వెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు. ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష పౌండ్లు విలువ(మన కరెన్సీలో కోటి రూపాయలు) చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది. టాప్ స్పీడ్ 249 కిలోమీటర్లు. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న.. MI-7 వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది.